January 10, 2025

Pushpa 2 The Rule Collections| ఆరు రోజుల్లో ఎంత కొల్లగొట్టిందో తెలుసా| 6 days Collections of Pushpa 2

తెలుగు రాష్ట్రాల కంటే హిందీ లోనే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ సినిమా. బీహార్, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఈ చిత్రం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. సగటు హిందీ చిత్రాల మూస ధోరణి కి భిన్నం గా ఈ చిత్రం ఉండటం తో ఉత్తరాది ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు.

Pushpa 2 The Rule Collections

Pushpa 2 The Rule Collections

Pushpa 2 The Rule| ఆరు రోజుల్లో ఎంత కొల్లగొట్టిందో తెలుసా| 6 days Collections of Pushpa 2

సినిమా టాక్ ఎలా ఉన్నా బాక్స్ ఆఫీసు బద్దలైంది. దక్షిణాదిన మొదలైన ఈ విధ్వంసం ఉత్తరాదికి విస్తరించి కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రపంచ వ్యాప్తం గా పుష్ప 2 గురించి రివ్యూ లు వెలువడ్డాయి. ఒక భారతీయ సినిమా ఈ స్థాయిలో కలెక్షన్ల ఊచకోత కోయడం నిజం గా తెలుగు సినీ పరిశ్రమ కు గర్వ కారణం. Pushpa 2 The Rule Collections

ఉత్తరాది బాక్స్ బద్దలు చేసిన సినిమా ఇది :

తెలుగు రాష్ట్రాల కంటే హిందీ లోనే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ సినిమా. బీహార్, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ఈ చిత్రం సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. సగటు హిందీ చిత్రాల మూస ధోరణి కి భిన్నం గా ఈ చిత్రం ఉండటం తో ఉత్తరాది ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు. దీనికి సాక్ష్యం ఉత్తరాదిన నమోదవుతున్న వసూళ్ళే.. భారీ విజయం సాధిస్తుంది అనుకున్నారు గాని ఈ స్థాయి లో బ్లాక్ బస్టర్ అవుతుందని ఎవరూ ఊహించలేదు.

డిసెంబర్ 5న విడుదల అయిన తర్వాత నేటి వరకూ అంటే గత ఆరు రోజులలో ఈ సినిమా ఎన్ని వందల కోట్లు కొల్లగొట్టిందో చూస్తే ఆశ్చర్య పోతాం. ఏ భారతీయ సినిమా కూడా ఇంత తక్కువ రోజులలో ఇంత భారీ కలెక్షన్లు ఇంతవరకూ వసూలు చేయలేదు. కేవలం ఆరు రోజులలో 880.3 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి వెయ్యి కోట్ల మార్కు చేరుకోవడానికి వేగం గా పరుగులు తీస్తోంది. భారతీయ చిత్రాలకు సంబంధించిన కలెక్షన్ల వివరాలు అందించే sacnilk వెబ్ సైట్ లో వెల్లడించిన వివరాలు ఇవిగో –  Pushpa 2 The Rule Collections

పుష్ప 2 చిత్రం ఆరు రోజులలో వసూలు చేసిన కలెక్షన్లు ఇవే ..

ఆరు రోజులకు పుష్ప 2 వసూలు  చేసిన కలెక్షన్లు 880.3 కోట్ల రూపాయల గ్రాస్.

రెండు తెలుగు రాష్ట్రాలలో వసూలు చేసిన నెట్ కలెక్షన్లు : 222. 6 కోట్లు 

హిందీ రాష్ట్రాలలో వసూలు చేసిన నెట్ కలెక్షన్లు :  370.1 కోట్లు 

తమిళనాడు లో వసూలు చేసిన నెట్ కలెక్షన్లు : 37 కోట్లు 

కన్నడం లో వసూలు చేసిన నెట్ కలెక్షన్లు : 4.45 కోట్లు 

మలయాళం లో వసూలు చేసిన నెట్ కలెక్షన్లు : 11.7 కోట్లు 

ఇండియా లో వసూలైన మొత్తం నెట్ కలెక్షన్లు :645.85 కోట్లు 

ఇండియా లో వసూలైన మొత్తం గ్రాస్ కలెక్షన్లు : 709.3 కోట్లు 

ప్రపంచ వ్యాప్తం గా వసూలైన మొత్తం గ్రాస్ కలెక్షన్లు : 880.3 కోట్లు (Pushpa 2 The Rule Collections)

మరొక రెండు రోజులలో వెయ్యి కోట్లు వసూలు చేసే దిశ గా దూసుకు పోతోంది ఈ సినిమా. ఉత్తరాదిన ఎలా ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాలలో ఈ చిత్రం పై పెద్ద మొత్తం లో నెగెటివ్ ప్రచారం జరగడం తో కలెక్షన్లు కొంచం తగ్గాయి. దీనితో పాటు టికెట్ రేట్లు మొదటి రోజుల్లో ఎక్కువగా ఉండటం, సామాన్యులు కుటుంబ సమేతం గా చూడటానికి అంతగా ముందుకు రాక పోవడం కూడా కొంచం మైనస్ అయ్యింది.

ఉత్తరాదిన మాత్రం ఈ చిత్రం బాక్సాఫీసు బద్దలు కొట్టిందనే చెప్పాలి. ఇంతకు ముందు ఏ హిందీ చిత్రానికీ రానంత గా మొదటి రోజు కలెక్షన్లు వచ్చాయి. ఈ రికార్డు ఇప్పటిలో చెరిగిపోయేది కాదు.

కథ కంటే కథనానికే ఎక్కువ ప్రాముఖ్యత నిచ్చి రూపొందించిన ఈ చిత్రం భారత దేశ సినీ చరిత్ర లోనే ఒక మైలు రాయి కాగలదని ఘంటాపధం గా చెప్పవచ్చు. ఒకవేళ ఈ రికార్డులు బద్దలు అయినా అది మన తెలుగు వారివల్లే అవుతుంది అనేది మాత్రం నిర్వివాదాంశం.

pushpa 2 collection worldwide day 6,
pushpa 2 day 6 collection sacnilk,
pushpa 2 collection day 6,
pushpa 2 collection worldwide day 4,
pushpa 2 collection worldwide total,
pushpa 2 picture,
pushpa 2 collection worldwide till now,
hindi movie,