April 20, 2025

Rohit Sharma News| Hardik Pandya| హార్దిక్ పాండ్యా ప్రవర్తన పై గుర్రు గా ఉన్న ముంబై ఫాన్స్

గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా కొంచం అతిగానే ప్రవర్తించాడని ముంబై అభిమానులు అంటున్నారు. ఫీల్డింగ్ లో రోహిత్ శర్మ ఎప్పుడూ సర్కిల్ లోపల ఉంటాడు. అద్భుతమైన ఫీల్డర్ కూడా. అలాంటిది రోహిత్ శర్మ ను బౌండరీ లైన్ వద్దకు పంపించాడు హార్దిక్.

Ind vs Eng 2nd ODI - Rohit sharma 32 century

Ind vs Eng 2nd ODI pic credits X @ rohit sharma

Rohit Sharma News| Hardik Pandya| హార్దిక్ పాండ్యా ప్రవర్తన పై గుర్రు గా ఉన్న ముంబై ఫాన్స్

రోహిత్ శర్మ.. ఈ పేరు వింటేనే అభిమానుల గుండెల్లో వైబ్రేషన్స్ మొదలవుతాయి. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు రోహిత్ శర్మ. చిచ్చర పిడుగు బ్యాటింగ్ తో ప్రత్యర్ధి వెన్నులో వణుకు పుట్టించే నైజం అతనిది. అంతటి రోహిత్ శర్మ ఈ సారి ఐపీఎల్ అంతగా కలిసి రాలేనట్లే ఉంది.(Rohit Sharma News)

ఏకం గా ఐదు సార్లు ముంబై ఇండియన్స్ కి కప్ గెలిచిన చరిత్ర కలిగిన రోహిత్ ను ఈసారి కెప్టెన్సీ నుండి తప్పించారు. దానితో హార్దిక్ పాండ్యా ముంబై కెప్టెన్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ లో రోహిత్ ఆడటాన్ని అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. దానికి తోడు ఫీల్డు లో హార్దిక్ పాండ్యా చేసే అతి కూడా సగటు ముంబై అభిమానిని తీవ్రం గా గాయపరుస్తోంది.

పాండ్యా అతి ప్రవర్తన (Rohit Sharma News)

గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా కొంచం అతిగానే ప్రవర్తించాడని ముంబై అభిమానులు అంటున్నారు. ఫీల్డింగ్ లో రోహిత్ శర్మ ఎప్పుడూ సర్కిల్ లోపల ఉంటాడు. అద్భుతమైన ఫీల్డర్ కూడా. అలాంటిది రోహిత్ శర్మ ను బౌండరీ లైన్ వద్దకు పంపించాడు హార్దిక్. ఇలా బౌండరీ లైన్ వద్ద తనను ఫీల్డింగ్ కు వెళ్ళమంటాడని రోహిత్ అసలు ఊహించలేదు. ఒక క్షణం ఆగి ‘నేనా’ అంటూ అడిగి మరీ వెళ్ళాడు రోహిత్. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.Rohit Sharma News

పాండ్యా కెప్టెన్ కావడం రోహిత్ కు ఇష్టం లేదా?

సీనియర్ ప్లేయర్ తో ఇలాగే ప్రవర్తిస్తారా అని అభిమానులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. హార్దిక్ కావాలనే ఇలా ప్రవర్తించాడు అని అంటున్నారు అభిమానులు. హార్దిక్ కెప్టెన్ కావడం రోహిత్ శర్మ కు ఇష్టం లేదని అందుచేత అభిమానులను రెచ్చ గొడుతున్నాడని హార్దిక్ అభిమానులు అంటున్నారు. ఇకపై మేము ముంబై ఇండియన్స్ ని అభిమానించలేం అంటూ చాలా మంది అభిమానులు వేరే ఫ్రాంచైజీ లకు తమ మద్దతు తెలుపుతున్నారు.

రోహిత్ పట్ల టీం మేనేజ్ మెంట్ నిర్లక్ష్య ధోరణి 

ఐదుసార్లు ముంబై ఇండియన్స్ కి టైటిల్ తీసుకువచ్చిన అనుభవం ఉన్న రోహిత్ పట్ల ముంబై టీం మానేజ్ మెంట్ కొంత నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించింది. ఉన్నట్టుండి రోహిత్ ను కెప్టెన్సీ నుండి తప్పించి హార్దిక్ ను తీసుకు వచ్చారు. దీనితో రాద్దాంతం మొదలైంది. ఒకరి సోషల్ మీడియా ఎకౌంట్లు ఒకరు అన్ ఫాలో అవ్వడం దగ్గర నుండి అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి. అభిమానులు సోషల్ మీడియా లో రణరంగమే సృష్టించారు. Rohit Sharma News

పదే పదే రోహిత్ శర్మ స్థానాన్ని ఫీల్డింగ్ లో మారుస్తూ ఉండటం తో ముంబై అభిమానులే మండిపడుతున్నారు. సీనియర్ ప్లేయర్ కు ఇవ్వవలసిన గౌరవం ఇవ్వకపోవడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.

గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 6 పరుగుల తేడా తో ఓడిపోయింది. చేజింగ్ లో రోహిత్ శర్మ 43 పరుగులు చేసాడు. అయినా MI ఓడిపోయింది.

కొసమెరుపు ..(Rohit Sharma News)

కొస మెరుపు ఏంటంటే.. మ్యాచ్ చివర్లో అవార్డులు ప్రధానం చేసే సమయం లో రోహిత్ , హార్దిక్ ఏదో విషయం గా చర్చించు కోవడం కనిపించింది. లోపల ఎన్ని ఎమోషన్స్ ఉన్నప్పటికీ ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుకోవడం తో ఇద్దరి అభిమానులూ కొంత సంతోషించారనే చెప్పొచ్చు.