Pushpa-2 Box Office Collections Day-15 |బాహుబలి రికార్డులపై కన్నేసిన పుష్ప రాజ్
ఏది ఏమైనప్పటికీ పుష్ప -2 సినిమా గత 15 రోజులుగా భారత సినీ పరిశ్రమ లో అనేక రికార్డులను తిరగరాస్తూ ముందుకు దూసుకు వెళ్తోంది. ఈ మధ్యలో సినిమాలు ఏమీ లేకపోవడం క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవు దినాలలో కూడా కలెక్షన్ లు భారీగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రెండు వేల కోట్ల రూపాయల కలెక్షన్ లతో దంగల్ సరసన చేరే అవకాశం ఉంటుంది అని ఆశించడం లో ఎటువంటి అతిశయోక్తి లేదు.
Pushpa-2 Box Office Collections Day-15 |బాహుబలి రికార్డులపై కన్నేసిన పుష్ప రాజ్
భారత దేశ సినీ చరిత్రలో అసాధ్యం అనే రికార్డులు సాధిస్తూ దూసుకుపోతోంది పుష్ప 2. ఇప్పటివరకూ దాదాపు అన్ని పాత రికార్డులను దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోతోంది పుష్ప -2. ఇటీవలే RRR కలెక్షన్ ల రికార్డు ను సైతం అధిగమించింది. ఇక పుష్ప -2 ముందు ఉన్న రికార్డులు రెండే రెండు. ఒకటి బాహుబలి 2 ఆ తర్వాత మిగిలింది దంగల్ మాత్రమే. రెండువేల కోట్ల రూపాయల క్లబ్ లో చేరిన ఏకైక సినిమా దంగల్ ను పుష్ప 2 చేరు కుంటుందా.. అశేష సినీ అభిమానులు ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. Pushpa-2 Box Office Collections Day-15
రెండు వారాలు దాటిన తర్వాత కూడా ఉత్తరాదిలో పుష్ప -2 హవా తగ్గలేదు. ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్ లతో దూసుకు పోతోంది ఈ సినిమా. సినిమా ట్రేడ్ పండితులు కూడా ఆశ్చర్య పోయేలా అతి తక్కువ రోజులలోనే రికార్డులు అన్నీ బద్దలు కొట్టింది. ఈ సందర్భం గా ప్రముఖ వెబ్ సైట్ sacnilk ప్రకారం పుష్ప-2 సినిమా గ్రాస్ మరియు నెట్ కలెక్షన్లు ఈ విధం గా ఉన్నాయి.
పుష్ప -2 సినిమా 15 రోజుల కలెక్షన్ ల వివరాలు
ప్రపంచ వ్యాప్తం గా సినిమా గ్రాస్ కలెక్షన్ ఇప్పటివరకు : 1393.7 కోట్లు
భారత దేశం లో నెట్ కలెక్షన్ : 990.7 కోట్లు
భారత దేశం లో గ్రాస్ కలెక్షన్ : 1160.7 కోట్లు
ఓవర్ సీస్ (విదేశాలు) గ్రాస్ కలెక్షన్ : 233 కోట్లు
తెలుగు రాష్ట్రాలలో లో నెట్ కలెక్షన్ : 295.6 కోట్లు
హిందీ రాష్ట్రాలలో నెట్ కలెక్షన్ : 621.6 కోట్లు
తమిళనాడు లో నెట్ కలెక్షన్ : 52.4 కోట్లు
కన్నడం లో నెట్ కలెక్షన్ : 7.13 కోట్లు
మలయాళం లో నెట్ కలెక్షన్ : 13.97 కోట్లు
మొత్తం మీద 15 రోజులకు పుష్ప – 2 సినిమా 1393.7 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ లు సాధించింది. RRR రికార్డు కలెక్షన్ లతో సహా అనేక రికార్డులను బద్దలు గొట్టి ముందుకు దూసుకు పోతోంది పుష్ప 2
రెండువేల కోట్ల క్లబ్ లో చేరుతుందా..(Pushpa-2 Box Office Collections Day-15)
చాలా వరకూ ఈ ప్రశ్నకు అందరూ అవుననే సమాధానం చెప్తున్నారు. ఈ సినిమా అవలీల గా బాహుబలి 2 రికార్డులను అధిగమిస్తుంది అని చెప్తున్నారు. దీనికి కారణం ఉత్తరాదిన ఉన్న హిందీ రాష్ట్రాలలో మరే ఇతర సినిమాకి లేనంత క్రేజ్ తో ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్ లు రాబడుతోంది ఈ సినిమా. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ని బట్టి చూస్తే రెండు వేల కోట్ల క్లబ్ లో చేరడం అంత కష్టం కాదు అని చెప్పవచ్చు.Pushpa-2 Box Office Collections Day-15
అయితే OTT రిలీజ్ కి సంబంధించిన వివాదం తో ఐనాక్స్ స్క్రీన్ లో ప్రదర్శన లు నిలిపి వేస్తున్నట్లు ప్రకటనలు వెలువడుతున్నాయి. దీని ప్రభావం చిత్రం యొక్క కలెక్షన్ లపై తప్పకుండా పడుతుంది అనడం లో ఎటువంటి సందేహం లేదు. దీనికి తోడు తరచూ ఎవరో ఒకరు సినిమా మొత్తాన్ని యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తూ ఉండటం వాటికి మిలియన్ల కొద్దీ వ్యూస్ రావడం కూడా ఈ సినిమా కలెక్షన్ లపై ప్రభావం చూపిస్తోంది.
ఏది ఏమైనప్పటికీ పుష్ప -2 సినిమా గత 15 రోజులుగా భారత సినీ పరిశ్రమ లో అనేక రికార్డులను తిరగరాస్తూ ముందుకు దూసుకు వెళ్తోంది. ఈ మధ్యలో సినిమాలు ఏమీ లేకపోవడం క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవు దినాలలో కూడా కలెక్షన్ లు భారీగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రెండు వేల కోట్ల రూపాయల కలెక్షన్ లతో దంగల్ సరసన చేరే అవకాశం ఉంటుంది అని ఆశించడం లో ఎటువంటి అతిశయోక్తి లేదు.
#Pushpa2 #BoxOffice #Pushpa2Collections #AlluArjun #TeluguCinema #IndianCinema #BoxOfficeUpdate #MovieCollections #Tollywood #Pushpa2Success
Pushpa 2 box office