పుష్ప – 2 ఘన విజయానికి దోహదపడిన అంశాలు ఇవే |Pushpa 2 review in Telugu
మెగా కుటుంబం అనే ఒక పెద్ద ఛత్రం క్రింద ఇమిడిపోవడం బన్నీ కి నచ్చలేదు. అయితే తను ఏం చెప్పాలనుకున్నా అది తన టాలెంట్ తోనే , తన కృషి తోనే చెప్పాలనుకుని అది నిరూపించు కున్నాడు అల్లు అర్జున్. చిరంజీవి గారి అండ తోనే తను సినిమాలలోనికి వచ్చినప్పటికీ తనేంటో ప్రతిసారీ నిరూపించు కోవడం పైన శ్రద్ద పెట్టాడు అర్జున్
ఏమైనప్పటికీ ‘కెప్టెన్ ఆఫ్ ద షిప్’ గా సుకుమార్ ఈ చిత్ర విజయాన్ని శాసిస్తే ‘సీజ్ ద షిప్’ అంటూ ఆ నౌక ను ‘బ్లాక్ బస్టర్ ‘ తీరాలకు చేర్చింది మాత్రం అల్లు అర్జున్ అని ఘంటాపథంగా చెప్పవచ్చు
పుష్ప 2 ఘన విజయానికి దోహదపడిన అంశాలు ఇవే| Pushpa – 2 review in Telugu
ప్రపంచ వ్యాప్తం గా నేడు పుష్ప – 2 విడుదలైంది. గత రాత్రి 9 గంటల నుండే ఫాన్స్ కోసం ప్రత్యేక మైన షోలు ప్రదర్శించ బడ్డాయి. దేశ వ్యాప్తం గా ఈ సినిమాకు విపరీతమైన బజ్ ఏర్పడటం తో ప్రతి ఒక్కరిలో ఈ సినిమా ఎలా ఉందనే ఆసక్తి కనిపించింది. సోషల్ మీడియా అయితే పుష్ప 2 కి సంబంధించిన అంశాలతో హోరెత్తింది.(Pushpa 2 review in Telugu)
సినిమా హాళ్ళ ముందు అప్పటికప్పుడు విశ్లేషణ ను చెప్పే అభిమానుల అభిప్రాయాలతో యూట్యూబ్ ఛానళ్ళు వీడియోలు అప్ లోడ్ చేసాయి. సినిమా చూస్తున్న అభిమానులు ఎప్పటికప్పుడు అప్ డేట్స్ బయటకు పంపిస్తూనే ఉన్నారు. మొత్తానికి భారత దేశ సినీ చరిత్ర లోనే అత్యంత ఆశక్తి ని రేకెత్తించిన చిత్రం గా పుష్ప – 2 నిలిచింది.(Pushpa 2 review in Telugu)
విపరీతమైన హైప్ తో ప్రపంచ వ్యాప్తం గా విడుదల అయిన ఈ చిత్రం ఘన విజయం సాధించిందనే చెప్పవచ్చు. ఎందుకంటే విడుదలకు ముందే అనేక రికార్డులు బద్దలు కొట్టింది ఈ చిత్రం. చిత్రం విడుదల కాకముందే ప్రీ బుకింగ్స్ రూపం లో వంద కోట్లకు పైగా వసూలు చేసిన చిత్రం గా రికార్డు సృష్టించింది.
