RCB vs PBKS| తమ రెండవ మ్యాచ్ లో RCB సంచలన విజయం
RCB vs PBKS| తమ రెండవ మ్యాచ్ లో RCB సంచలన విజయం
RCB తమ మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిపోయినప్పటికీ తమ రెండవ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై సంచలన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ బ్యాటింగ్ లో అద్భుతం గా రాణించడం, చివర్లో దినేష్ కార్తీక్, లోమ్రోర్ చెలరేగి ఆడటం తో RCB తమ హోం గ్రౌండ్ లో విజయ కేతనం ఎగురవేసింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం లో జరిగిన మ్యాచ్ లో హోలీ రోజు RCB గెలవడం తో అభిమానుల సంబరాలు మిన్నంటాయి. ఈ సారి ఐపీఎల్ లో ఎవరి హోం గ్రౌండ్ లో వారు గెలిచి చూపిస్తున్నారు. ఇదొక కొత్త ట్రెండ్.
RCB, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఆద్యంతం ఆసక్తి గా జరిగింది. RCB టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.