January 10, 2025

Real Stories- క్షణికావేశం – Vijay News Telugu

in order to express sorrow- real stories

Real Stories.. short tempered pic credits: pexels

క్షణికావేశం (Real Stories) 

“నాకొక 500 రూపాయలు కావాలి.. అర్జెంట్ ” అన్నాడాయన 

“ఎందుకు… మళ్ళీ తాగటానికేనా…. వద్దు అండి.. డబ్బులు లేవు .. నేను ఇవ్వను..” అంది భార్య కనక దుర్గ 

“ఎందుకు అలా అంటావ్.. ఈ ఒక్క సారికే .. మళ్ళీ నిన్ను అడగను…ప్రామిస్ ” అన్నాడు భర్త రాంబాబు.

“మీరెన్ని చెప్పినా నేను ఇవ్వను .. ఇంకా అడిగారంటే.. అబ్బాయి కి ఫోన్ చేస్తా ..” అంటూ ఫోన్ తీసింది ఆమె..

“నో… వద్దు వద్దు… వాడికి కాల్ చెయ్యకు ..” తల కొట్టేసినట్టు అయ్యింది అతనికి.. అవును భార్య చెప్పింది కరక్టే.. ఆరోగ్యం చెడిపోతుంది… కాని ఒక్క 500 అడిగితే లేదు అంటుందా…

ఆమె ఫోన్ చేసి మాట్లాడుతోంది కొడుకు తో… అది చూసాడు ఆయన… నో… నో… వేగం గా వెళ్లి తలుపు వేసుకున్నాడు… 

తలుపు చప్పుడు కి పరిగెత్తుకుంటూ వచ్చింది ఆమె… తలుపు గట్టిగా బాదింది… లోపల నుండి ఎటువంటి శబ్దం లేదు.. 

మొదటి సారి ఆమెకు భయం వేసింది… ఈయన ఏమైనా అఘాయిత్యం చేసుకోవడం లేదు కదా…

ఆ ఊహతో  ఆమె నిలువెల్లా వణికి పోయింది… తలుపులు బలవంతం గా తోసి చూస్తే… ఆమె అనుకున్నంతా అయ్యింది.. మనసు గాయపడిన అతను ఉరి పెట్టుకున్నాడు… కొడుకు కు విషయం తెలిసి పరుగు పరుగున వచ్చాడు… 

ఆసుపత్రి కి తీసుకు వెళ్ళాడు… డాక్టర్లు అన్ని ప్రయత్నాలు చేసారు… ఆయన చని పోయాడు.. ఇంటికి ఫోన్ చేసి తల్లి కి ఈ విషయం చెప్పాడు కొడుకు… ఆమె నిశ్చేష్టు రాలయ్యింది… భర్త ఇక లేడని తెలిసి అంతా శూన్యం గా అనిపించింది… అంతే… క్షణికావేశం లో … ఉరి పెట్టుకొని  ప్రాణం తీసుకొంది …. 

తండ్రి మృత దేహాన్ని  తీసుకొని ఇంటికి వచ్చేసరికి తల్లి విగత జీవి గా కనిపించింది..

“అయ్యో.. అమ్మా…. ఇప్పుడే కదా నీతో మాట్లాడాను… నాన్న చనిపోయిన విషయం నీకు  వెంటనే చెప్పకుండా ఉండాల్సింది… నేనే తప్పు చేసాను… ఎంత పని అయిపొయింది……. అమ్మా… నాన్నా..” అంటూ గుండెలు అవిసేలా ఏడ్చాడు కొడుకు… ఒకేసారి తల్లిని తండ్రిని కోల్పోయిన ఆ కుమారుని ఓదార్చడం ఎవరి తరం కాలేదు..

ఇద్దరిలో ఏ ఒక్కరు సంయమనం పాటించినా … ఇలా జరిగేదే కాదు…

కేవలం ఐదు వందల రూపాయల కోసం… భార్యా భర్తల్లో ఎవరు సంయమనం పాటించినా… ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు.ఆ కుటుంబం లో ఇంత విషాదాన్ని నింపేది కాదు…  ఒక్కొక్కసారి చిన్న చిన్న  విషయాలే ప్రాణాలు తీసే అంత ప్రమాదకరం గా మారతాయని అనడానికి ఈ సంఘటనే పెద్ద ఉదాహరణ..

ఇది నిజం గా జరిగిన సంఘటన. (Real Stories)

ఈ విషాద సంఘటన కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం లోని నాగ వరప్పాడు లో  జనవరి 20 , 2024 న ఈ ఘటన జరిగింది.కొలుసు  రాంబాబు(42) టూరిస్ట్ బస్ లో డ్రైవర్ గా పనిచేస్తారు.. భార్య కనక దుర్గ(38).. ఎంతో అన్యోన్యం గా ఉండేవారు ఇద్దరూ.. వారికి  ఒక కూతురు తనూజ, ఒక కొడుకు గౌతమ్ ఉన్నారు….. కూతురికి పెళ్లి చేసారు… కొడుకు మెకానిక్ గా  ఉద్యోగం చేస్తున్నాడు.. భార్య 500 రూపాయలు ఇవ్వలేదని మనస్తాపానికి గురై  క్షణికావేశం లో ఆత్మహత్య కు ప్రయత్నించాడు. కొడుకు వచ్చి గుడివాడ ఏరియా ఆసుపత్రి కి   తరలించాడు….అయితే  ఆయన అప్పటికే  ప్రాణాలు వదిలాడు. ఈ విషయాన్ని వెంటనే తల్లికి ఫోన్ చేసి చెప్పాడు గౌతమ్. ఈ విషయం తెలిసిన కనక దుర్గ  ఇంట్లో  ఉరి పెట్టుకొని ప్రాణం తీసుకుంది.. తండ్రి మృత దేహాన్ని తీసుకొని  కొడుకు ఇంటికి వచ్చే సరికి తల్లి కూడా  విగత జీవి గా కనిపించింది.. ఎంతో అన్యోన్యం గా ఉండే ఈ దంపతులు క్షణికావేశం లో తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలిసి వారి బంధువులు, స్నేహితులు విషాదం లో  మునిగిపోయారు. కుమార్తె తనూజ ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసారు.