April 19, 2025

Saif Ali Khan news| సైఫ్ ఆలీ ఖాన్ పై దాడి – అసలేం జరిగింది ?

పదకొండవ అంతస్తు లోనికి చేరి మరీ దాడికి ప్రయత్నించడం అనుమానించాల్సిన విషయమే. ప్రాథమికం గా చోరీ కి జరిగిన ప్రయత్నం లో దాడి అని అంటున్నారు గాని తప్పకుండా ఏదో కుట్ర కోణం ఉండే అవకాశం ఉంది. ముఖ్యం గా ఇంట్లో ఉండే పనివారి నుండి సరైన సమాచారం లభించవచ్చు.

Saif Ali Khan news

Saif Ali Khan news

Saif Ali Khan news| సైఫ్ ఆలీ ఖాన్ పై దాడి – అసలేం జరిగింది ?

బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ పై ఈ రోజు తెల్లవారుఝామున దాడి జరిగింది. ఈ దాడిలో సైఫ్ ఆలీ ఖాన్ ఆరు కత్తిపోట్లకు గురయ్యారు. ఎడమ చేతిపై రెండు, మెడపై, వెన్ను భాగం లోనూ కత్తిపోట్లు తగిలాయి. రెండు అంగుళాల పొడవు గల కత్తిని ఆయన వెన్ను ప్రాంతం నుండి వెలికి తీసారు. ముంబై లోని లీలావతి ఆసుపత్రి లో ఆయనకు శస్త్రచికిత్సలు చేసారు. శస్త్రచికిత్స చికిత్సల అనంతరం ఐసీయూ లో వైద్య సేవలు అందిస్తున్నారు. (Saif Ali Khan news)

ఉదయం ఏం జరిగింది ?

ఈ రోజు తెల్లవారుఘామున 2-30 గంటల సమయం లో తన నివాసం లో బయట అలికిడి కావడం తో సైఫ్ ఆలీ ఖాన్ బయటకు వచ్చారు. అప్పటికే తన ఇంట్లో పనిచేసే వ్యక్తితో ఒక ఆగంతకుడు తీవ్ర వాగ్వాదం చేస్తూ ఉండటం తో ఆయన ముందుకు రావడం తో ఆ వ్యక్తి సైఫ్ ఆలీఖాన్ తో తలపడినట్లు తెలుస్తోంది. ఈ సందర్భం గా జరిగిన పెనుగులాట లో సైఫ్ ఆలీఖాన్ ను కత్తితో విచక్షణారహితం గా పొడిచి ఆ వ్యక్తి పరారైనట్లు తెలుస్తోంది. ఈ దాడి జరుగుతున్న సమయం లో కరీనా కపూర్, ఆమె పిల్లలతో సహా అక్కడే ఉన్నట్లు తెలుస్తోంది. మూడు గంటల ప్రాంతం లో సైఫ్ ఆలీఖాన్ ముంబై లోని లీలావతి ఆసుపత్రి లో చేరారు.

ముంబై లోని బాంద్రా లోని తన 11 వ అంతస్తు లో గల నివాసం లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆగంతకుడు ఫైర్ ఎక్సిట్ ద్వారా లోనికి ప్రవేశించి నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయితే ప్రక్క నివాసం లోని సీసీ కెమెరా లో బయట నుండి వచ్చిన వ్యక్తి కదలికలు రికార్డు కావడం తో పోలీసులు ఆ ఫుటేజీ ఆధారం గా దర్యాప్తు ముమ్మరం చేసారు. కడపటి వార్తలు అందేసరికి ఆగంతకుడిని పట్టుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది.

అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయం లో ఉండే ఈ నివాసం లో అందునా 11 వ అంతస్తు వరకూ వచ్చి దాడి చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. వస్తువుల చోరీ కోసం దొంగ వచ్చినట్లు గా భావిస్తున్నప్పటికీ దీని వెనుక ఏదైనా కుట్ర కోణం ఉండవచ్చు అని అనుమానిస్తున్నారు.

బెంబేలెత్తి పోతున్న బాలీవుడ్ సెలెబ్రిటీ లు  (Saif Ali Khan news)

ఇటీవల కాలం లో బాలీవుడ్ నటులపై తరచుగా దాడులు జరుగుతున్న నేపధ్యం లో సైఫ్ ఆలీఖాన్ పై దాడి ని కూడా ముంబై పోలీసులు తీవ్రం గా పరిగణిస్తున్నారు. ఇటువంటి దాడుల నేఫద్యం లోనే సల్మాన్ ఖాన్ తన ఇంటి బాల్కనీ ని బుల్లెట్ ఫ్రూఫ్ గా మార్చుకున్నారు. సల్మాన్ ఖాన్ తో దగ్గరి పరిచయం ఉందన్న నెపం తో ఒక మంత్రిని కాల్చి చంపారు. ఈ మధ్యకాలం లో ఇటువంటి సంఘటనలు తరచూ జరుగుతూ ఉండటం తో సెలెబ్రిటీలు ముఖ్యం గా బాలీవుడ్ నటులు బెంబేలెత్తి పోతున్నారు.

పదకొండవ అంతస్తు లోనికి చేరి మరీ దాడికి ప్రయత్నించడం అనుమానించాల్సిన విషయమే. ప్రాథమికం గా చోరీ కి జరిగిన ప్రయత్నం లో దాడి అని అంటున్నారు గాని తప్పకుండా ఏదో కుట్ర కోణం ఉండే అవకాశం ఉంది. ముఖ్యం గా ఇంట్లో ఉండే పనివారి నుండి సరైన సమాచారం లభించవచ్చు. (Saif Ali Khan news)

హెల్త్ బులెటిన్ విడుదల చేసిన లీలావతి ఆసుపత్రి 

సైఫ్ ఆలీఖాన్ చికిత్స పొందుతున్న లీలావతి ఆసుపత్రి వైద్యులు ఆయన హెల్త్ బులెటిన్ విడుదల చేసారు. సైఫ్ శరీరం పై ఆరు కత్తిపోట్లు ఉన్నాయని వాటికి వెంటనే సర్జరీ చేసినట్లు తెలిపారు. వెన్ను ప్రాంతం నుండి రెండు అంగుళాల పొడవు గల ఒక కత్తిని వెలికితీసినట్లు చెప్పారు. వెన్ను తీవ్ర గాయం జరగడం తో న్యూరో సర్జరీ చేసామని చెప్పారు. అలాగే ఎడమ చేతిపై తగిలిన గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం సైఫ్ ఆలీ ఖాన్ ఆరోగ్యం నిలకడ గా ఉందని , ప్రస్తుతం ఐసీయూ లో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు డాక్టర్లు తమ హెల్త్ బులెటిన్ లో తెలిపారు.