PSLV-C59 PROBA-3 | పీ ఎస్ ఎల్ వీ – సీ – 59 ప్రయోగం విజయవంతం|
సూర్యుడిపై వివిధ పరిశోధనలను చేయడం ప్రధాన ఉద్దేశం గా ఈ ఉపగ్రహాలను అంతరిక్షం లోనికి పంపించారు. ప్రోబా-3 కూడా ఇంతకూ ముందు పంపిన ఆదిత్య ఎల్ -1 ఉపగ్రహం తో కలిసి పనిచేస్తుంది. ప్రోబా-3 లోని రెండు ఉపగ్రహాలు ఒక క్రమమైన పధ్ధతి లో భూమి యొక్క కక్ష్య లో తిరుగుతూ పనిచేస్తాయి.
PSLV-C59 PROBA-3 | పీ ఎస్ ఎల్ వీ – సీ – 59 ప్రయోగం విజయవంతం
ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ – ISRO) చేపట్టిన అంతరిక్ష ప్రయోగం విజయవంతం అయ్యింది. ఈ నెల 5 వ తేదీ గురువారం సాయంత్రం ఈ ప్రయోగం జరిగింది. అంతకు ముందు కౌంట్ డౌన్ ప్రారంభం అయిన తర్వాత అకస్మాత్తు గా ఏర్పడిన సాంకేతిక లోపం వలన ప్రయోగాన్ని మధ్యలోనే నిలిపి వేసారు.PSLV-C59 PROBA-3
ప్రయోగానికి 48 నిమిషాల ముందు ప్రోబా-3 మిషన్ నుండి సిగ్నల్స్ అందక పోవడం తో ఈ ప్రయోగాన్ని నిలిపి వేయవలసి వచ్చింది. అయితే భారత శాస్త్రవేత్తలు మరియు యూరోపియన్ శాస్త్రవేత్తలు సంయుక్తం గా శ్రమించి లోపాన్ని సరి చేసారు.
తిరుపతి లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లోని మొదటి ప్రయోగ వేదిక నుండి ఈ రాకెట్ ను ప్రయోగించారు. అత్యంత విశ్వసనీయమైన PSLV శ్రేణి రాకెట్ ప్రయోగాలలో మరొక విజయాన్ని సాధించింది ఇస్రో. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కి చెందిన ప్రోబా-3 మిషన్ (ప్రాజెక్ట్ ఫర్ ఆన్ బోర్డ్ అటానమీ -PROBA-3) మిషన్ ను కక్ష్య లోనికి విజయవంతం గా పంపించారు. దాదాపు 550 కిలోల బరువైన ఈ ఉపకరణం లో రెండు ఉపగ్రహాలు ఉంటాయి.
సూర్యుని పై పరిశోధనలు ప్రధాన ఉద్దేశ్యం :
సూర్యుడిపై వివిధ పరిశోధనలను చేయడం ప్రధాన ఉద్దేశం గా ఈ ఉపగ్రహాలను అంతరిక్షం లోనికి పంపించారు. ప్రోబా-3 కూడా ఇంతకూ ముందు పంపిన ఆదిత్య ఎల్ -1 ఉపగ్రహం తో కలిసి పనిచేస్తుంది. ప్రోబా-3 లోని రెండు ఉపగ్రహాలు ఒక క్రమమైన పధ్ధతి లో భూమి యొక్క కక్ష్య లో తిరుగుతూ పనిచేస్తాయి. భూమి చుట్టూ జియో ఎలిప్టికల్ కక్ష్య లో ఈ ఉపగ్రహాలు తిరుగుతూ పనిచేస్తాయి. భూమికి దగ్గరగా ఆరు వందల కిలోమీటర్లు, భూమికి దూరం గా అరవై వేల కిలోమీటర్ల ఎపోజీ, పెరిజీ లో ఈ ఉపగ్రహాలు తిరుగుతాయి. PSLV-C59 PROBA-3
సూర్యుని యొక్క బాహ్య వాతావరణం లో ముఖ్యం గా కరోనా వలయాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం ఈ ఉపగ్రహాల యొక్క ప్రధానమైన విధి. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రస్తుతం సూర్యుని బాహ్య వాతావరణం పై ప్రత్యేక ప్రయోగాలు చేస్తోంది.
PSLV C-58 ద్వారా గతం లో XPoSAT ఆదిత్య ఎల్-1 ను ను విజయవంతం గా పంపించారు. ఆ ఉపగ్రహం విజయవంతం గా సూర్యుని సమాచారాన్ని భూమి మీదకు పంపిస్తోంది. ప్రస్తుతం ప్రయోగించిన PROBA-3 కూడా ఆదిత్య ఎల్ -1 తో అనుసంధానమై పనిచేస్తుంది. షార్ (సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ఇప్పటికి ఈ ప్రయోగం తో కలిపి 95 ప్రయోగాలు చేసారు. PSLV శ్రేణి కి సంబంధించి ప్రస్తుతం చేసిన ప్రయోగం 61 వ ప్రయోగం గా చెప్పవచ్చు .PSLV-C59 PROBA-3
PSLV-C59 రాకెట్ ఎత్తు 44.5 మీటర్లు . 550 కిలోల పేలోడ్ తో సహా మొత్తం రాకెట్ బరువు 320 టన్నులు. ప్రయోగం యొక్క మొదటి దశ లో మొత్తం 212 టన్నుల ఘన ఇంధనాన్ని మండించారు. రెండవ దశ లో 41 టన్నుల ద్రవ ఇంధనాన్ని మండించారు. మూడవ దశ లో 7.65 టన్నుల ఘన ఇంధనాన్ని మండించారు. నాల్గవ దశలో 2.5 టన్నుల ద్రవ ఇంధనాన్ని మండించడం ద్వారా ప్రోబా-3 మిషన్ ను కక్ష్య లోనికి ప్రవేశ పెట్టారు.