OTT మరియు శాటిలైట్ హక్కుల పరం గా కూడా బాగా బిజినెస్ జరిగింది. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు వంటి వారు కూడా మంచి లాభాలు పొందాలంటే బ్రేక్ ఈవెన్ సాధించడం తప్పనిసరి అంటున్నారు. అయితే 1000 కోట్ల మార్కు అతి సులువు గా దాటేస్తుందనేది అందరూ అనుకుంటున్న మాట. (Pushpa 2 review in Telugu)
తెలుగు సినీ పరిశ్రమకు అంతర్జాతీయ స్థాయి లో గుర్తింపు తీసుకువచ్చిన చిత్రాలలో పుష్ప -2 చిత్రం కూడా ఒకటి. బాహుబలి, RRR చిత్రాలతో ఇప్పటికే తెలుగు సినిమా ఖ్యాతి అంతర్జాతీయం గా కొనియాడ బడుతోంది. అయితే గత చిత్రాల కంటే పుష్ప – 2 చిత్రానికి అంతర్జాతీయం వచ్చిన క్రేజ్ వేరు. దాదాపు 80 కి పైగా దేశాలలో ఈ చిత్రం విడుదల కావడం, X లో ట్రెండింగ్ లో ఉండటం వంటి అంశాలు తెలుగు వాళ్లకు గర్వకారణం గా నిలిచే అంశాలే.
ఈ చిత్ర ఘన విజయానికి కారణాలను అన్వేషిస్తే మాత్రం కొన్ని ఆశ్చర్యకర అంశాలు గోచరిస్తాయి. అసలు ఒక తెలుగు చిత్రం ఇలా అంతర్జాతీయ స్థాయి లో విడుదలై ఘన విజయం సాధించడం వెనుక ఎవరి పాత్ర ఎంతో ఒకసారి పరిశీలిద్దాం.
1. ప్రేక్షకులు / అభిమానులు
పుష్ప -1 విడుదలైన దగ్గర నుండి పుష్ప -2 ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూపులు చూసిన ప్రేక్షకులు, అల్లు అర్జున్ అభిమానులే ఈ సినిమా ఘన విజయానికి కారకులు. చిత్ర యూనిట్ నుండి ఎటువంటి చిన్న అప్ డేట్ వచ్చినా స్పందిస్తూ ఆయా సన్నివేశాలకు తీవ్రమైన హైప్ తీసుకు వస్తూ న్యూట్రల్ ప్రేక్షకులకు కూడా ఉత్సుకత పెంచారు.
పుష్ప – 1 చిత్రం సంగీత పరం గా కూడా బ్లాక్ బస్టర్ కావడం తో పుష్ప – 2 కూడా తప్పకుండా ఆకట్టుకునే సంగీతం తోనే వస్తుందనే ప్రచారాన్ని జనం లోనికి తీసుకుపోయారు. దేవీ సంగీతం లో అప్పుడప్పుడూ విడుదల అయిన పాటలు కూడా విపరీతమైన హైప్ ను పెంచేశాయి.
అంతే కాకుండా అల్లు అర్జున్ ఫ్యాన్స్ మరియు మెగా ఫ్యాన్స్ మధ్య చెలరేగిన మాటల యుద్ధం చివరికి రాజకీయ రంగు పులుముకుంది. అల్లు అర్జున్ తన మిత్రునికి గత ఎన్నికలలో వైసీపీ తరపున ప్రచారం చేయడం తో ప్రారంభమైన ఈ రగడ ఇరు వర్గాల వారి మూలాలను దెప్పి పొడుచుకునే వరకూ పోయింది.
దీనికి తోడు నాగబాబు ట్వీట్లు కూడా ఎప్పటికప్పుడు వివాదాన్ని మరింత ఎగదోసి రెండు వైపులా మరింత ఉద్రిక్తతలు పెరిగేలా చేసాయి. అంతే గాకుండా వైసిపీ పార్టీ ప్రముఖుల నుండి అభిమానుల వరకూ అంతర్గతం గా సామాజిక మాధ్యమాలలో అల్లు అర్జున్ కు మద్దతు పలికారు. దీనితో ఈ వివాదం కాస్తా వైసీపీ – జనసేన పార్టీల మధ్య వివాదం లా మారింది.
ఈ వివాదం ఇలా రోజుల తరబడి నడుస్తూ ఉండటం కూడా పుష్ప – 2 సినిమా కి బాగా ఉపయోగపడింది. ఈ విధం గా అనుకోని ప్రచారం లభించింది ఈ చిత్రానికి. ఓ ప్రక్కన మెగా ఫ్యాన్స్ మరో ప్రక్క బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ఒకరిపై ఒకరు విరుచుకు పడ్డారు. ఎవరూ సంయమనం పాటించక పోవడం తో పరిస్థితి చేయిదాటి పోయింది.
ఎలాగైనా ఈ సినిమాని బాయ్ కాట్ చేస్తామని మెగా ఫ్యాన్స్ బాయ్ కాట్ పుష్ప -2 హాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోనికి తీసుకు రావడానికి ప్రయత్నించారు. ఎవరు ఏం చేసినా చివరకు పుష్ప – 2 ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేక పోయారు.
2. అల్లు అర్జున్ నటన (Pushpa 2 review in Telugu)
ఈ చిత్రం విజయం సాధించడం లో ప్రధానమైన అంశం అల్లు అర్జున్ నటన. ఆయన నటించాడు అనే కంటే ఈ చిత్రం లో జీవించాడనే చెప్పవచ్చు. ఒక డీ గ్లామరస్ పాత్ర లో అతి సామాన్యమైన స్థాయి నుండి అత్యున్నత స్థానానికి ఎదిగిన పాత్ర లో అతను ఒదిగిపోయాడు. స్టార్ హీరో అనే స్టేటస్ పక్కన పెట్టేసి చాలా కష్టపడి నటించాడు కాబట్టే జాతీయ స్థాయి లో ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నాడు.
పుష్ప – 2 అల్లు అర్జున నటన కు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం. దర్శకుడు సుకుమార్ కేవలం పుష్ప కేరక్టర్ ను హైలెట్ చేయడమే ప్రధాన ఉద్దేశ్యం తో ఈ సినిమా తీసాడని చెప్పవచ్చు. ఈ అవకాశాన్ని అల్లు అర్జున్ చక్కగా వినియోగించుకొని తన నట విశ్వ రూపాన్ని చూపించాడు.
మెగా కుటుంబం అనే ఒక పెద్ద ఛత్రం క్రింద ఇమిడిపోవడం బన్నీ కి నచ్చలేదు. అయితే తను ఏం చెప్పాలనుకున్నా అది తన టాలెంట్ తోనే , తన కృషి తోనే చెప్పాలనుకుని అది నిరూపించు కున్నాడు అల్లు అర్జున్. చిరంజీవి గారి అండ తోనే తను సినిమాలలోనికి వచ్చినప్పటికీ తనేంటో ప్రతిసారీ నిరూపించు కోవడం పైన శ్రద్ద పెట్టాడు అర్జున్.Pushpa 2 review in Telugu
మెగా కుటుంబం లో రాం చరణ్ మినహా మిగిలిన చిన్న హీరోలు అందరూ సరైన కథలు, దర్శకులను ఎంపిక చేసుకొని తమ ప్రతిభ నిరూపించు కోవాలి. ఈ విషయంలో వారు అల్లు అర్జున్ ని ఆదర్శం గా తీసుకోవాలి.
3. శ్రీవల్లి (రష్మిక ) నటన
ఈ తరం హీరోయిన్ ల మాదిరి కాకుండా తనకు ఇచ్చిన పాత్రలో పరకాయ ప్రవేశం చేయగలిగే నటీమణులలో రష్మిక ఒకరు. పుష్ప రెండు భాగాలలో ఆమె చక్కటి నటనను ప్రదర్శించారు. మొదటి భాగం లో పాత్ర నిడివి తక్కువ అయినప్పటికీ శ్రీ వల్లి గా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారంటే అది మామూలు విషయం కాదు. పుష్ప – 2 లో ఆమె నటన హైలట్ అని చెప్పవచ్చు. పుష్పరాజ్ కి ధీటుగా శ్రీవల్లి చేసి ఉండకపోతే ఈ రోజు ఈ విజయం లేదు.
4. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం:
పుష్ప రెండు భాగాలకు సంగీతం అందించారు దేవీ శ్రీ ప్రసాద్. సంగీత పరం గా చూసుకుంటే రెండవ భాగం కంటే మొదటి భాగానికే ఎక్కువ మార్కులు పడతాయి. భీభత్సం గా హిట్ అయిన మొదటి భాగపు ఆడియో స్థాయి లోనే పుష్ప -2 ఆడియో కూడా ఉండాలని అందరూ కోరుకున్నారు అభిమానులు. ఎటువంటి పాట విడుదల చేసినా మొదటి భాగం పాటలతో పోల్చి చూసుకోవడం , బాగా లేవని పెదాలు విరచి వేయడం జరిగింది.
అయితే దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం లోని గొప్పదనం ఏంటంటే వినగా వినగా ఆ పాటలు స్లో పాయిజన్ లా ఎక్కేస్తాయి. పుష్ప – 2 పాటలు కూడా ఆడియెన్స్ అలాగే ఎక్కేసాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పాటలే వినిపిస్తున్నాయి. అయితే పుష్ప – 2 పాటల కంటే వాటి చిత్రీకరణ చాలా బాగుందని థియేటర్ లో అయితే గూస్ బంప్స్ వస్తున్నాయని అభిమానులు అంటున్నారు. రీ రికార్డింగ్ అయితే మరొక లెవెల్ అని చెప్పవచ్చు.
5. సుకుమార్ దర్శకత్వ ప్రతిభ :(Pushpa 2 review in Telugu)
నిజానికి ఈ చిత్రానికి సంబంధించిన మొత్తం క్రెడిట్ చిత్ర దర్శకుడు సుకుమార్ కే దక్కుతుంది. అయితే పుష్ప -2 లో హీరో పై పెట్టిన శ్రద్ధ కథ పై పెట్టలేదని, ఇన్నేళ్ళు చిత్రీకరణ సాగిన ఈ చిత్రానికి ఇంకా మంచి కథ ను ఎన్నుకొని ఉండవలసింది అని అంటున్నారు ప్రేక్షకులు. ఇది కొంతవరకూ నిజమే.
కేవలం అల్లు అర్జున్ ని ప్రతి సీన్ లోనూ హైప్ చేయడానికి ప్రయత్నించారు తప్ప కథ లో మరిన్ని మలుపులు ఉంటే ఇంకా బాగుండేది అని అంటున్నారు. ఏది ఏమైనా సుకుమార్ మనసులో మెదిలిన ఈ కథ ఈ రోజు తెలుగు చిత్ర పరిశ్రమ పతాకాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్ళింది.
అలాగే ఈ చిత్రానికి ఇంత రిచ్ లుక్ తీసుకు వచ్చిన సినిమాటోగ్రాఫర్, అలాగే ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరూ పడ్డ కష్టం ఈ రోజు ఒక బ్లాక్ బస్టర్ చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాయి.
ఏమైనప్పటికీ ‘కెప్టెన్ ఆఫ్ ద షిప్’ గా సుకుమార్ ఈ చిత్ర విజయాన్ని శాసిస్తే ‘సీజ్ ద షిప్’ అంటూ ఆ నౌక ను ‘బ్లాక్ బస్టర్ ‘ తీరాలకు చేర్చింది మాత్రం అల్లు అర్జున్ అని ఘంటాపథంగా చెప్పవచ్చు
pushpa 2 movie review in telugu, pushpa 2 movie talk, pushpa 2 movie highlights, pushpa -2 movie review, pushpa-2 movie post release review, pushpa movie, pushpa-2 movie detailed review, allu arjun, sukumar, pushpa 2 telugu movie updates,
pushpa 2 first day collection,
pushpa 2 movie
pushpa 2 day 1 collection
box office collection
pushpa 2 collection day 1
pushpa movie box office collection
pushpa 2 1st day collection
Nice review.