పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ పోటీ | Pawan Kalyan contest from Pithapuram
పిఠాపురం లో కూడా పవన్ కు విజయం నల్లేరు పై నడక మాత్రం కాదు. కచ్చితం గా వైసీపీ తనకున్న అన్ని శక్తి యుక్తులు ప్రదర్శిస్తుంది. పథకాల పేరుతో మరింత చేరువ కావడానికి ప్రయత్నిస్తుంది. పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికే చెందిన బలమైన అభ్యర్ధిని నిలబెడుతుంది. పవన్ కళ్యాణ్ ను ఈ సారి కూడా అసెంబ్లీకి రాకుండా చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది.
పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ పోటీ | Pawan Kalyan from Pithapuram
ఎట్టకేలకు తను పోటీ చేసే నియోజక వర్గాన్ని ప్రకటించారు పవన్ కళ్యాణ్. తాను ఈ సారి పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. దీనితో పవన్ కళ్యాణ్ పోటీ పై చాలా రోజులుగా నడుస్తున్న సస్పెన్స్ కు తెరపడింది. (Pawan Kalyan from Pitapuram)
కేంద్రం లో మంత్రి పదవి అంటూ ప్రచారం
ఈ సారి ఆయన కాకినాడ పార్లమెంట్ నియోజక వర్గం నుండి పోటీ చేస్తారని అందరూ భావించారు. పొత్తులో ఉన్న నాయకుల ప్రకటనలు కూడా దానిని బలపరచాయి. పార్లమెంట్ కు పోటీ చేయడం ద్వారా కేంద్రం లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ఆయనకు మంత్రి పదవి ఖాయం అంటూ ఊహాగానాలు మిన్నంటాయి. అదే సమయం లో రాష్ట్రం నుండి పవన్ ను తప్పించే ప్లాన్ చంద్రబాబు వేసారని, లోకేష్ ను రాష్ట్ర రాజకీయాలలో ప్రమోట్ చేసే ఉద్దేశం తోనే ఇలా జరిగిందని అందరూ భావించారు.
బాబు వ్యూహం అంటూ ఆందోళన (Pawan Kalyan from Pitapuram)
పవన్ కళ్యాణ్ ఏ సభ ఏర్పాటు చేసినా సి ఎం, సి ఎం, అంటూ అరిచే జనసేన పక్షాలకు ఇది మింగుడు పడలేదు. రాష్ట్రం లో పార్టీని తెలుగుదేశం కి తాకట్టు పెట్టారని రగిలి పోయారు. ఇచ్చిన 24 సీట్ల లోనూ కోత కోసి 21 సీట్ల కే పరిమితం చేశారని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను కూడా రాష్ట్ర రాజకీయాలకు దూరం గా కేంద్రానికి పంపడం బాబు వ్యూహమే అనేది జనసేన పార్టీ వాదన.
వీటన్నిటిని పటాపంచలు చేస్తూ పవన్ కళ్యాణ్ తాను పిఠాపురం నుండి పోటీ చేస్తున్నానని ప్రకటించడం తో జనసేన శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి గా చూడాలన్న తమ కలలు ఇంకా సజీవం గానే ఉన్నాయంటూ పలువురు జనసేన నాయకులు వ్యాఖ్యానించడం గమనార్హం.(Pawan Kalyan from Pitapuram)
ముద్రగడ పోటీ ఇక్కడ నుండేనా ?
అయితే పిఠాపురం నియోజకవర్గం లో ఇప్పుడే నిప్పు రాజు కొంటోంది. నియోజక వర్గం లోని టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. వైసీపీ తరపున పిఠాపురం ఇన్ చార్జ్ గా వంగా గీత ఉన్నారు. కొద్ది రోజుల క్రితం వైసీపీ అధిష్టానం వంగా గీతను పిలిపించుకొని కొన్ని సూచనలు కూడా చేసారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుండి పోటీ చేస్తే ముద్రగడ వంటి వారిని పోటీ లో నిలిపే అవకాశం కూడా ఉందని ముందుగానే హింట్ ఇచ్చారని సమాచారం. త్వరలోనే ముద్రగడ కూడా వైసీపీ లో చేరుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన నియోజక వర్గాన్ని ప్రకటించారు కాబట్టి వంగా గీత ను మార్చి ముద్రగడ ను పోటీ చేయించే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే పిఠాపురం నియోజక వర్గం లో కాపు ఓట్లు ఎక్కువ సంఖ్యలో ఉండటమే కారణం. (Pawan Kalyan from Pitapuram)
తాను ఎక్కడ పోటీ చేసినా వైసీపీ తనను ఓడించడమే అంతిమ లక్ష్యం గా పనిచేస్తుంది కాబట్టి పవన్ ఈ సారి సామాజిక వర్గాన్నే నమ్ముకున్నట్లు తెలుస్తోంది. గాజువాక, భీమవరం లో గత ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత ఒక స్వంత నియోజక వర్గాన్ని ఏర్పరచు కోవడం లో పవన్ విఫలం అయ్యారనే చెప్పవచ్చు. అనేక చర్చల తర్వాత చివరకు పిఠాపురం ని ఎంచుకున్నారు.
