March 7, 2026
Home » Republic Day Quotations Telugu|రిపబ్లిక్ డే – గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, కొటేషన్స్

Republic Day Quotations Telugu|రిపబ్లిక్ డే – గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, కొటేషన్స్

గణతంత్ర దినోత్సవం మన భారతీయుల ఐక్యతకు మరియు న్యాయ నిబద్ధత కు ఒక గొప్ప ప్రతీక

Republic Day Quotations Telugu

Republic Day Quotations Telugu

Republic Day Quotations Telugu|రిపబ్లిక్ డే – గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, కొటేషన్స్

సుదీర్ఘమైన భారత రాజ్యాంగాన్ని రాసుకొని, ఆమోదించుకొని, అమలులోనికి తీసుకువచ్చిన రోజునే మనం గణతంత్ర దినోత్సవం గా జరుపుకొంటున్నాం. ప్రపంచ వ్యాప్తం గా ఉన్న అనేక దృఢ, అదృఢ రాజ్యాంగాలను పరిశీలించినప్పుడు ప్రస్తుత మన రాజ్యాంగం అన్ని లక్షణాలను కలిగి ఉన్న ఒక అద్భుతమైన రచన అని చెప్పవచ్చు. డా. బీ.ఆర్. అంబేద్కర్ ఒక పటిష్టమైన రాజ్యాంగాన్ని దేశానికి అందించారని ఘంటాపథంగా చెప్పవచ్చు. Republic Day Quotations Telugu

రిపబ్లిక్ డే లేదా గణతంత్ర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి 26 వ తేదీన జరుపుకుంటాము. ఈ రోజున ఢిల్లీ లోని రాజ్ పత్ లో రాష్ట్రపతి జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. ఆగస్టు 15 న జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఎర్రకోట లో జరుగుతాయి. ప్రధాన మంత్రి జండా ఎగురవేస్తారు. రాజ్యాంగం అమలులోనికి వచ్చిన తర్వాత నుండే రాష్ట్రపతి పదవి అస్తిత్వం లోనికి వచ్చింది కాబట్టి ఆ రోజున రాష్ట్రపతి జాతీయ జండాను ఎగురవేస్తారు.

ఈ సందర్భం గా రాజ్యాంగ స్పూర్తిని గుర్తు చేసుకొంటూ మీ కోసం కొన్ని నినాదాలు మరియు శుభాకాంక్షలు క్రింద ఇవ్వబడ్డాయి. ఈ పోస్టును మీ మిత్రులకు కూడా షేర్ చెయ్యండి. Republic Day Quotations Telugu

  1. “గణతంత్ర దినోత్సవం మన భారతీయుల ఐక్యతకు మరియు న్యాయ నిబద్ధత కు ఒక గొప్ప ప్రతీక”
    “Republic Day is a symbol of unity and justice for all Indians.”
  2. “మన రాజ్యాంగం మనమంతా గర్వించదగిన గొప్ప రచన, దానిని గౌరవించడం మనందరి బాధ్యత.”
    “Our Constitution is a proud legacy; respecting it is our responsibility.”
  3. ” మన దేశపు అసలైన స్ఫూర్తి నిచ్చే అంశాలు ఏవంటే అవి స్వేచ్చ మరియు సమానత్వం”
    “Freedom and equality are the true spirit of our nation.”
  4. “గణతంత్ర దినోత్సవం మన సంస్కృతి మరియు సాంప్రదాయాలకు  ఒక గొప్ప గుర్తింపు వంటిది.”
    “Republic Day is a grand tribute to our culture and traditions.”
  5. ప్రజాస్వామ్యం దాని విలువలను గౌరవించినప్పుడు మాత్రమే బలంగా ఉంటుంది.”
    “Democracy thrives when its values are honored.”
  6. మన జెండా సమున్నతంగా  ఎగురుతూ ఉన్నప్పుడు, మన గుండె నిబ్బరం మరియు ఆత్మస్థైర్యం ఎక్కువవుతుంది.”
    “As long as our flag flies high, so does our pride and courage.”
  7. మన రాజ్యాంగం యొక్క సారం ఏమిటంటే… – న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం మరియు సోదరభావం.”
    “The essence of our Constitution is justice, liberty, equality, and fraternity.
  8. స్వేచ్ఛ అనేది మనం ప్రతి ఒక్కరికీ ఇవ్వగలిగిన అత్యంత గొప్ప కానుక.”
    “Freedom is the greatest gift we can give to everyone.”
  9. గణతంత్ర దినోత్సవం అనగా మనకు సమాన హక్కులను అందించిన గౌరవ దినోత్సవం.”
    “Republic Day celebrates the equal rights granted to us.”
  10. ప్రతి భారతీయుడి గుండెల్లో రాజ్యాంగం జ్యోతిలా, ఒక దీపంలా  వెలుగుతోంది.”
    “The Constitution shines like a lamp in the hearts of every Indian.”
  11. గణతంత్ర దినోత్సవం  అనేది కేవలం సెలవుదినం కాదు, ఇది మన అస్తిత్వానికి గుర్తు.”
    “Republic is not just a holiday, it’s a symbol of our existence.”
  12. భిన్నత్వంలో ఏకత్వం అనేది మన దేశం యొక్క గొప్పతనం.”
    “Unity in diversity is the greatness of our nation.”
  13. “ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ ఎందరో వీరుల త్యాగానికి ఫలితం, దానిని ఎప్పుడూ మరచిపోవద్దు”
    “Our freedom is the result of sacrifices, never forget that.”
  14. “భారత రాజ్యాంగం మన భారతీయులందరికీ గర్వకారణం.”
    “The Indian Constitution is a source of pride for all Indians.”
  15. “మన దేశ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది.”
    “The future of our country lies in our hands.” (Republic Day Quotations Telugu)
  16. “గణతంత్ర దినోత్సవం మనల్ని నిజమైన భారతీయులుగా, గర్వపడేలా చేస్తుంది.”
    “Republic Day makes us proud to be true Indians.”
  17. “గణతంత్రం అనేది మనం మన హక్కులను ఎలా గౌరవిస్తామన్న అంశంపై ఆధారపడి ఉంటుంది.”
    “A republic depends on how well we respect our rights.”
  18. “స్వతంత్రం అంటే జీవించడానికి ఒక అవకాశం అని మాత్రమే కాదు, అది మన భవిష్యత్తు కూడా.”
    “Freedom is not just a chance to live; it is our future.”
  19. “గణతంత్ర దినోత్సవం మన దేశం కోసం కృషి చేయాలన్న తపనను మనలో రగిలిస్తుంది.”
    “Republic Day inspires us to work for our nation.”
  20. “ప్రతి గణతంత్ర దినోత్సవం మనదేశ స్ఫూర్తిని పునరుద్ధరిస్తూనే ఉంటుంది.”
    “Every Republic Day renews the spirit of our nation.”
  21. “మన జెండా మనకు గర్వకారణం, మన ఐక్యతకు చిహ్నం.”
    “Our flag is our pride and a symbol of our unity.”
  22. “గణతంత్ర దినోత్సవాన్ని మన దేశానికి  మనం సేవ చేసుకోవడానికి దొరికిన ఒక గొప్ప ఒక అవకాశంగా భావించాలి.”
    “Republic Day should be seen as an opportunity to serve our nation.”
  23. “మన దేశ ప్రజలందరూ స్వతంత్రం, న్యాయం మరియు ఐక్యత కలిగి జీవించాలి.”
    “Our nation must live in freedom, justice, and unity.”
  24. “ప్రజాస్వామ్యానికి అంటే గౌరవం కలిగిన ప్రతి భారతీయుడూ నిజమైన దేశభక్తుడే.”
    “Every Indian who respects democracy is a true patriot.”
  25. “గణతంత్రం అంటే మన ఐక్యతకు మరియు న్యాయం పట్ల మనకున్న గౌరవానికీ గుర్తింపు అనేది అక్షర సత్యం.”
    “Republic is a celebration of our unity and respect for justice.”

ఇది కూడా చదవండి :

భారత రాజ్యాంగ దినోత్సవ కొటేషన్స్ మరియు శుభాకాంక్షలు 

Childrens Day Quotations & Greetings in Telugu