Real Stories – Graham Stuart Stains
“ఊటీ లో కంటే బాగా చలిగా ఉంది కదా ” అన్నాడు ఫిలిప్
“అవునా… ఈ మధ్య ఇక్కడ కూడా చలి ఎక్కువగానే ఉంటోంది.. అయితే ఊటీ కంటే తక్కువ అనుకోను….” అన్నాడు తండ్రి స్టెయిన్స్
‘అయితే ఈ రోజు ఎక్కడ పడుకుంటాం డాడ్ ” అడిగాడు తిమోతీ తండ్రిని..
“బాయ్స్ .. మీరు ఇక్కడే ఉండండి.. అక్కడ టెంట్స్ లో ఏదైనా ప్లేస్ ఉందేమో చూస్తాను ” అంటూ వెళ్ళబోయాడు తండ్రి..
“డాడ్…. నేనొక ఐడియా చెప్పనా…” అన్నాడు ఫిలిప్
ఏంటి నానా చెప్పు ” అంటూ వెనక్కి వచ్చాడు స్టెయిన్స్..
“మన దగ్గర బ్లాంకెట్స్ కూడా సరిపోవు… ఈ రాత్రి కి మన స్టేషన్ లోనే ఉండిపోదాం… అంత చలి కూడా రాదు లోపలికి ” అన్నాడు ఫిలిప్
“ఎస్ డాడ్… అదే బెటర్… ఈ చలి తట్టుకోవడం నా వల్ల కాదు ..” అన్నాడు తిమోతీ..
ఈ ఐడియా కూడా బాగుంది అనిపించింది స్టెయిన్ కి… ఇప్పుడు ఎవరి ఇంటి కి వెళ్ళాలన్నా .. వాళ్లకి కి కూడా ఇబ్బందే… ఈ రాత్రికి తమ జీప్ లోనే ఉండిపోతే సరి… ” అనుకున్నాడు.. ఈ పల్లెలన్నీ తనకు తెలిసినవే… ఆస్ట్రేలియా లో పుట్టి పెరిగినప్పటికీ … ఇండియా నే తనకు బాగా నచ్చింది… ఇక్కడి పల్లెలు.. ఈ కొండ ప్రాంతాలలో ప్రజలు.. వారి స్వచ్చమైన చిరునవ్వులు .. మళ్ళీ ఇంకా ఆస్ట్రేలియా వెళ్ళేది లేదు అని తీర్మానించు కున్నాడు స్టెయిన్స్…