Russian plane crash-కూలిన రష్యా సైనిక విమానం 74 మంది మృతి
కుప్ప కూలిన రష్యా సైనిక రవాణా విమానం – 74 మంది దుర్మరణం
రష్యా కు చెందిన ఒక మిలిటరీ రవాణా విమానంరష్యా – ఉక్రెయిన్ సరిహద్దు లో కుప్ప కూలింది. ఈ ఘటన లో మొత్తం 74 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇల్యుసిన్ II-76అనే సైనిక రవాణా విమానం ఉన్నట్టుండి ఒక్కసారిగా కూలిపోయింది.. దీనిలో ప్రయాణిస్తున్న అందరూ దుర్మరణం పాలయ్యారు. వీరిలో 65 మంది ఉక్రెయిన్ కు చెందిన యుద్ధ ఖైదీలు , 6 గురు విమాన సిబ్బంది తో పాటు ఇతరులు ముగ్గురు ప్రయాణిస్తున్నారు. బెల్గో రాడ్ నగరానికి ఈశాన్యం లో 74 కిలో మీటర్ఈల దూరం లోని యాబ్లో నోవో గ్రామం వద్ద ఈ ప్రమాదం జరిగింది.(Russian Military Plane Crash)
ఈ ఘటన ఎలా జరిగిందో తెలియాల్సి ఉందని దీని వెనుక కారణాలను కనుక్కొనేందుకు ప్రయత్నిస్తున్నామని స్థానిక గవర్నర్ చెప్పారు. సహాయ సిబ్బంది ఇప్పటికే అక్కడికి చేరుకున్నారని ఆయన చెప్పారు. ఈ ప్రమాదానికి చెందిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ గా మారింది.
యుద్ధ ఖైదీ ల మార్పిడి జరగవలసి ఉంది
ఈ ఘటన కు సంబంధించి కారణాలు ఇంతవరకు తెలియ రాలేదు. సాంకేతిక లోపం గా భావిస్తున్నప్పటికీ రష్యా ఉక్రెయిన్ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలను మార్పిడి చేసుకునేందుకు ఈ విమానం రష్యా నుండి బయలు దేరింది.. ఈ విమానం లో గరిష్టం గా 90 మంది ప్రయాణం చేయవచ్చు. సైనిక దళాలను, యుద్ధ పరికరాలను ఆయుధాలను తీసుకు వెళ్ళడానికి ఈ విమానాన్ని ఉపయోగిస్తారు. యుద్ధ ఖైదీల మార్పిడి బుధవారం మధ్యాహ్నం బెల్గో రాడ్ కి 100 కిలోమీటర్ల దూరం లోని ఒక సరిహద్దు చెక్ పోస్టు వద్ద జరగవలసి ఉంది. ఈ విషయాన్ని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలియ జేసింది. (Russian Military Plane Crash)
బెల్గో రాడ్ పై తరచూ దాడులు చేస్తున్న ఉక్రెయిన్
ఈ యుద్ధ విమానం లో ఆయుధాలను కూడా తరలించడం వల్లనే ఈ ప్రమాదం జరిగి ఉంటుంది అని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. దీనికి ప్రతి గా రష్యా ఈ విమానాన్ని ఉక్రెయిన్ సైనికులే కూల్చి వేసారని ఆరోపించింది. విమాన ప్రమాదం జరిగిన బెల్గో రాడ్ ప్రాంతం పై ఉక్రెయిన్ తరచూ దాడులు చేస్తోంది. గత డిసెంబర్ లో ఉక్రెయిన్ చేసిన క్షిపణి దాడిలో దాదాపు 25 మంది మరణించారు. ఈ ప్రాంతం పై తరచూ దాడులు నిర్వహిస్తోన్న ఉక్రెయిన్ తమ సైనిక రవాణా విమానాన్ని కూల్చి వేసిందని రష్యా ఆరోపించింది.
మిస్సైళ్ళ రవాణా వల్లనే ప్రమాదం జరిగింది…(Russian Military Plane Crash)
ఇరుదేశాల మధ్య ఒప్పందాల ప్రకారం యుద్ధ ఖైదీ ల రక్షణ భాద్యత మొత్తం రష్యా దే అని ఉక్రెయిన్ తెలిపింది. S-300 వైమానిక రక్షణ వ్యవస్థ కు చెందిన మిస్సైళ్ళను ఈ విమానం రవాణా చేస్తోందని ఉక్రెయిన్ జనరల్ స్టాఫ్ తెలియజేసారు. అలాగే అనధికార వార్తలను నమ్మ వద్దని పొరుగు దేశాల కవ్వింపు చర్యలను గుర్తించి కేవలం అధికారిక వార్తలను మాత్రమే విశ్వసించాలని ఉక్రెయిన్ పార్లమెంట్ మానవ హక్కుల కమీషనర్ లుబినేట్స్ పిలుపు నిచ్చారు.
ఇదొక ఉగ్రవాద చర్య:(Russian Military Plane Crash)
రష్యా విదేశీ వ్యవహారాల మంత్రి సెర్గీ లావ్ రోవ్ ఈ ప్రమాదాన్ని ఉగ్రవాద చర్య గా అభివర్ణించారు. ఉక్రెయిన్ కు చెందిన రక్షణ దళాలు యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ క్షిపణులను ఉపయోగించి ఈ విమానాన్ని కూల్చి వేసారని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన లో పేర్కొంది. ఉక్రెయిన్ లోని ఖార్కీవ్ ప్రాంతం నుండి రెండు మిస్సైళ్ళు ప్రయోగించినట్టు తమ రాడార్లు గుర్తించాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియ జేసింది. ఆ మిస్సైళ్ళు అమెరికా కు చెందిన పెట్రియాట్ క్షిపణులు గాని , జెర్మనీ తయారు చేసిన ఐరిస్ క్షిపణులు కాని కావచ్చు అని రష్యా కు చెందిన లా మేకర్ ఆండ్రీ కర్త పోలోవ్ చెప్పారు. దర్యాప్తు చేస్తున్నామని ప్రమాద స్థలం లో లభ్యమయ్యే మిస్సైళ్ళ గుర్తులను బట్టి వాటిని నిర్దారిస్తామని ఆయన చెప్పారు.