RATAN TATA Dies at 86| పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కన్నుమూత
RATAN TATA Died at 86| పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కన్నుమూత
పారిశ్రామిక దిగ్గజం, టాటా సంస్థల అధినేత రతన్ టాటా కన్నుమూసారు. ముంబై లోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ బుధవారం అనగా అక్టోబర్ 09, 2024 రాత్రి 11.30 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. టాటా సన్స్ గౌరవ చైర్మన్ గా ఉన్న రతన్ టాటా వ్యాపార రంగం లో అనేక విజయాలు చవి చూసారు. దేశ విదేశాలలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింప చేసారు. దేశ విదేశాలలో యువతను ప్రోత్సహించే దార్శనికుడి గా పేరుగాంచారు. అనేక మంది యువ వ్యాపారవేత్తలకు ఆదర్శం గా నిలిచారు. తన మొత్తం సంపద లో దాదాపు 65 శాతం దాతృత్వ కార్యక్రమాలకే వినియోగించారు. 86 ఏళ్ల వయసులో అనారోగ్యం తో ఆసుపత్రిలో చేరిన ఆయన యావత్ భారతావనిని విషాదం లో ముంచి బుధవారం రాత్రి స్వర్గస్తులయ్యారు.
దేశం లోని ఇతర పారిశ్రామిక వేత్తలకు భిన్నం గా తన ఆదాయం లో అధిక మొత్తాన్ని దాతృత్వ మరియు స్వచ్చంద సేవా కార్యక్రమాలకే వినియోగించారు. కరోనా పై పోరాటానికి 1500 కోట్ల రూపాయలు విరాళం గా ఇచ్చారు.తాను విద్యను అభ్యసించిన కార్నెల్ యూనివర్సిటీ కి 50 మిలియన్ డాలర్ల విరాళం ఇచ్చారు. విద్య, వైద్యం, జంతు పరిరక్షణ, గ్రామీణ పరిరక్షణ వంటి విభాగాలలో పలు స్టార్ట్ అప్ లను ప్రోత్సహించారు. ఇటీవల కాలం లో సీనియర్ సిటిజన్ల కోసం గుడ్ ఫెలోస్ అనే స్టార్ట్ అప్ కు సహకారం అందిస్తున్నారు.
1937 వ సంవత్సరం డిసెంబర్ 28 న ముంబై లో జన్మించారు రతన్ టాటా. ఆయన తల్లిదండ్రులు నావల్ టాటా మరియు సూనూ టాటా. టాటా గ్రూపుల వ్యవస్థాపకుడు జంషెడ్ జీ టాటా కుమారుడైన రతన్ జీ టాటా దత్తత తీసుకున్న నావల్ టాటా కుమారుడు రతన్ టాటా. ఆ తర్వాత కాలం లో నావల్ టాటా, సూనూ టాటా విడాకులు తీసుకోవడం తో రతన్ టాటా రతన్ జీ టాటా ఇంట్లోనే పెరిగారు. రతన్ జీ టాటా భార్య అయిన నవాజ్ భాయ్ టాటా యొక్క సంరక్షణ లో రతన్ టాటా పెరిగారు.
ముంబై, సిమ్లా లో విద్యాభ్యాసం చేసిన తర్వాత అమెరికా వెళ్ళారు. అమెరికా లోని కార్నెల్ యూనివర్సిటీ లో ఆర్కిటెక్చర్ విభాగం లో బ్యాచిలర్స్ డిగ్రీ చదివారు.