Promise Day Valentine Week – ఈ కన్నీటి బొట్టు పై ఒట్టు.. నేనుంటా నీ వెంట
మట్టి రేణువులు తగువులాడు కుంటున్నాయి…. నీ పాద స్పర్శ కోసం…
పూల పరిమళం మూతి ముడుచుకొని కూర్చొంది…నువ్వు కన్నెత్తయినా చూడలేదని
ఈ కన్నీటి బొట్టు పై ఒట్టు… నేనుంటా నీ వెంట…Promise Day Valentine Week
నీకు మాట ఇస్తున్నా.. నలు దిక్కులా నీకు తోడై ఉంటా… నీ పెదవుల పై చిరునవ్వులు పూయిస్తా.. (Promise Day Valentine Week)
అవును నీకు మాట ఇస్తున్నా… నేనుంటా నీ వెంట… విశ్వాంతరాళ మైనా… నిశీధి అగాధమైనా….
నీకు మాట ఇస్తున్నా… నేనుంటా నీ వెంట ….
నువ్వొక శిఖరానివి…
నిన్ను చేరాలంటే… నేను ఆకాశాన్ని అయిపోవాలి
నువ్వొక ఉదయానివి …
నిన్ను చేరాలంటే…. మంచు లో తడిసిన గడ్డి పరకనై పోవాలి …
నువ్వొక సంగీతానివి … (Promise Day Valentine Week)
నిన్ను చేరాలంటే…. గుండె గదిలో కన్నీటి చినుకులకు లెక్క చెప్పాలి …
ఏం పర్వాలేదు… నీకు మాట ఇస్తున్నా… నేనుంటా నీ వెంట…
మట్టి రేణువులు తగువులాడు కుంటున్నాయి…. నీ పాద స్పర్శ కోసం…
పూల పరిమళం మూతి ముడుచుకొని కూర్చొంది…నువ్వు కన్నెత్తయినా చూడలేదని
అక్షరాలైతే కవితలై తీరమంతా పొర్లాడుతున్నాయి… నీ చిరునవ్వుల అల ఒక్కటైనా తమను తాకుతుందేమో అని…
ఎక్కడో ఉన్న తారకలు నీ ముంగురులను ఒక్కటే బ్రతిమాలుతున్నాయి.. నీ కళ్ళలో వాటి జాడ కనబడేది ఇంకెప్పుడని….
నువ్వొక చిరునవ్వు రువ్వుతావా…. అంతటా నిశ్శబ్దం పరచుకుంటుంది ..
ఆ నిశ్శబ్దపు పరదాల వెనుకనుండి…..
ఆ యుగాల అగాధాల తలుపులు నెట్టుకొని…
వడివడిగా…. ప్రేమ దివిటీ పట్టుకొని…. నీ దగ్గరకు వస్తా…
గుప్పిట్లో భూగోళాన్ని… అనంత కాలపు గడియారాన్ని చేతికి పెట్టుకొని…..
కౌగిట్లో విశ్వాన్ని బంధించి నీ చెవిలో ఒకే ఒక మాట చెప్తా…. నేనుంటా నీ వెంట ..
ఈ కన్నీటి బొట్టు పై ఒట్టేసి మరీ చెబుతున్నా….ఎప్పటికీ నేనుంటా నీ వెంట….
(జ్ఞాపకాల నూతి గట్టు సంకలనం)