Ola Electric Bike for 49,999| Dasara Deepavali 2024 BOSS Offer| Vijay News Telugu
ఈ సంవత్సరం దసరా మరియు దీపావళి పండుగల సందర్భం గా ఓలా కంపెనీ ఒక అద్బుతమైన ఆఫర్ ను ప్రకటించింది. 49,999/- రూపాయలకే బైక్ ను అందిస్తున్నట్టు ప్రకటించింది.
Ola Electric Bike for 49,999| Dasara Deepavali 2024 Offer
ఎలక్ట్రిక్ బైక్ ల రంగం లో అతి తక్కువ కాలం లోనే విశేషమైన ఆదరణ పొందాయి ఓలా ఎలెక్ట్రిక్ బైకులు. గత సంవత్సరాలతో పోలిస్తే ప్రస్తుతం ఎలెక్ట్రిక్ బైక్ ల వినియోగం బాగా పెరిగింది. పశ్చిమాసియా ప్రాంతం లో యుద్ధ వాతావరణం తో పెట్రోల్ రేట్లు మరింత గా పెరగవచ్చు అనే వదంతులు వ్యాపిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తం గా క్రూడ్ ఆయిల్ ధరలు తక్కువగానే ఉన్నప్పటికీ మన దేశం లో మాత్రం పెట్రోల్ రేట్లు ఆకాశాన్ని అంటుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితి లో ఎలెక్ట్రిక్ బైక్ ల వినియోగం కూడా బాగా పెరిగింది. అనేక కంపెనీలు ఎలెక్ట్రిక్ బైక్ లు తయారు చేస్తున్నప్పటికీ ఓలా కంపెనీ ఉత్పత్తి చేస్తున్న బైక్ లు మాత్రం విశేష ఆదరణ పొందాయి.(Ola Electric Bike for 49,999)
ఈ సంవత్సరం దసరా మరియు దీపావళి పండుగల సందర్భం గా ఓలా కంపెనీ ఒక అద్బుతమైన ఆఫర్ ను ప్రకటించింది. 49,999/- రూపాయలకే బైక్ ను అందిస్తున్నట్టు ప్రకటించింది. ఓలా ఎస్ – 1 (Ola S 1) శ్రేణి కి సంబంధించిన ప్రారంభ మోడల్ అయిన Ola S1 X బైక్ ను ఈ ధర కు అందిస్తున్నారు. ఈ ప్రారంభ మోడల్ ధర 75,000 రూపాయలు గా ఉండేది. ఒకేసారి 25 వేల రూపాయలు తగ్గించి కేవలం 49,999/- రూపాయలకు ఈ బైక్ ను విక్రయిస్తున్నారు.
Ola S1 X బైక్ 2 కిలో వాట్ సామర్ధ్యం కలిగిన బ్యాటరీ ని కలిగి ఉంటుంది. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 95 కిలోమీటర్లు ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. గరిష్ట వేగం 85 కిలోమీటర్లు. ఈ ప్రారంభ మోడల్ ను మాత్రమే ఈ ఆఫర్ లో విక్రయిస్తున్నారు. (Ola Electric Bike for 49,999)
Ola S1 X బైక్స్ మొత్తం మూడు రకాల బ్యాటరీ ఆప్షన్ల తో అందుబాటు లో ఉన్నాయి.
Ola S1 X 2kWh – ఈ బైక్ లో 2 కిలో వాట్ల సామర్ధ్యం గల బ్యాటరీ ఉంటుంది. ఒక సారి చార్జింగ్ చేస్తే 95 కిలో మీటర్లు ప్రయాణించ వచ్చు. గరిష్ట వేగం 85 కిలోమీటర్లు. 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని 4.1 సెకన్ల లో అందుకోగలదు. ఎక్స్ షోరూం ధర 69,999/- రూపాయలు గా ఉంది. ఈ మోడల్ బైక్ నే ‘బాస్’ ఆఫర్ క్రింద 49,999/- రూపాయలకు దసరా దీపావళి ఆఫర్ క్రింద విక్రయిస్తున్నారు. ఈ బైక్ లకు ఉన్న విపరీతమైన డిమాండ్ దృష్ట్యా ఆఫర్ ప్రకటించిన రెండు రోజులకే ఓలా వెబ్ సైట్ లో అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డు దర్శనం ఇస్తోంది.
