January 10, 2025

Samsung Galaxy S24 Series- First AI Smart Phone- మొట్ట మొదటి AI స్మార్ట్ ఫోన్

SAMSUNG S24 ULTRA SERIES

Samsung S24 Ultra series - First AI Smart Phones

Samsung Galaxy S24 Series- First AI Smart phones యొక్క వివరాలు.

Samsung మొట్ట మొదటి సారిగా AI టెక్నాలజీ తో రూపొందించిన స్మార్ట్ ఫోన్ త్వరలో విడుదల చేస్తోంది. ఎప్పటి కప్పుడు నూతన టెక్నాలజీ ని పరిచయం చెయ్యడం లో Samsung ఎప్పుడూ ముందంజ లోనే ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచాన్నే కుదిపేస్తున్న AI (Artificial Intelligence- కృత్రిమ మేధ) ను ఈ స్మార్ట్ ఫోన్ లో నిక్షిప్తం చేసారు.ఈ తరం ఫోన్లు  వినియోగదారునికి  ఒక సరిక్రొత్త అనుభూతి ని కలిగిస్తాయని  సామ్సంగ్ చెప్తోంది. Samsung Galaxy S24 సీరీస్ లో ఈ స్మార్ట్ ఫోన్లను భారతీయ మార్కెట్ లోనికి విడుదల చేస్తున్నారు. Galaxy S24, Galaxy S24 plus, Galaxy S24 Ultra మొదలైన మోడళ్లను ప్రస్తుతం విడుదల చేస్తున్నారు. వీటియొక్క ప్రత్యేకతలు (specifications) గురించి తెలుసుకుందాం.

Galaxy S24 Specifications:

Display ఎలా ఉంటుంది అంటే…

6.2 అంగుళాల ఫుల్ హెచ్ డీ మరియు Infinity-O Dynamic AMOLED Display కలిగి ఉంటుంది. రిఫ్రెష్ రేట్ 1 – 120 Hz కలిగి, 2600 నిట్స్ peak Brightness కలిగి ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ victus -2 రక్షణ తో లభిస్తుంది.

Processor ఏది వాడారు అంటే….

Deca-core Samsung Exynos 2400 (4nm) ప్రాసెసర్ దీనిలో వాడారు.

Samsung S24 Ultra series - First AI Smart Phones
Samsung S24 – First AI Smart Phones

కెమెరాలు ఎలా ఉన్నాయంటే…

వెనుక మూడు కెమెరాలు ఉన్నాయి. ముందు ఒక సెల్ఫీ కెమెరా ఉంది. వెనుక ఉన్న కెమెరా లలో ప్రధాన కెమెరా  50 MP (మెగా పిక్సెల్) కలిగి  ఉంటుంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) కలిగి ఉంటుంది. అందువల్ల ఈ కెమెరా ఉపయోగించి వీడియో తీసేటప్పుడు కెమెరా కదులుతున్నప్పటికీ ఆ కదలికలు వీడియో ఫుటేజ్ లో కనిపించవు. సినిమాటిక్ షాట్స్ తీసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. రెండవ కెమెరా  12MP Ultra Wide Angle Camera . మూడవ కెమెరా 10MP తో  3x ఆప్టికల్ జూమ్ తో  టెలీ ఫోటో లెన్స్ కలిగి ఉంటుంది. కెమెరా ముందు భాగం లో ఉండే సెల్ఫీ కెమెరా 12MP తో అపెర్చర్ f/2.2 కలిగి ఉంటుంది.

స్టోరేజి ని బట్టి Varients ఎలా ఉన్నాయంటే….

8GB RAM (LPPDDR 5X) ని కలిగి ఉన్నాయి.

8GB RAM- 256 GB (UFS 3.1) – దీని యొక్క ధర 79,999/- రూపాయలు గా ఉంది

8GB RAM  – 512 GB (UFS 4.0)- దీని యొక్క ధర 89,999/- రూపాయలు గా ఉంది.

BATTERY వివరాలు:

4000 mAh బ్యాటరీ ఉంటుంది. 25 వాట్ చార్జర్ తో చార్జ్ చేసుకోవచ్చు. అలాగే 15 వాట్ వైర్ లెస్ ఛార్జింగ్ కి కూడా సపోర్ట్ చేస్తుంది. వైర్ లెస్ పవర్ షేర్ కి కూడా సపోర్ట్ చేస్తుంది.

ఏ రంగుల్లో దొరుకుతుంది అంటే….

Amber Yellow, Onyx Black, Cobalt Violet అనే మూడు రంగుల్లో దొరుకుతుంది.