January 10, 2025

Nigeria fuel tanker accident| నైజీరియాలో ఆయిల్ టాంకర్ బోల్తా-153 మంది మృతి

టాంకర్  బోల్తా పడగానే దగ్గర గ్రామాలలోని ప్రజలు వెంటనే అక్కడకు చేరి లీక్ అవుతున్న ఇంధనాన్ని తీసుకుపోవడానికి పోటీ పడ్డారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత స్థానిక పోలీసులు అక్కడకు చేరుకొని అక్కడ గుమికూడిన ప్రజలను హెచ్చరించినప్పటికీ లాభం లేక పోయింది.

Nigeria fuel tanker accident

Nigeria fuel tanker accident ప్రతీకాత్మక చిత్రం (pexels)

Nigeria fuel tanker accident| నైజీరియాలో ఆయిల్ టాంకర్ బోల్తా-153 మంది మృతి

అత్యాశ అనేక మంది ఉసురు తీసింది. టాంకర్ నుండి లీక్ అవుతున్న పెట్రోల్ ను పొందడానికి వెళ్లి తమ ప్రాణాలనే కోల్పోయారు అనేకమంది. మన దేశం లో కూడా అనేక సందర్భాలలో ఇటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఉచితం గా వచ్చే వాటికోసం, హైవే లలో ట్రక్కులు ప్రమాదానికి గురైనప్పుడు ఆ సరుకులను దోచుకుపోవడం తరచూ మనం చూస్తూనే ఉంటాం. ఇటువంటి సంఘటనే నైజీరియా లో ఇటీవల జరిగింది.(Nigeria fuel tanker accident)

నైజీరియా లో జరిగిన ఒక ఆయిల్ టాంకర్ పేలుడు లో దాదాపు 153 మంది మరణించారు. అనేక మంది గాయాల పాలయ్యారు. ఇంధనాన్ని తీసుకు వెళ్తున్న టాంకర్ ను డ్రైవర్ అదుపు చేయలేక పోవడం తో ఈ ప్రమాదం జరిగింది. నైజీరియా లోని జిగావా రాష్ట్రం లోని మజియా పట్టణం దగ్గర ఈ సంఘటన జరిగింది. ఇంధన టాంకర్ నుండి కారిపోతున్న ఇంధనాన్ని తమ పాత్రలలో నింపుకోవడానికి జనం గుమికూడిన తర్వాత ఉన్నట్టుండి ఈ పేలుడు సంభవించింది. దీనితో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అక్టోబర్ 15, 2024 మంగళ వారం  అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది.

టాంకర్  బోల్తా పడగానే దగ్గర గ్రామాలలోని ప్రజలు వెంటనే అక్కడకు చేరి లీక్ అవుతున్న ఇంధనాన్ని తీసుకుపోవడానికి పోటీ పడ్డారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత స్థానిక పోలీసులు అక్కడకు చేరుకొని అక్కడ గుమికూడిన ప్రజలను హెచ్చరించినప్పటికీ లాభం లేక పోయింది. విలువైన ఇంధనం ఉచితం గా దొరుకుతూ ఉండటం తో జనం ఎగబడ్డారు. ప్రమాదం అని తెలిసినప్పటికీ అత్యాశ తో ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయాల పాలై ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు.(Nigeria fuel tanker accident)

నైజీరియా లో ప్రధానం గా ఇంధనం రోడ్ మార్గం గుండానే ఎక్కువగా ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తారు. రైలు మార్గం ద్వారా గాని ఇతర మార్గాల ద్వారా అంతగా రవాణా చేసే అవకాశాలు తక్కువ. అందుచేత రోడ్ మార్గం ద్వారా ఇంధనం రవాణా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇలా ఇంధన టాంకర్ లు బోల్తా పడి అనేక మంది మృత్యు వాత పడుతున్నారు.

నైజీరియా ప్రపంచం లోనే అత్యధిక  ఇంధనం ఉత్పత్తి చేసే దేశం. అయినప్పటికీ అక్కడ  ఇంధనం యొక్క ధరలు ఈ మధ్య బాగా పెరిగాయి.. ఈ మధ్య కాలం లో ప్రభుత్వం కొన్ని సబ్సిడీలు ఎత్తివేయడం తో  దాదాపు మూడు రెట్లు ఎక్కువ ధరకు అక్కడి ప్రజలు కొంటున్నారు. దీనితో ఇంధన టాంకర్ లు ఎక్కడ బోల్తా పడినా ప్రజలు తండోపతండాలుగా వెళ్లి సేకరించడం సామాన్య విషయం గా ఉంది. ప్రభుత్వం ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయని ఎంతగా హెచ్చరించినా ప్రజలలో ఎటువంటి మార్పు రాకపోవడం తో ఏటా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు.(Nigeria fuel tanker accident)

ఇంధన ధరలు విపరీతం గా పెరగడం తో హైవేల వెంబడి ఉన్న గ్రామాలలో ఈ ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఈ విషయమై స్థానిక ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతి ఏటా అనేక ప్రమాదాలు జరగడం అనేక మంది ప్రాణాలు కోల్పోవడం , అనేక మంది క్షత గాత్రులు కావడం గమనార్హం.