నేడే విడుదల OTT లోనికి రెండు సూపర్ హిట్ సినిమాలు| ‘క’ మరియు లక్కీ భాస్కర్|KA and Lucky Bhaskar OTT release
బాక్సాఫీసు వద్ద ఈ సినిమాలు ఘన విజయం సాధించడం తో శాటిలైట్ రైట్స్ కూడా అత్యధిక మొత్తానికి అమ్ముడయ్యాయి. ఓటీటీ ప్లాట్ ఫాం లు ఈ సినిమాల కోసం భారీ మొత్తాలను వెచ్చించి మరీ కొనుగోలు చేయడం విశేషం.
నేడే విడుదల OTT లోనికి రెండు సూపర్ హిట్ సినిమాలు| ‘క’ మరియు ‘లక్కీ భాస్కర్’| KA and Lucky Bhaskar OTT release
అక్టోబర్ 31 న దీపావళి సందర్భం గా విడుదల అయిన మూడు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ సంచలన విజయం నమోదు చేసుకుంది. దుల్కర్ సల్మాన్ నటించిన ‘లక్కీ భాస్కర్’ 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి సూపర్ హిట్ గా నిలచింది. అలాగే సాయి పల్లవి నటించిన ‘అమరన్’ కూడా బాక్సాఫీస్ వద్ద చక్కటి విజయాన్ని నమోదు చేసుకుంది. KA and Lucky Bhaskar OTT release
సాధారణం గా దీపావళి సమయం లో విడుదలైన సినిమాలు అంతగా విజయం సాధించిన చరిత్ర లేదు. అయితే ట్రెండు కి భిన్నం గా ఈ సంవత్సరం విడుదలైన ఈ మూడు సినిమాలు విజయం సాధించాయి.
బాక్సాఫీసు వద్ద ఈ సినిమాలు ఘన విజయం సాధించడం తో శాటిలైట్ రైట్స్ కూడా అత్యధిక మొత్తానికి అమ్ముడయ్యాయి. ఓటీటీ ప్లాట్ ఫాం లు ఈ సినిమాల కోసం భారీ మొత్తాలను వెచ్చించి మరీ కొనుగోలు చేయడం విశేషం. నెలరోజులు తిరగక ముందే ఓటీటీ లోనికి రావడం తో ఇక్కడ కూడా భారీ విజయాలను స్వంతం చేసుకుంటాయని భావిస్తున్నారు.KA and Lucky Bhaskar OTT release
ఏ OTT లో ఏ సినిమా వస్తోంది అంటే…
కిరణ్ అబ్బవరం బ్లాక్ బస్టర్ ‘క’ సినిమా ‘ఈటీవీ విన్’ ప్లాట్ ఫారం లో నవంబర్ 28, 2024 నుండి OTT ప్రేక్షకులకు అందుబాటులోనికి వస్తోంది. దుల్కర్ సల్మాన్ నటించిన ‘లక్కీ భాస్కర్’ చిత్రం మాత్రం ‘నెట్ ఫ్లిక్స్’ లో అందుబాటులోనికి వస్తోంది. ఈ సినిమా కూడా నవంబర్ 28 నుండే Netflix లో అందుబాటులోనికి వస్తోంది.
ఈ విధంగా దీపావళి కి విడుదలై ఘనవిజయం సాధించిన రెండు సినిమాలు ఒకేరోజు OTT లోకి రావడం సినిమా ప్రేక్షకులకు ఆనందం కలిగించే విషయం అనడం అతిశయోక్తి కాదు.
‘క’ అనే విచిత్రమైన టైటిల్ తో హిట్ కొట్టిన సినిమా:
ఇతర భాషలలో వచ్చే థ్రిల్లర్ సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా ఇరవై నిమిషాల క్లైమాక్స్ లో ఒక క్రొత్త ప్రయోగం తో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం సాధించిన సినిమా ‘క’. థియేటర్లలో విడుదలైన మొదటి ఆట నుండే పాజిటివ్ రివ్యూ లను పొందింది ఈ చిన్న సినిమా. ఊహించని విధం గా క్లైమాక్స్ చిత్రీకరణ ఉండటం తో ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరధం పట్టారు.
థియేటర్లు ఇంకా ఎక్కువ దొరికి ఉంటే మరింత విజయం సాధించి ఉండేదని మూవీ టీం అభిప్రాయ పడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ సినిమాతో హీరో కిరణ్ అబ్బవరం రేంజ్ బాగా పెరిగిందనే చెప్పవచ్చు. 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ గా నిలచిన “క” సినిమా ఈటీవీ విన్ OTT లో ప్రదర్శిత మౌతోంది. ఈ సినిమా OTT లో కూడా సూపర్ హిట్ గా నిలుస్తుందని పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.