January 10, 2025

National Constitutional Day Quotations by Dr. B.R. Ambedkar| నేడు భారత రాజ్యాంగ దినోత్సవం|

” రాజకీయమనే దేహం రోగగ్రస్తం అయినప్పుడు తప్పకుండా దానికి మందు ఇవ్వాలి. చట్టం మరియు శాసనం అనే మందుతో దానికి చికిత్స చేయాలి.”

National Constitutional Day Quotations by Dr. B.R. Ambedkar

National Constitutional Day Quotations by Dr. B.R. Ambedkar

National Constitutional Day Quotations by Dr. B.R. Ambedkar| నేడు భారత రాజ్యాంగ దినోత్సవం|

జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భం గా భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ వివిధ సందర్భాలలో చెప్పిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం నవంబర్ 26 వ తేదీన భారత రాజ్యాంగ దినోత్సవం గా జరుపుకొంటున్నాం. ఎంతో శ్రమించి రాయబడిన రాజ్యాంగం ఆమోదం పొందిన దినాన్ని భారత రాజ్యాంగ దినోత్సవం గా జరుపుకొంటున్నాం.National Constitutional Day Quotations

“The Constitution is not a mere lawyer’s document; it is a vehicle of life, and its spirit is always the spirit of the age.”
“రాజ్యాంగం  ఒక న్యాయవాదుల పత్రం మాత్రమే కాదు; ఇది జీవన సాధనం, మరియు రాజ్యాంగం యొక్క ఆత్మ కాలానికి  అనుగుణంగా ఉంటుంది.”

 

“We are Indians, firstly and lastly.”
“ఆద్యంతాలలో ఎప్పటికీ మనం భారతీయులమే.”

 

“A great man is different from an eminent one in that he is ready to be the servant of society.”
” ఒక ప్రముఖమైన వ్యక్తి కంటే ఎప్పుడూ  సమాజానికి సేవ చేయడానికి సిద్ధం గా ఉండే వారినే గొప్ప వ్యక్తి అనవచ్చు”

 

“Democracy is not merely a form of government. It is primarily a mode of associated living.”
“ప్రజాస్వామ్యం అనేది కేవలం ప్రభుత్వం యొక్క ఒక రూపం మాత్రమే కాదు. ప్రాథమికం గా ఇది మానవ జీవనశైలిని తెలియజేస్తుంది.”

 

“I measure the progress of a community by the degree of progress which women have achieved.”
“సమాజం లో  స్త్రీలు సాధించిన పురోగతి ద్వారా మాత్రమే ఆ సమాజం యొక్క ప్రగతిని కొలుస్తాను.”

 

“If I find the Constitution being misused, I shall be the first to burn it.”
“ఎప్పుడైనా రాజ్యాంగం  దుర్వినియోగం  అవుతుందని నాకు అనిపిస్తే, దాన్ని తగలబెట్టే మొదటి వ్యక్తిని నేనే.”

 

“Constitutional morality is not a natural sentiment. It has to be cultivated.”
“రాజ్యాంగ  నైతికత సహజమైన భావన కాదు. దాన్ని మనం పెంపొందించు కోవాలి.”

 

“Cultivation of mind should be the ultimate aim of human existence.”
“మానసిక ఎదుగుదల  మానవ జీవన లక్ష్యం కావాలి.”

 

“Liberty, equality, and fraternity are not to be treated as separate items but as a trinity.”
“స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే అంశాలను వేరుగా చూడకూడదు. వీటిని రాజ్యాంగం యొక్క త్రిత్వము గా భావించాలి.”

 

“Political democracy cannot last unless there lies at the base of it social democracy.”
” దేశ మూలాలలో సామాజిక ప్రజాస్వామ్యం పరిడవిల్లకపోతే  రాజకీయ ప్రజాస్వామ్యం నిలబడదు.”

 

“Indians today are governed by two ideologies: their political ideal set in the Constitution and their social ideal rooted in religion.”
“ఈరోజు భారతీయులు రెండు సిద్ధాంతాల చేత పరి పాలించబడుతున్నారు.. ఒకటి రాజ్యాంగం లో పొందుపరచిన రాజకీయ ధర్మం, రెండవది మతప్రాతిపదిక కలిగిన సామాజిక ధర్మం”

 

“Justice has always evoked ideas of equality.”
“న్యాయం ఎల్లప్పుడూ సమానత్వపు ఆలోచనలను కలిగిస్తుంది.”

 

“A nation may lose its independence, but a people cannot lose their rights.”
“ఒక దేశం తన స్వతంత్రాన్ని కోల్పోవచ్చు, కానీ ప్రజలు వారి హక్కులను కోల్పోలేరు.”

 

“Equality may be a fiction, but nonetheless, one must accept it as a governing principle.”
“సమానత్వం కల్పితం కావొచ్చు, కానీ దానిని పరి పాలనా సూత్రంగా మాత్రం స్వీకరించాలి.”

 

“Law and order are the medicine of the body politic, and when the body politic gets sick, medicine must be administered.”
” రాజకీయమనే దేహం రోగగ్రస్తం అయినప్పుడు తప్పకుండా దానికి మందు ఇవ్వాలి. చట్టం మరియు శాసనం అనే మందుతో దానికి చికిత్స చేయాలి.”

 

“Without education, liberty is meaningless.”
“విద్య లేకుండా స్వేచ్ఛకు అర్ధమే లేదు.”

 

“History shows that where ethics and economics come in conflict, victory is always with economics.”
“చరిత్ర ప్రకారం .. నైతికత మరియు ఆర్ధిక శాస్త్రం మధ్య క్లిష్టత ఏర్పడినప్పుడు , ఆర్దిక శాస్త్రాన్నే విజయం వరిస్తుంది.”

 

“The sovereignty of scriptures of all religions must come to an end if we want to have a united modern India.”
“అన్ని మత గ్రంథాల యొక్క ఆధిపత్యం ముగిస్తేనే ఆధునిక భారత దేశం ఏర్పడుతుంది.”

 

“We must stand on our own feet and fight as best as we can for our rights.”
“మన హక్కుల కోసం మన కాళ్ళ పై మనమే నిలబడి సాధ్యమైనంత పోరాటం చేయాలి “

 

“The progress of any society depends on the progress of the least privileged sections.”
“ఏ సమాజం యొక్క పురోగతి అయినా  ఆ సమాజం లోని  అణగారిన వర్గాల పురోగతిపై ఆధారపడి ఉంటుంది.”(National Constitutional Day Quotations)