January 10, 2025

RR vs DC Match-09 TATA IPL 2024| రాజస్తాన్ రాయల్స్ రాయల్ విక్టరీ|Match Review

ఢిల్లీ తో జరిగిన పోటీలో రాజస్థాన్ రాయల్స్ 12 పరుగుల తేడా తో విజయం సాధించింది. రాజస్థాన్ జట్టులోని రియాన్ పరాగ్ చెలరేగి 45 బంతుల్లో 84 పరుగులు చేయడం తో 20 ఓవర్ల లో 5 వికెట్లు నష్టపోయి 185 పరుగులు చేసింది. లక్ష్య ఛేదన లో తడబడిన ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 173 పరుగులు మాత్రమే చేసి 12 పరుగుల తేడాతో ఓటమి చవి చూసింది.

RR VS DC MATCH 09 TATA IPL 2024 - RR WON

Rajasthan Royals జట్టు Delhi Capitals జట్టు పై 12 పరుగుల తేడా తో విజయం సాధించింది.

RR vs DC Match 09 TATA IPL 2024| రాజస్తాన్ రాయల్స్ రాయల్ విక్టరీ|Match Review

జైపూర్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియం లో జరిగిన టాటా ఐపీఎల్ మ్యాచ్ -09 లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించింది. ఢిల్లీ తో జరిగిన పోటీలో రాజస్థాన్ రాయల్స్ 12 పరుగుల తేడా తో విజయం సాధించింది. రాజస్థాన్ జట్టులోని రియాన్ పరాగ్ చెలరేగి 45 బంతుల్లో 84 పరుగులు చేయడం తో 20 ఓవర్ల లో 5 వికెట్లు నష్టపోయి 185 పరుగులు చేసింది. లక్ష్య ఛేదన లో తడబడిన ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 173 పరుగులు మాత్రమే చేసి 12 పరుగుల తేడాతో ఓటమి చవి చూసింది. ఢిల్లీ జట్టు కి ఇది వరుసగా రెండవ ఓటమి కాగా రాజస్థాన్ జట్టుకు ఇది వరుసగా రెండవ విజయం కావడం గమనార్హం. (RR vs DC Match-09 TATA IPL 2024)

మొదట్లోనే 3 వికెట్లు కోల్పోయిన RR

టాస్ గెలిచిన ఢిల్లీ జట్టు (DC) బౌలింగ్ ఎంచుకుంది. రాజస్థాన్ టాప్ ఆర్డర్ లోని ముగ్గురు బ్యాటర్ల ను కేవలం 36 పరుగులకే అవుట్ చేసి మంచి పట్టు సాధించింది DC జట్టు. యువ సంచలనం యశస్వి జైస్వాల్ ఈ మ్యాచ్ లో కూడా తక్కువ స్కోరు కే అవుట్ అయ్యాడు. కేవలం 5 పరుగులు చేసిన జైస్వాల్ ముఖేష్ కుమార్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. 16 బంతులు ఆడిన జోస్ బట్లర్ కేవలం 11 పరుగులు మాత్రమే చేసి కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ గా అవుట్ అయ్యాడు. మూడు ఫోర్లు కొట్టి 15 పరుగులు చేసిన కెప్టెన్ సంజూ సాంసన్ ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లో పంత్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అప్పటికి RR స్కోరు 7.2 ఓవర్ల లో 36 పరుగులు. (RR vs DC Match-09 TATA IPL 2024)

పెద్ద భాగస్వామ్యం నెలకొల్పిన పరాగ్, అశ్విన్.. 

క్రీజులో ఉన్న రియాన్ పరాగ్ కూడా మొదట్లో చాలా నెమ్మదిగా ఆడాడు. తాను ఆడిన మొదటి 24 బంతులలో 24 పరుగులు మాత్రమే చేసాడు. మరొక ప్రక్క అశ్విన్ మూడు సిక్సర్లు కొట్టి స్కోరు పెంచడానికి ప్రయత్నం చేసాడు కాని 29 పరుగులు చేసిన అనంతరం అక్షర్ పటేల్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అయితే రియాన్ పరాగ్ తో కలిసి అతి విలువైన 54 పరుగుల భాగ స్వామ్యాన్ని నెలకొల్పాడు. RR జట్టుకి ఇదే అతి పెద్ద భాగస్వామ్యం.

ధృవ్ జ్యురెల్ తో జత కలిసిన రియాన్ పరాగ్ చక్కగా ఆడుతూ పరుగులు రాబట్టారు. 12 బంతుల్లోనే 20 పరుగులు చేసిన జ్యురేల్ నార్జే బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. అప్పటికి RR జట్టు స్కోరు 142/5.

