January 10, 2025

RCB Wins WPL 2024| Ee Sala Cup Namdu| మహిళల WPL గెలిచిన RCB జట్టు

WPL రెండవ సీజన్ లోనే RCB మహిళల జట్టు టైటిల్ గెలుచుకుంది. స్మృతి మందన సారధ్యం లోని RCB జట్టు DC పై సంచలన విజయం సాధించి “Ee Sala Cup Namdu” ఈ సంవత్సరం కప్ మనది అంటూ చరిత్ర సృష్టించింది.

RCB Wins WPL 2024

RCB మహిళా ప్రీమియర్ లీగ్ లో విజయం సాధించింది. Pic credits: X @ Royal Challengers Bengaluru

RCB Wins WPL 2024| Ee Sala Cup Namdu| మహిళల WPL గెలిచిన RCB జట్టు

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళల జట్టు మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) టైటిల్ గెలుచుకుంది. రెండవ ఎడిషన్ లోనే ఈ ఘనతను సాధించింది. పురుషుల టైటిల్ కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు అభిమానులు . ఎప్పటి కప్పుడు “ఈ సారి కప్ మనదే” అనుకుంటూ ఉండటమే తప్ప పురుషులు టైటిల్ సాధించడం లేదు. WPL రెండవ సీజన్ లోనే RCB మహిళల జట్టు టైటిల్ గెలుచుకుంది. స్మృతి మందన సారధ్యం లోని RCB జట్టు DC పై సంచలన విజయం సాధించి “Ee Sala Cup Namdu” ఈ సంవత్సరం కప్ మనది అంటూ చరిత్ర సృష్టించింది. RCB Wins WPL 2024

అభినందించిన కోహ్లీ, విజయ్ మాల్యా 

రాయల్ చాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు మహిళల జట్టు కే కాదు. యావత్ RCB అభిమానులూ రచ్చ చేసారు. పురుషుల టైటిల్ గెలిస్తే సంబరాలు ఏ విధం గా ఉంటాయో ముందుగానే చాటి  చెప్పారు. చివరికి విరాట్ కోహ్లీ కూడా వీడియో కాల్ లో మహిళా జట్టు సభ్యులందరికీ అభినందనలు తెలియజేసారు. అంతే కాకుండా మాజీ జట్టు యజమాని  విజయ్ మాల్యా కూడా జట్టుకు అభినందనలు తెలియజేస్తూ ట్వీట్ చేయడం ఒక కొస మెరుపు

డిల్లీ బ్యాటింగ్ సాగింది ఇలా…  (RCB Wins WPL 2024)

డిల్లీ కాపిటల్స్ తో జరిగిన ఫైనల్ లో RCB గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన DC ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించింది. 64 పరుగులకు మొదటి వికెట్ కోల్పోయింది. అంత పటిష్టం గా బ్యాటింగ్ చేసిన DC కేవలం 113 పరుగులకు ఆలౌట్ కావడం ఎవరూ ఊహించలేదు. జట్టు భారీ స్కోరు చేస్తుందని ఆశించారు.

షేఫాలీ వర్మ 44 పరుగులు చేసిన అవుట్ అయ్యారు. అదే స్కోరు వద్ద లానింగ్ కూడా అవుట్ కావడం తో DC పతనం ప్రారంభం అయ్యింది. ఇతర బ్యాటర్ల లో ఎవరూ ప్రభావం చూపలేక పోయారు. అందరూ చాలా తక్కువ స్కోరుకే ఆవుట్ కావడం తో భారీ స్కోరు చేస్తుంది అనుకున్న DC కేవలం 113 పరుగులకు ఆలౌట్ అయ్యింది.  లో శ్రేయాంకా పాటిల్ అద్భుతం గా బౌలింగ్ చేసారు.

RCB గెలిచింది ఇలా…. (RCB Wins WPL 2024)

తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన RCB బ్యాటర్లు ఆచి తూచి ఆడారు. అడపాదడపా షాట్లు కొడుతూ అలవోక గా లక్ష్యాన్ని చేదించారు. కెప్టెన్ స్మృతి మంధన కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడారు. వికెట్ కోల్పోకుండా జాగ్రత్త పడుతూ ఆడారు. సోఫీ డివైన్ 32 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ అయిన తర్వాత ఎలిస్ పెర్రీ స్మృతి కి తోడయ్యారు. ఇద్దరూ కలిసి ఇన్నింగ్స్ ని విజయం అంచుల వరకూ తీసుకు వెళ్ళారు. ముఖ్యం గా పెర్రీ చాలా అద్భుతం గా ఆడారు.

జట్టు స్కోరు 82 పరుగుల వద్ద అనవసరమైన షాట్ కు ప్రయత్నం చేసి స్మృతి అవుట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన రిచా ఘోష్ పెర్రీ తో కలిసి గెలుపు లాంచనం చేసారు. అయితే DC బౌలర్లు కూడా చాలా బాగా బౌలింగ్ చేసారు. మ్యాచ్ ను చివరి ఓవర్ వరకూ తీసుకు వెళ్ళారు. చివరి ఓవర్ లో ఏదైనా జరగవచ్చు అన్నంతగా తమ పట్టు బిగించి ఆడారు. ఏమైనప్పటికీ RCB మహిళల జట్టు DC మహిళల జట్టు పై గెలిచి మరపురాని విజయాన్ని స్వంతం చేసుకుంది.

పురుషుల లీగ్ పై ఆసక్తి పెంచిన మహిళల జట్టు 

RCB మహిళల జట్టు విజయం తో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు దశాబ్దాల కల సాకారం అయినట్లు అయ్యింది. ఈ సంవత్సరమే పురుషుల జట్టు కూడా విజయం సాధిస్తే డబుల్ బొనంజా అవుతుందని జట్టు మాజీ యజమాని విజయ్ మాల్యా అన్నారు. అశేష RCB అభిమానులు IPL కోసం ఎంతో ఉత్కంఠ గా ఎదురు చూస్తున్నారు. చెన్నై తో జరిగే ప్రారంభ మ్యాచ్ కోసం ఇప్పటికే టికెట్లు అన్నీ అమ్ముడయ్యాయి.(RCB Wins WPL 2024)

విశేష ఆదరణ పొందిన మహిళా క్రికెట్ 

అన్ని జట్లు భారీ అంచనాలతో ఈసారి ముందుకు వస్తున్నాయి. తమ అభిమాన క్రికెటర్ల ఆట ను ఆస్వాదించడానికి సగటు క్రికెట్ అభిమాని ఆసక్తి గా ఎదురు చూస్తున్నాడు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం జరిగిన మహిళా ప్రీమియర్ లీగ్ (WPL) కు విశేషమైన స్పందన లభించింది. పురుషుల మ్యాచ్ ల మాదిరి మ్యాచ్ లు జరిగిన అన్ని స్టేడియం లు నిండిపోవడం మహిళా క్రికెట్ కు పెరుగుతున్న ఆదరణ కు నిదర్శనం.

మహిళా ప్రీమియర్ లీగ్ (WPL) విజేత గా నిలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) మహిళల జట్టుకు ప్రత్యేక అభినందనలు