RCB in Playoffs TATA IPL 2024| CSK పై సంచలన విజయం తో ప్లే ఆఫ్స్ లోనికి RCB
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు .. TATA IPL 2024 చరిత్ర లోనే అపురూపం .. అద్వితీయం అనే స్థాయిలో చెన్నై సూపర్ కింగ్స్ పై సంచలన విజయాన్ని నమోదు చేసుకొన్నది. ఈ సీజన్ లో గత మే 8 వ తేదీన 10 స్థానం లో ఉన్న RCB జట్టు సంచలన విజయాలు నమోదు చేస్తూ ప్లే ఆఫ్స్ లోనికి అడుగు పెట్టింది.
RCB in Playoffs TATA IPL 2024| CSK పై సంచలన విజయం తో ప్లే ఆఫ్స్ లోనికి RCB
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు .. TATA IPL 2024 చరిత్ర లోనే అపురూపం .. అద్వితీయం అనే స్థాయిలో చెన్నై సూపర్ కింగ్స్ పై సంచలన విజయాన్ని నమోదు చేసుకొన్నది. ఈ సీజన్ లో గత మే 8 వ తేదీన 10 స్థానం లో ఉన్న RCB జట్టు సంచలన విజయాలు నమోదు చేస్తూ ప్లే ఆఫ్స్ లోనికి అడుగు పెట్టింది. RCB జట్టు ఇలా ఆడుతుంది అని ఎవరూ ఊహించలేదు.. వరుసగా ఆరు పరాజయాలతో క్రుంగి పోయిన జట్టు పడి లేచిన తరంగం లా ఆడింది.. ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ వరుసగా ఆరు విజయాలను నమోదు చేసింది… అలుపెరుగని పోరాటం చేసింది. RCB నిలచింది.. RCB గెలిచింది…(RCB in Playoffs TATA IPL 2024)
మ్యాచ్ ని మలుపు తిప్పిన ధోనీ అవుట్..
చివరి ఓవర్ వరకు ఏం జరుగుతుందో అని రెండు జట్ల అభిమానులూ ఎదురుచూశారు… చివరి ఓవర్ లో మొదటి బాల్ కి ధోనీ సిక్సర్… యష్ దయాళ్ మళ్ళీ విలన్ అయిపోతాడని అందరూ అనుకున్నారు… రెండవ బాల్… గాల్లో కి లేచింది… సిక్సర్ అనుకొని చెన్నై శిబిరం లో సంబరాలు… కానీ ధోనీ అవుట్… అంతే ఇక CSK జట్టు కోలుకోలేక పోయింది…
జడేజా కూడా ఏమీ చెయ్యలేక పోయాడు…(RCB in Playoffs TATA IPL 2024)
మరొక ప్రక్క జడేజా కూడా ఏమీ చెయ్యలేక పోయాడు.. చివరి రెండు బంతుల్లో 10 పరుగులు టార్గెట్.. జడేజా బ్యాటింగ్.. అచ్చు గత సంవత్సరం IPL ఫైనల్ లో చివరి రెండు బంతుల్లో పది పరుగులు … అప్పుడు జడేజా చేసాడు.. జడేజా ఇప్పుడు చెయ్యలేక పోయాడు… యష్ దయాళ్ అద్భుతమైన బంతులు వేసి జడేజా ను కనీసం బంతిని తాకనివ్వలేదు..
గత సీజన్ లో విలన్ – ఇప్పుడు హీరో – యష్ దయాళ్
ఇంత ఉద్రిక్త వాతావరణం లో … జడేజా క్రీజ్ లో ఉండగా… రెండు డాట్ బాల్స్ వెయ్యడం.. యష్ దయాళ్ ఎప్పటికీ గుర్తు ఉంచుకుంటాడు… రింకూ సింగ్ తన బౌలింగ్ లో వరుసగా అన్ని సిక్సర్లు కొట్టినప్పుడు.. పాపం యష్ కెరీర్ ముగిసింది అనుకున్నారు.. అప్పుడు అందరూ విలన్ లా చూసారు.. ఇప్పుడు అతడే హీరో అయ్యాడు.. మేరు పర్వతం లాంటి ధోనీ వికెట్ తీసినప్పుడే విజయం ఖరారు అయిపొయింది.. జడేజా బ్యాట్ కు అందకుండా బాల్స్ వేసినప్పుడే అతడు హీరో అయిపోయాడు (RCB in Playoffs TATA IPL 2024)
ధోనీ అవుట్ కావాలని కోరుకున్న చిన్న స్వామి స్టేడియం…
ఈ విజయం తో యావత్ చిన్నస్వామి స్టేడియం ఉర్రూత లూగిపోయింది… ఈ సీజన్ లో CSK ఆడిన ప్రతి చోటా ప్రతి మ్యాచ్ లోనూ ధోనీ ఎంట్రీ అదిరిపోయింది… ధోనీ అడుగు పెడితే స్టేడియం హోరెత్తి పోయేది.. కానీ చిన్నస్వామి స్టేడియం లో మాత్రం ధోనీ తమ మ్యాచ్ ని తమకు కాకుండా చేస్తాడేమో అనే టెన్షన్ కనబడింది.. ఒకానొక దశ లో బెంగుళూరు శిబిరం నిరాశ గా కనిపించింది.. చివరికి స్టేడియం లో ఉన్న శ్రేయాంకా పాటిల్ కూడా మొహం వేళ్ళాడేసుకొని కనిపించింది.. ఈ దశలో అద్భుతమే జరిగింది.. అయితే.. చిన్నస్వామి స్టేడియం లోని అశేష RCB అభిమానులు ధోనీ ని ఓడించారు.. అవతల ఉన్నది ధోనీ అని ఎవరూ చూడలేదు..ఈ సారి RCB గెలవాలని అనుకున్నారు.. బంగారం కోసం వెతుకుతూ వజ్రాన్ని కోల్పోయిన పరిస్థితి …. ఇది క్రికెట్.. ఇవన్నీ తప్పదు…
