Padma Awards 2024-పద్మ విభూషణ్ చిరంజీవి, వెంకయ్య నాయుడు
పద్మ అవార్డుల ప్రకటన – పద్మ విభూషణ్ పురస్కారానికి శ్రీ చిరంజీవి, శ్రీ వెంకయ్య నాయుడు ఎంపిక
భారత దేశపు అత్యున్నత పౌర పురస్కారాలు ప్రతిష్టాత్మక ‘పద్మ’ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ప్రతి సంవత్సరం గణ తంత్ర దినోత్సవం సందర్భం గా ఈ పురస్కారాలను ప్రకటిస్తారు. తెలుగు రాష్ట్రాల నుండి మెగా స్టార్ చిరంజీవి, మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ‘పద్మ విభూషణ్ పురస్కారాలకు ఎంపిక అయ్యారు. పద్మ భూషణ్ అవార్డులు పొందిన వారిలో తమిళనాడు నుండి విజయ్ కాంత్, పశ్చిమ బెంగాల్ నుండి మిథున్ చక్రవర్తి , ఉషా ఉతుప్ తదితరులు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి 2006 లోనే ‘పద్మ భూషణ్’ పురస్కారం అందుకున్నారు.(Padma Awards 2024)
2024 సంవత్సరానికి గాను ప్రకటించిన అవార్డులలో 5 మందికి పద్మ విభూషణ్, 17 మందికి పద్మ భూషణ్, 110 మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. తెలుగు రాష్ట్రాల నుండి ఇద్దరికి పద్మ విభూషణ్ , ఆరుగురికి ‘పద్మశ్రీ’ అవార్డులు దక్కాయి. అవార్డులు పొందిన వారిలో 30 మంది మహిళలు ఉన్నారు. మరణానంతరం 9 మందికి పద్మ పురస్కారం లభించింది. విదేశీయులు ఎన్.ఆర్.ఐ విభాగం లో 8 మంది కి అవార్డులు దక్కాయి.(Padma Awards 2024)
పద్మ విభూషణ్ అవార్డులు పొందిన వారు (5 మంది )Padma Awards 2024
- శ్రీ కొణిదెల చిరంజీవి – కళా రంగం – (ఆంధ్రప్రదేశ్)
- శ్రీ ఎం. వెంకయ్య నాయుడు -పౌర సంబంధాలు – (ఆంధ్రప్రదేశ్)
- వైజయంతిమాల బాలి – కళా రంగం – (తమిళనాడు)
- శ్రీ బిందేశ్వర్ పాథక్ (మరణానంతరం)- సామాజిక సేవ – (బీహార్)
- పద్మా సుబ్రహ్మణ్యం – కళా రంగం – (తమిళనాడు)
పద్మ భూషణ్ అవార్డులు పొందిన వారు :(17 మంది)Padma Awards 2024
- ఎం. ఫాతిమా బీవి (మరణానంతరం ) – పబ్లిక్ అఫైర్స్ – (కేరళ )
- శ్రీ హార్ముస్ జీ ఎన్. కామా – సాహిత్యం విద్య-జర్నలిజం – (మహారాష్ట్ర)
- శ్రీ మిథున్ చక్రవర్తి – కళా రంగం – (పశ్చిమ బెంగాల్)
- శ్రీ సీతారాం జిందాల్ – వాణిజ్యం- పరిశ్రమలు – (కర్ణాటక)
- శ్రీ యాంగ్ లియు – వాణిజ్యం- పరిశ్రమలు – (తైవాన్)
- శ్రీ అశ్విన్ బాలా చంద్ మెహతా – వైద్య రంగం (మహారాష్ట్ర)
- శ్రీ సత్యబ్రత ముఖర్జీ (మరణాంతరం) – పౌర సంబంధాలు – (పశ్చిమ బెంగాల్)
- శ్రీ రాం నాయక్ – పౌర సంబంధాలు – (మహారాష్ట్ర)
- శ్రీ తేజస్ మధుసూదన్ పటేల్ – వైద్య రంగం – (గుజరాత్)
- శ్రీ ఒలన్ చేరి రాజగోపాల్ – పౌర సంబంధాలు- (కేరళ)
- శ్రీ దత్తాత్రేయ అంబ దాస్ మయాలూ అలియాస్ రాజ్ దత్ – కళారంగం – (మహారాష్ట్ర)
- శ్రీ తొగ్ డాన్ రిన్ పోచె (మరణానంతరం) – ఆధ్యాత్మిక రంగం- (లడఖ్)
- శ్రీ ప్యారేలాల్ శర్మ – కళారంగం – (మహారాష్ట్ర)