పవన్ గెలవకుండా విశ్వ ప్రయత్నం చేస్తున్న వైసీపీ
పిఠాపురం లో కూడా పవన్ కు విజయం నల్లేరు పై నడక మాత్రం కాదు. కచ్చితం గా వైసీపీ తనకున్న అన్ని శక్తి యుక్తులు ప్రదర్శిస్తుంది. పథకాల పేరుతో మరింత చేరువ కావడానికి ప్రయత్నిస్తుంది. పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికే చెందిన బలమైన అభ్యర్ధిని నిలబెడుతుంది. పవన్ కళ్యాణ్ ను ఈ సారి కూడా అసెంబ్లీకి రాకుండా చేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ ఇవన్నీ తట్టుకుని నిలబడ గలరా అనేదే ఇక్కడ ప్రశ్న. అయితే వీటిని తట్టుకొని నిలబడాలి.
ఒక రాష్ట్ర పార్టీ అద్యక్షుడు తప్పనిసరిగా తన స్థానాన్ని నిలబెట్టుకుంటూనే రాష్ట్రం లోని తన పార్టీ కి చెందిన ఇతర అభ్యర్ధుల గెలుపు కోసం కృషి చేయాలి. గత ఎన్నికల్లో చేసిన తప్పులు మళ్ళీ చేస్తే అదే ఫలితం పునరావృతం అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ముందు తను గెలవడానికి ప్రయత్నం చేయాలి.
గెలిచిన వారికి మంత్రి పదవి మాత్రం గ్యారంటీ
సందెట్లో సడేమియా లాగా రాం గోపాల్ వర్మ తాను కూడా పిఠాపురం నుండి పోటీ చేస్తానని ప్రకటించారు. ఇలా ఇప్పుడు అనేక మంది కన్ను ఈ నియోజక వర్గం పై పడుతుంది. సామాజిక వర్గం వాళ్ళు అందరూ ఓట్లు వేసేస్తారని అనుకోవడం కూడా అత్యాసే అవుతుంది. వైసీపీ కూడా అదే సామాజిక వర్గపు అభ్యర్ధిని పోటీ పెట్టినప్పుడు ఓట్లు చీలక తప్పదు. కుప్పం లో బాబు ని ఓడిస్తే ఆ అభ్యర్ధికి మంత్రి పదవి ఇస్తానని ముఖ్యమంత్రి జగన్ బాహాటం గా సభా వేదిక పై నుండి ప్రకటించారు. ఇప్పుడు కూడా పిఠాపురం నుండి వైసీపీ అభ్యర్ధిని గెలిపిస్తే తన మంత్రి వర్గం లో ఆ అభ్యర్ధికి మంత్రి పదవి ఇస్తామని కూడా ప్రకటించవచ్చు. ఇంకా అనేక తాయలాలు ప్రకటించవచ్చు.
గెలుపు అంత సులువు మాత్రం కాదు పవన్ కి (Pawan Kalyan from Pitapuram)
పిఠాపురం లో ఇంటింటి ప్రచారం నిర్వహించి, తెలుగుదేశం అసంతృప్త నేతలను బుజ్జగించుకొని అనేక విధాలుగా తన కార్యకర్తలకు ముందు ఉండి నడిపితే తప్ప పవన్ కళ్యాణ్ గెలవడం అంత సులువు మాత్రం కాదు.
PS: రాష్ట్రం లో ఏ పార్టీ అధికారం లోనికి వచ్చినా గాని ఈ సారి పవన్ కళ్యాణ్ అసెంబ్లీ కి ఎన్నిక కావాలని తటస్థులు కూడా కోరుకుంటున్నారన్నది నిజం.
-Vijay News Telugu