Ola S1 X 3kWh – ఈ బైక్ లో 3 కిలో వాట్ల సామర్ధ్యం గల బ్యాటరీ ఉంటుంది. ఒకసారి చార్జింగ్ చేస్తే 143 కిలో మీటర్లు ప్రయాణించ వచ్చు. గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు. 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని 3.3 సెకన్ల లో అందుకోగలదు. ఈ బైక్ ఎక్స్ షోరూం ధర 77,999/- రూపాయలు గా ఉంది.
Ola S1 4kWh – ఈ బైక్ లో 4 కిలో వాట్ల సామర్ధ్యం గల బ్యాటరీ ఉంటుంది. ఒక సారి చార్జింగ్ చేస్తే 190 కిలోమీటర్లు ప్రయాణించ వచ్చు. గరిష్ట వేగం గంటకు 90 కిలో మీటర్లు. 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని 3.3 సెకన్ల లో అందుకోగలదు. ఈ బైక్ ఎక్స్ షోరూం ధర 91,999/- రూపాయలు గా ఉంది.
ఓలా కంపెనీ ఇతర మోడల్ బైక్స్ :
Ola S1 X+ – ఈ బైక్ లో 3 కిలో వాట్ల సామర్ధ్యం గల బ్యాటరీ ఉంటుంది. ఒకసారి చార్జింగ్ చేస్తే 151 కిలోమీటర్ల దూరం ప్రయాణించ వచ్చు. గరిష్ట వేగం గంటకు 90 కిలో మీటర్లు. 0 నుండి 40 కిలో మీటర్ల వేగాన్ని 3.3 సెకన్ల లో అందుకోగలదు. ఈ బైక్ యొక్క ఎక్స్ షోరూం ధర 94,999/- రూపాయలు గా ఉంది.
Ola S1 Air – ఈ బైక్ లో 3 కిలో వాట్ల సామర్ధ్యం గల బ్యాటరీ ఉంటుంది. ఒక సారి చార్జింగ్ చేస్తే 151 కిలోమీటర్ల దూరం ప్రయాణించ గలదు. గరిష్ట వేగం గంటకు 90 కిలో మీటర్లు. 0 నుండి 40 కిలో మీటర్ల వేగాన్ని 3.3 సెకన్ల లో అందుకోగలదు. ఎక్స్ షోరూం ధర 1,04,999/- రూపాయలు గా ఉంది. అయితే ఈ మోడల్ మిగిలిన వాటికంటే అధిక శక్తిని విడుదల చేస్తుంది. 6 kW శక్తి ని ఇస్తుంది.
Ola S1 Pro : ఈ బైక్ లో 4 కిలో వాట్ల సామర్ధ్యం గల బ్యాటరీ ఉంటుంది. ఒక సారి చార్జింగ్ చేస్తే 195 కిలోమీటర్ల దూరం ప్రయాణించ గలదు. గరిష్ట వేగం గంటకు 120 కిలో మీటర్లు. 0 నుండి 40 కిలో మీటర్ల వేగాన్ని 2.6 సెకన్ల లో అందుకోగలదు. ఎక్స్ షోరూం ధర 1,14,999/- రూపాయలు గా ఉంది. ఈ మోడల్ Ola శ్రేణి లోని అన్ని మోడల్ బైక్స్ కంటే అత్యదికం గా 11 kW శక్తిని విడుదల చేస్తుంది. అందువలన ఈ మోడల్ ధర మిగిలిన అన్నిటికంటే ఎక్కువగా ఉంటుంది.
అక్టోబర్ 3, 2024 నుండి ఆఫర్ ప్రకటించిన తర్వాత రెండు రోజలకే కంపెనీ వెబ్ సైట్ లో అవుట్ ఆఫ్ స్టాక్ కనిపిస్తోంది. దీపావళి వరకూ ఈ ఆఫర్ ను మళ్ళీ పొడిగించి బుకింగ్ ప్రారంభిస్తారేమో చూడాలి. (Ola Electric Bike for 49,999)
-Vijay Automobile Desk