తన విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్ (RR vs DC Match-09 TATA IPL 2024)

హిట్ మయిర్ క్రీజు లోనికి వచ్చిన తర్వాత పరుగుల వరద పారింది. ఒక ఎండ్ లో రియాన్ పరాగ్ తన విశ్వరూపం చూపించాడు. తను మొదట ఆడిన 24 బంతుల్లో 24 పరుగులే చేసిన పరాగ్ తర్వాత ఆడిన 21 బంతుల్లో ఏకం గా 60 పరుగులు చేసాడు. దీనితో రియాన్ పరాగ్ 45 బంతుల్లో 84 పరుగులు చేసాడు. ఈ స్కోరు లో ఏకం గా 6 భారీ సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి. 17.2 ఓవర్లకు 142 పరుగులు గా ఉన్న స్కోరు 20 ఓవర్లకు 185 పరుగులకు చేరిందంటే ఏ స్థాయి లో విద్వంసం జరిగిందో అర్ధం చేసుకోవచ్చు. DC బౌలర్లు అందరూ ఒక్కొక్క వికెట్ తీసుకున్నారు. ముఖేష్ కుమార్, నార్జే, కుల్దీప్ యాదవ్ భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

30 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయిన డిల్లీ 

బ్యాటింగ్ ప్రారంభించిన DC జట్టు 30 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. 5 ఫోర్లు కొట్టి మంచి ఊపు మీద ఉన్న మిచెల్ మార్ష్ 23 పరుగులు చేసి బంగర్ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. తర్వాత క్రీజు లోనికి వచ్చిన రికీ భుయి డకౌట్ కావడం తో 30 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది ఢిల్లీ జట్టు.

చుక్కలు చూపించిన వార్నర్ (RR vs DC Match-09 TATA IPL 2024)

అయితే ఓపెనర్ గా వచ్చిన డేవిడ్ వార్నర్ తన చిచ్చర పిడుగు బ్యాటింగ్ తో RR బౌలర్ల కు చుక్కలు చూపించాడు. 3 సిక్సర్లు, 5 ఫోర్లు కొట్టిన వార్నర్ 49 పరుగులకు అవుట్ అయి ఒక పరుగు తేడాతో అర్ధ సెంచరీ మిస్ అయ్యాడు.

DC గెలుపు పై ఆశలు రేకెత్తించిన స్టబ్స్ 

కెప్టెన్ రిషబ్ పంత్ ఇన్నింగ్స్ ను చక్కదిద్ద డానికి ప్రయత్నం చేసాడు. ఒక సిక్సర్, 2 ఫోర్ల సహాయం తో 28 పరుగులు చేసి  అవుట్ అయ్యాడు. తీవ్ర నిరాశ కు గురైన పంత్ పెవిలియన్ కు వెళ్తూ తన అసహనాన్ని ప్రదర్శించాడు. ఒక ప్రక్క రన్ రేటు పెరిగిపోతూ ఉండటం తో DC ఓటమి ఖాయం గా కనిపించింది. ఈ దశలో స్టబ్స్ ఢిల్లీ శిబిరం లో ఆశలు చిగురింప చేసాడు. 3 సిక్సర్లు, 2 ఫోర్ల తో కేవలం 23 బంతుల్లో 44 పరుగులు చేసి నాటౌట్ గా మిగిలిపోయాడు. (RR vs DC Match-09 TATA IPL 2024)

చివరి ఓవర్ లో కేవలం 4 పరుగులే ఇచ్చిన ఆవేశ్ ఖాన్ 

చివరి ఓవర్ లో DC గెలుపు కు 16 పరుగులు అవసరం అయ్యాయి. చివరి ఓవర్ ను ఆవేశ్ ఖాన్ బౌల్ చేసాడు. స్టబ్స్ అవసరం అయిన స్కోరు కొట్టి విజయం వైపు నడిపిస్తాడు అనుకున్నారు అంతా… అయితే ఆవేశ్ ఖాన్ అద్భుతం గా బౌలింగ్ చేయడం తో DC కి ఓటమి తప్పలేదు. చివరి ఓవర్ లో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి RR గెలుపులో ప్రధాన పాత్ర పోషించాడు ఆవేశ్ ఖాన్ . దీనితో RR 12 పరుగుల తేడా తో విజయం సాధించింది. ఇది రాజస్థాన్ రాయల్స్ జట్టుకు వరుసగా రెండవ విజయం. ఢిల్లీ జట్టు కు వరుసగా రెండవ ఓటమి.

DC కి విశాఖపట్నం అయినా కలిసి వచ్చేనా ?(RR vs DC Match-09 TATA IPL 2024)

హోం గ్రౌండ్ లో అన్ని జట్లూ గెలుస్తున్నాయి. ఢిల్లీ జట్టు కు హోం గ్రౌండ్ వైజాగ్ కాబట్టి వైజాగ్ లో జరిగే రెండు మ్యాచ్ లలో DC గెలిచి ప్రస్తుతం నడుస్తున్న సెంటిమెంట్ ను కంటిన్యూ చేస్తుందో లేదో చూడాలి.

PS: పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో అన్ని అవార్డులు  రియాన్ పరాగ్ గెలుచుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రియాన్ పరాగ్