March 7, 2026
Home » కొత్త ఉద్యోగం – కొత్తగా జీతం – పొదుపు ప్రారంభించండి – New Job New Salary Save Money

కొత్త ఉద్యోగం – కొత్తగా జీతం – పొదుపు ప్రారంభించండి – New Job New Salary Save Money

మీ జీతం చేతికి వచ్చిన వెంటనే, కనీసం ముప్పై శాతం డబ్బును పొదుపు కోసం వేరే అకౌంట్ కు బదిలీ చేసుకోవాలి.

new job new salary save money

new job new salary save money

కొత్త ఉద్యోగం – కొత్తగా జీతం – పొదుపు ప్రారంభించండి-New Job New Salary Save Money

కొత్తగా ఉద్యోగం వచ్చిందంటే జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైనట్టే.
ప్రతి నెల జీతం చేతికి రావడం చాలా ఆనందం గా ఉంటుంది. కానీ ఆ జీతం ఎలా ఖర్చు చేస్తాం అన్నదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.డబ్బు ఎంత సంపాదిస్తున్నాం అనే దానికంటే ఆ డబ్బును ఎలా వినియోగిస్తున్నామనేదే ముఖ్యం అని ఆర్థిక శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

1. ముందు పొదుపు ఆ తర్వాత ఖర్చు :

అవసరాల కోసం, విలాసాల కోసం డబ్బు ఖర్చు పెట్టేసి తర్వాత మిగిలినది పొదువు చేయడం కాదు. ముందు పొదుపు చేసి ఆ తర్వాతే మిగిలిన డబ్బు ఖర్చు పెట్టడం అలవాటు చేసుకోవాలి.
మీ జీతం చేతికి వచ్చిన వెంటనే, కనీసం ముప్పై శాతం డబ్బును పొదుపు కోసం వేరే అకౌంట్ కు బదిలీ చేసుకోవాలి. ఈ డబ్బు ఖర్చు పెట్టుకోవడం కోసం కాదు. భవిష్యత్తు అవసరాల కోసం ఈ డబ్బును పొదుపు చేసుకోవాలి.(New Job New Salary Save Money)

2. ఎమర్జెన్సీ ఫండ్ తప్పనిసరి.(New Job New Salary Save Money)

కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపడా డబ్బు సులభంగా తీసుకునే అకౌంట్‌లో ఉండాలి.
ఒక వేళ మీ ఉద్యోగం లో ఏదైనా సమస్య వచ్చినా,  ఉద్యోగం పోయినా, ఆరోగ్య పరం గా అనుకోని ఖర్చులు వచ్చినా ఈ ఎమర్జెన్సీ ఫండ్ మీకు భరోసా ఇస్తుంది. ఒక ఆరు నెలల లోపు మీరు ఏదైనా ఒక కొత్త ఉద్యోగం లో చేరే వరకూ ఇతరులపై ఆదారపడ వలసిన అవసరం ఉండదు.

3.అవసరం లేని అప్పులకు దూరంగా ఉండండి.

క్రెడిట్ కార్డు అంటే అదనపు ఆదాయం కాదు. క్రెడిట్ కార్డు వలలో అసలు పడకండి. క్రెడిట్ కార్డు అంటే  భవిష్యత్తు జీతాన్ని ముందే ఖర్చు చేయడం. క్రెడిట్ లిమిట్ అయిపోయిన తర్వాత పూర్తి పేమెంట్ కట్టలేక మినిమం బ్యాలన్స్ లు కట్టుకొనే పరిస్థితి తెచ్చుకోకూడదు. చాలా బ్యాంకులు కొత్తగా ఉద్యోగం లో చేరిన వారిని టార్గెట్ చేసి వారికి క్రెడిట్ కార్డులను అంటగట్టి చివరకు వారిని అప్పుల ఊబిలో కూరుకు పోయేలా చేస్తున్నాయి. ఈ బ్యాంకుల యొక్క ప్రధాన ఆదాయ వనరు క్రెడిట్ కార్డు చెల్లింపు దారులే అంటే అతిశయోక్తి కాదు.New Job New Salary Save Money

4. యవ్వనం లోనే పొదుపు ప్రారంభించండి

చిన్న మొత్తమే అయినా సరే యవ్వనం లో  ఉన్నప్పుడే మీరు పెట్టుబడి ప్రారంభించాలి.. SIP లు, మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ పథకాలు, ఇన్సూరెన్స్ లాంటివి అన్నీ మీ యాభై ఏళ్ల తర్వాత జీవితానికి ఎంతగానో ఉపయోగపడే సాధనాలు. మీరు ఇరవై అయిదేళ్ల వయసులో వెయ్యి రూపాయలు పెట్టుబడి పెడితే యాభై ఏళ్లకు వచ్చే ఆదాయం ఒకలా ఉంటుంది. అదే వెయ్యి రూపాయలు నలభై ఏళ్లకు పొదుపు చెయ్యడం ప్రారంభిస్తే అంత ఆదాయం లభించదు. కాలమే ఇక్కడ మీకు పెద్ద మిత్రుడు. కాబట్టి పాతికేళ్ళ లోపు ఎంత త్వరగా పొదుపు చేయడం ప్రారంభిస్తే యాభై ఏళ్ల తర్వాత మీ జీవితం అంత ఆనందం గా ఉంటుంది.

5. లక్ష్యాలకు అనుగుణం గా జీవన శైలి :New Job New Salary Save Money

మన జీతాన్ని బట్టి మన జీవన శైలి ని మార్చుకోవడం కాదు. మీ లక్ష్యాలకు అనుగుణం గా మీ జీవన శైలిని నిర్ణయించుకోవాలి. ఎప్పుడూ ఇతరులతో పోల్చుకొని ఖర్చులు పెట్టవద్దు. మన పోటీ ఎప్పుడూ మన భవిష్యత్తు తో ఉండాలి. మన స్టేటస్ మనం వాడే వస్తువులు, మనం వాడే వాహనాలను బట్టి ఉంటుందనుకోవడం  కరెక్ట్ కాదు. కష్టం ఎదురైనప్పుడు మరొకరి ముందు చేయి చాచడం కంటే మనం పొదుపు చేసిన సొమ్మును వాడుకోవడం అసలైన స్టేటస్ అవుతుంది.

6. రెండవ ఆదాయ వనరు ఉండాలి

మనం ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలంటే, ఎప్పుడూ ఒకే ఆదాయంపై ఆధారపడకండి. పరిస్థితులు ఎలా మారతాయో ఎవరూ చెప్పలేం. కాబట్టి ప్రధాన ఆదాయ వనరుతో పాటు సైడ్ ఇన్కం కూడా ఉండేలా మీ నైపుణ్యాలను పెంచుకోండి. ఏదో ఒక కొత్త స్కిల్ నేర్చుకోండి. తద్వారా రెండవ ఆదాయ వనరు ద్వారా కూడా డబ్బు సంపాదించండి అది చాలా కొద్ది మొత్తమైనా సరే… (New Job New Salary Save Money)

7. emi లకు దూరం గా ఉండాలి.

కొత్తగా ఉద్యోగం వచ్చినప్పుడు మనల్ని ట్రాక్ తప్పేటట్లు చేసేవి ఈ ఎం ఐ లే. నెలవారీ గా కట్టుకోవడానికి పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదు అనుకొని వస్తువులను, వాహనాలను ఈ ఎంఐ లో తీసుకొంటాం. అక్కడనుండి సమస్యలు ప్రారంభం అవుతాయి. కాబట్టి ఏదైనా తప్పనిసరి అవసరం ఉంటే మాత్రమే ఎలా నెలవారీడబ్బు కట్టే పద్దతికి ఓకే చెప్పాలి గాని అవసరం ఉన్నా లేకపోయినా ఈ ఎం ఐ లో వస్తువులు కొనడం సరైన పధ్ధతి కాదు. ఆన్ లైన్ షాపింగ్ కు కూడా దూరం గా ఉండాలి. సోషల్ మీడియా లో మనకు కనిపించినవి అన్నీ కొనాలంటే మనం ఆస్తులు అమ్ముకోవలసిందే.

ఇలా క్రమంగా ముందుకు వెళ్తే,
యాభై ఏళ్లు వచ్చేసరికి ఇకపై పని చెయ్యాలా వద్దా అని నిర్ణయంచుకునే సంపూర్ణ స్వేచ్చ మీకు లభిస్తుంది.
మిగిలిన జీవితాన్ని టెన్షన్ తోనో చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండానో గడిపే దుర్భర జీవితం ఉండదు. శేష  జీవితం బాగుండాలంటే యవ్వనం లోనే మీరు మేలుకోవాలి. ఆత్మవిశ్వాసంతో, సంపూర్ణ శాంతి గా జీవించాలంటే తొలినాళ్ళ లో  తీసుకొనే నిర్ణయాలే కీలకం అని మర్చిపోకండి.New Job New Salary Save Money

చివరగా ఒక మాట

డబ్బును మీరు నియంత్రించండి. అంతే గాని
డబ్బు మిమ్మల్ని నియంత్రించనివ్వొద్దు. ఆల్ ద బెస్ట్