సరి క్రొత్త హీరో – యష్ దయాళ్(RCB in Playoffs TATA IPL 2024)
యష్ దయాళ్ రూపం లో RCB కి ఒక హీరో దొరికాడు.. టీం మొత్తం ఆడింది ఒక ఎత్తైతే.. చివరి ఓవర్ బౌల్ చేసి విజయం సాధించి పెట్టింది అంతా ఒక ఎత్తు… ఈ రోజు RCB ని ప్లే ఆఫ్స్ లో చేర్చింది మాత్రం ఒకే ఒక్కడు… యష్ దయాళ్.. RCB Forever అంటూ బ్యానర్లు కనిపించాయి స్టేడియం లో… RCB తమ స్వంత స్టేడియం లో సాధించిన ఈ విజయం అభిమానులకు చిరకాలం గుర్తు ఉండిపోతుంది…అశేష RCB అభిమానులకు IPL ట్రోఫీ గెలిచినంత ఆనందాన్ని ఇచ్చింది ఈ మ్యాచ్…
చివరి వరకూ పోరాడిన చెన్నై టీం…
హోరా హోరీ గా సాగిన ఈ మ్యాచ్ లో చెన్నై కూడా పోటా పోటీగా ఆడింది.. గైక్వాడ్ మొదటి బాల్ కే అవుట్ అయినా మిగిలిన బ్యాట్స్ మన్ రెచ్చి పోయి ఆడారు.. RCB చేసిన భారీ స్కోరు ను అవలీల గా చేదిస్తారు అనుకున్నారు అందరూ… 19 ఓవర్లు ముగిసే సరికి RCB శిబిరం లో ఎటువంటి ఆశలు లేవు.. ఎందుకంటే చివరి ఓవర్ లో క్రీజు వద్ద ఉన్నది ధోనీ… ఎప్పుడైతే ధోనీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడో యష్ దయాళ్ తన విశ్వరూపాన్ని చూపించాడు.. చివరి ఓవర్ లో కేవలం 7 పరుగులు ఇచ్చి ధోనీ వికెట్ తో పాటు మరొక వికెట్ తీసుకొని, జడేజా కు డాట్ బాల్స్ వేసి జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు.. ఈ మ్యాచ్ గురించి వచ్చే 10 సీజన్ల వరకైనా చెప్పుకుంటారు అనడం అతిశయోక్తి కాదు.. (RCB in Playoffs TATA IPL 2024)
RCB నేర్పిన గుణపాఠం..
పరాజయాలు వచ్చాయని క్రుంగి పోకుండా పోరాటం చేస్తే తప్పకుండా విజయం సాధించ వచ్చు అని నిరూపించి మరీ తన సత్తా చాటింది బెంగళూరు జట్టు. మే 8, 2024 న పాయింట్ల పట్టిక లో 10 వ స్థానం లో జట్టు మే 18 కల్లా 4 వ స్థానం లోనికి చేరుకుంటుంది అని ఎవరైనా ఊహించారా…. పోరాట స్ఫూర్తి ని నింపింది RCB… నిలిచి గెలిచింది RCB, గెలిచి నిలచింది RCB. రాబోయే తరాలకు inspiration…..
PS: ఐపీఎల్ కెరీర్ లో ధోనీ కెరీర్ ముగిసినట్టే అని అంటున్నారు… ఐపీఎల్ లో ధోనీ తన చివరి మ్యాచ్ ఆడేశాడని అంటున్నారు.. ఇదే అందరికీ బాధ కల్గిస్తున్న విషయం… ప్రత్యర్ధి టీం యొక్క హోం గ్రవుండ్స్ కూడా పసుపు జెర్సీ తో కళకళ లాడేవి అంటే.. అది కేవలం ధోనీ వల్లనే.. ధోనీ అవుట్ అయితే సంబరాలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది చివరికి RCB అభిమానులకి.. దాదాపు తన చివరి ఐపీఎల్ మ్యాచ్ లో అసంతృప్తి గానే ధోనీ తన కెరీర్ ముగించి నట్టు అయ్యింది.. ఎక్కడో తీరని వెలితి… ఎప్పటికీ ఆ లోటు అలానే ఉండిపోతుంది సగటు ధోనీ అభిమానులకి…
Final verdict : ఈ సారి ఐపీఎల్ కప్పు గెలిచేది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాత్రమే… ఎక్కడైనా రాసి పెట్టుకోండి.. గ్లెన్ మాక్స్ వెల్ విశ్వ రూప ప్రదర్శన తో ఈ సారి ఐపీఎల్ ట్రోఫీ ని గెలిచేది RCB మాత్రమే…
-Vijay Kumar Bomidi, Editor, (Vijay Sports News Desk)
19-05-2024