January 10, 2025

Quotations on Self Confidence – ఆత్మ విశ్వాసం పై కొటేషన్స్ – Vijay News Telugu

telugu quotes - Telugu quotations - self confidence

Telugu quotes - Telugu quotations on Self Confidence

Quotations on Self Confidence – ఆత్మ విశ్వాసం పై కొటేషన్స్ – Vijay News Telugu

“నువ్వు నీకే శత్రువు, నీకు నువ్వే మిత్రుడివి. నీ ఆలోచనలే నీ విజయానికి మార్గం చూపిస్తాయి.”
(You are your own enemy, and your own friend. Your thoughts guide your path to success.)

“ఆత్మ విశ్వాసం కంటే గొప్ప ఆయుధం మరొకటి లేదు .”
(There’s no weapon greater than self-confidence.)

“ప్రతిసారీ ఓడిపోతానేమో అని భయపడొద్దు , విజయాన్ని ఆశయంగా నింపుకొని ముందుకు వెళ్ళు .”
(Don’t surrender to the thought of failure; fill yourself with the aspiration for success.)

“ఎవరూ నిన్ను నమ్మకపోయినా పర్వాలేదు , నీమీద మాత్రం నీకు నమ్మకం ఉంచుకో.”
(When no one believes in you, trust in yourself.)

“సమస్యలన్నీ నీలో ఉన్న శక్తిని బయటకు తెస్తాయి, అవి నీ ఉనికి తెలియజేస్తాయి.”
(Problems bring out the strength within you and make you realize your true potential.)

“ప్రతి పరాజయం ఒక శ్రేష్టమైన పాఠం, అదే నీ విజయానికి దారి చూపిస్తుంది .”
(Every failure is a valuable lesson that guides you toward success.)

“నీ లక్ష్యాన్ని చేరుకోవడంలో అడ్డంకులు ఎన్ని వచ్చినా నీ దృష్టిని మరల్చకు .”
(Obstacles are just part of the scene in reaching your goal, don’t shift your focus.)

“నీ భయం నిన్ను అడ్డుకుంటుంది, కాని నీ ధైర్యమే నిన్ను ముందుకు నడిపిస్తుంది.”
(Fear holds you back, but courage propels you forward.)

“ఎవర్నీ నీపై ఆధారపడనివ్వకు , ఇదే నీ బలాన్ని సూచిస్తుంది .”
(Not letting anyone depend on you shows the strength of your self-reliance.)

“నీ జీవిత పథంలో నీకు నువ్వే గైడ్, నీకు నువ్వు మాత్రమే బాసట.”
(On the path of life, you are your own guide, and your only support.)

“ఆత్మవిశ్వాసం లేని వ్యక్తి తన జీవితాన్ని సగం కోల్పోతాడు.”
(A person without self-confidence loses half of their life.)

“పరిస్థితులు అనుకూలం గా లేనప్పుడే నీలోని నిజమైన శక్తి బయటపడుతుంది.”
(Only during adversity does your true strength come to light.)

“స్వయంకృషి నిన్ను విజయానికి తీసుకువెళ్ళే నౌక వంటిది.”
(Self-effort is like the ship that takes you to your success.)

“నిన్ను నువ్వు నమ్మితే.. ఎవడ్రా నిన్ను ఆపేది .”
(If you believe in yourself, no one can stop you.)

“ప్రయత్నం చేయని వారు ఎప్పటికీ గెలవరు, నమ్మకం కలిగినవారు ఎప్పటికీ ఓడిపోరు.”
(Those who don’t try will never win; those who believe in themselves will never lose.)

“నువ్వు ఎదగాలంటే నిన్ను నువ్వే తోడుగా తీసుకో.”
(If you want to rise, take yourself as your own support.)

“నీ ప్రయత్నమే నీ విజయానికి సరైన పునాది.”
(Your effort is the true foundation of your success.)

“ప్రతీ విజయానికి ఆత్మస్థైర్యమే మూలరాయి .”
(Self-confidence is the cornerstone of every success.)

“వినయాన్ని వదలకుండా ధైర్యాన్ని పెంచుకుంటే, విజయం నీదే.”
(Without losing humility, if you grow your courage, success will be yours.)

“కష్టనష్టాలన్నీ నీ పాఠశాలలైతే , వాటినుండే నీ విలువ పెరుగుతుంది.”
(Hardships are your schools, and from them, your worth increases.)