- శ్రీ చంద్రేశ్వర్ ప్రసాద్ ఠాకూర్ – వైద్య రంగం (బీహార్)
- ఉషా ఉతుప్ – కళారంగం – (పశ్చిమ బెంగాల్)
- శ్రీ విజయ కాంత్ (మరణాంతరం) – కళారంగం – (తమిళనాడు)
- శ్రీ కుందన్ వ్యాస్ – సాహిత్యం మరియు విద్య- జర్నలిజం – (మహారాష్ట్ర)
మొత్తం 110 మందికి పద్మ శ్రీ పురస్కారాలు లభించాయి. అందులో తెలుగు వారి వివరాలు ఇవి
- శ్రీ ఏ. వేలు ఆనందా చారి – కళారంగం – (తెలంగాణా)
- శ్రీ దాసరి కొండప్ప – కళారంగం – (తెలంగాణా)
- శ్రీమతి డి. ఉమా మహేశ్వరి – కళారంగం -(ఆంధ్రప్రదేశ్)
- శ్రీ గడ్డం సమ్మయ్య – కళారంగం – (తెలంగాణా)
- శ్రీ కేతావత్ సోం లాల్ – సాహిత్యం – విద్య (తెలంగాణా)
- శ్రీ కూరెళ్ళ విట్టలాచార్య – సాహిత్యం -విద్య (తెలంగాణా)
ప్రతి సంవత్సరం మూడు విభాగాలలో ఈ పురస్కారాలను ప్రకటిస్తారు. అవి పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు. ఈ పురస్కారాలను వివిధ రంగాలలో విశిష్ట సేవలు చేసిన వారికి ఇస్తారు. భారత రత్న అత్యున్నత పురస్కారం కాగా రెండవ అత్యున్నత పురస్కారం గా పద్మ విభూషణ్, మూడవ అత్యున్నత పురస్కారం గా పద్మ భూషణ్, నాలుగవ అత్యున్నత పురస్కారం గా పద్మ శ్రీ అవార్డులను ప్రకటిస్తారు. భారత్ రాష్ట్రపతి ఈ అవార్డులను అందజేస్తారు. సాధారణం గా ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ లో రాష్ట్రపతి భవన్ లో జరిగే వేడుక లో ఈ అవార్డులను ప్రధానం చేస్తారు.
పద్మ పురస్కారాలు ఎప్పుడు ప్రారంభించా రంటే…..
1954 వ సంవత్సరం లో ప్రభుత్వం రెండు అత్యున్నత పురస్కారాలను ఏర్పాటు చేసింది. భారత రత్న మరియు పద్మ విభూషణ్. పద్మ విభూషణ్ లో మూడు స్థాయిలు గా ఇవ్వాలనుకున్న అవార్డులను 1955 నుండి పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మ శ్రీ గా ఇవ్వాలని నిర్ణయించారు. 1954 సంవత్సరం నుండి ఏటా అందజేస్తున్న ఈ పురస్కారాలను 1978,1979 మరియు 1993 నుండి 1997 వరకూ మాత్రం ప్రకటించలేదు. అవార్డులకు ఎంపిక అయిన వారికి రాష్ట్రపతి సంతకం చేసిన సర్టిఫికేట్ (సనాద్), ప్రెసిడెంట్ మెడల్ ప్రధానం చేస్తారు. అవార్డులు గెలుచుకున్న వారి పేర్లను అధికారిక గెజిట్ లో ప్రచురిస్తారు. అయితే ఏటా ప్రకటించే ఈ పురస్కారాలు 120 కి మించకూడదు. ఈ సంఖ్య కు మరణానంతరం మరియు ఎన్.ఆర్.ఐ/ విదేశీ కోటా మినహాయింపు ఉంటుంది.
ప్రధాన మంత్రి ప్రతి సంవత్సరం పద్మ అవార్డుల కమిటీ ని ఏర్పాటు చేస్తారు. కేబినెట్ సెక్రటరీ అద్యక్షత వహించే ఈ కమిటీ లో హోమ్ సెక్రటరీ తో పాటు 4 నుండి 6 మంది ప్రముఖ వ్యక్తులు మెంబర్లు గా ఉంటారు. కమిటీ చేసిన ప్రతిపాదనలను ప్రధాన మంత్రికి సమర్పించిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం తో అవార్డులను ప్రకటిస్తారు.
పద్మ పురస్కారాలు పొందిన తెలుగు వారి లో కొందరు: