April 19, 2025

Sankranthi Winner 2025| సంక్రాంతి 2025 సినిమాల రివ్యూ-విజేత గా నిలిచిన చిత్రం ఏదో తెలుసా ?

పాత చింతకాయ పచ్చడి కథ అయినప్పటికీ కథనం ఆకట్టుకుంది. అనవసరమైన ఎలివేషన్ లు లేవు. చాంతాడంత భారీ డైలాగులు లేవు. పక్కా మాస్ ఫార్ములా స్క్రిప్ట్ ని చాలా క్లాస్ గా చూపించిన ఘనత దర్శకునిదే. అనుభవజ్ఞుడైన శంకర్ ఎక్కడైతే ఫెయిల్ అయ్యాడో యువ దర్శకుడు బాబీ కొల్లి అక్కడే విజయం సాధించాడు.

Sankranthi-Winner-2025

Sankranthi-Winner-2025

Sankranthi Winner 2025| సంక్రాంతి 2025 సినిమాల రివ్యూ -విజేత గా నిలిచిన చిత్రం ఏదో తెలుసా ?

సంక్రాంతి పందెం కోళ్ళు సందడి చేస్తున్నాయి. సినిమాల బరిలో నిలచిన పందెం కోళ్ళ ఫలితాలు వచ్చేసాయి. అసలు ఈ సంక్రాంతి కి ఏ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది? సంక్రాంతి కి విడుదల అయిన మూడు సినిమాలలో ఏది హిట్టు.. ఏది ఫట్టు .. అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన ఫలితాలు వచ్చేసాయి. ఇంతకూ ఏ సినిమా ప్రేక్షకుల మనసును గెలిచిందో చూద్దాం… (Sankranthi Winner 2025)

మొదటి సినిమా – గేమ్ చేంజర్

సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వం లో వచ్చిన సినిమా ‘గేమ్ చేంజర్’ . పుష్ప-2 సినిమా తర్వాత అంత క్రేజ్ ఏర్పరచుకున్న సినిమా ఇదే. అటు దిల్ రాజు, రాం చరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడం ఖాయం అనుకున్నారంతా. సినిమా విడుదలకు ముందు పరిస్థితి కూడా అలాగే అనిపించింది. ముందుగానే విడుదలైన పాటలు బాగానే ఆకట్టుకున్నాయి. ట్రైలర్ తో సహా ప్రమోషన్స్ అన్నీ బాగానే కుదిరాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే జరిగింది. పుష్ప అంత భారీ హిట్ కాకపోయినా రికార్డులు షేక్ చేయడం ఖాయం అనుకున్నారు అంతా.

మెగా అభిమానులు ఎప్పుడు మొదటి షో పడుతుందా అంటూ ఎదురు చూసారు. సరిగ్గా అటువంటి సమయం లో ఓవర్సీస్ లో రివ్యూ లు ఇచ్చే ఉమైర్ సంధూ ‘ఎక్స్’ లో ఈ సినిమా గురించి ఒక నెగెటివ్ రివ్యూ ఇచ్చారు. అభిమానులు ఖండించారు. రియల్ అభిమానులు అలా జరగకూడదు అని కోరుకున్నారు. వెయ్యి దేవుళ్ళకు మొక్కు కున్నారు.

రావలసిన రోజు రానే వచ్చింది. మొదటి షో పడింది. ఆ మొదటి ఆట అభిమానుల కంటే ఇతర హీరోల అభిమానులే ఎక్కువ చూసి ఉండవచ్చు. మొత్తం యూట్యూబ్ లో చిన్నా చితకా ఛానెల్స్ అన్నీ దద్దరిల్లి పోయాయి. దాదాపు అందరి నోటా ఒకటే టాక్… సినిమా పోయింది అని.. చూడాల్సిన అవసరం కూడా లేదంటూ ఇతరులకు సలహాలు కూడా ఇచ్చారు.

మెగా అభిమానులు నెగెటివ్ టాక్ ను ఆపడానికి ప్రయత్నం చేసారు కానీ అప్పటికే జరగవలసిన నష్టం అంతా జరిగిపోయింది. కథ లేదని ఒకడు, స్క్రీన్ ప్లే లేదని ఒకడు, హీరోకి నటన రాదు అని ఒకడు, ఇది శంకర్ సినిమా కాదు అని ఒకడు, డైరక్షన్ బాగోలేదని ఒకడు, ఇలా ఎవరికీ తోచింది వారు యూట్యూబ్ ఛానళ్లలో ప్రచారం చేసుకుంటూ పోయారు.

సోది లేకుండా రివ్యూలు చెప్తామనే ఛానళ్ళు కూడా దారుణం గా రేటింగ్ ఇచ్చాయి. ఫలితం ఈ గేమ్ చేంజర్ అనే సినిమా ప్లాప్ టాక్ ను స్వంతం చేసుకుంది. దాదాపు 450 కోట్ల రూపాయలతో రూపొందించారు అని చెప్పబడిన ఈ సినిమా ప్రేక్షకుల ఆమోదం పొందలేక పోయింది. పరాజయం పాలైంది

రెండవ సినిమా – డాకూ మహారాజ్ (Sankranthi Winner 2025)

సంక్రాంతి బరిలో నిలచిన రెండవ సినిమా బాలకృష్ణ నటించిన డాకూ మహారాజ్. పెద్దగా ఈ సినిమా పై అంచనాలు లేవు. సాధారణం గా ఉండే బాలకృష్ణ సినిమాల మాదిరి గానే ఉంటుంది అనుకున్నారు ప్రేక్షకులు. అటు గేమ్ చేంజర్ నిరాశ కు గురి చేయడం తో సగటు ప్రేక్షకుని దృష్టి డాకూ మహారాజ్ పై పడింది. చివరికి సినిమా విడుదల అయ్యింది. అందరి అంచనాలను తారుమారు చేస్తూ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. గేమ్ చేంజర్ లో ఏదైతే మిస్ అయ్యిందని ప్రేక్షకులు భావించారో అది ఈ సినిమా లో దొరికింది.

పాత చింతకాయ పచ్చడి కథ అయినప్పటికీ కథనం ఆకట్టుకుంది. అనవసరమైన ఎలివేషన్ లు లేవు. చాంతాడంత భారీ డైలాగులు లేవు. పక్కా మాస్ ఫార్ములా స్క్రిప్ట్ ని చాలా క్లాస్ గా చూపించిన ఘనత దర్శకునిదే. అనుభవజ్ఞుడైన శంకర్ ఎక్కడైతే ఫెయిల్ అయ్యాడో యువ దర్శకుడు బాబీ కొల్లి అక్కడే విజయం సాధించాడు.

ఎక్కడా పట్టు సడలకుండా ప్రేక్షకుడిని సీట్లలో కూర్చోబెట్టాడు బాబీ. బాలకృష్ణ అభిమానులకి బ్లాక్ బస్టర్ అనిపించింది. సాధారణ ప్రేక్షకునికి ‘సినిమా బాగుంది పర్లేదు’ అనిపించింది. అది చాలు కదా ఒక సినిమా కథ సుఖాంతం కావడానికి.. అదీ సంక్రాంతి సమయం లో .. సంచలన విజయం కాకపోయినా ప్రేక్షకుల కు ఒక విందు భోజనం లా అనిపించింది. మొదటి రెండు రోజుల్లోనే 74 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించింది ఈ సినిమా. హిట్ సినిమా గా నిలిచింది.

మూడవ సినిమా – సంక్రాంతికి వస్తున్నాం 

అనిల్ రావిపూడి దర్శకత్వం లో వెంకటేష్ హీరో గా వచ్చిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ముఖ్యం గా ఫ్యామిలీ ఆడియన్స్ ఎదురు చూసిన సినిమా ఇది. ఒక చెత్త వెబ్ సీరీస్ చేసి ఫ్యామిలీ ఆడియన్స్ ని దూరం చేసుకున్న వెంకటేష్ ఈ సినిమాతో మళ్ళీ ఆకట్టు కున్నారనే చెప్పాలి. బీమ్స్ మ్యూజిక్ కూడా బాగా కుదరడం, ఇతర నటీ నటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేయడం తో సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది.

ఎఫ్-1, ఎఫ్-2 తరహా కామెడీ లేకపోయినా ఎక్కడా బోర్ కొట్టకుండా డైరక్టర్ జాగ్రత్త పడటం తో మంచి మార్కులే పడ్డాయి. కుటుంబ సమేతం గా చూడొచ్చు అనే టాక్ కూడా రావడం తో హౌస్ ఫుల్ కలెక్షన్లు రాబడుతోంది ఈ సినిమా. సినిమా లో చాలా వరకూ లాగ్ ఉందనే టాక్ వచ్చినప్పటికీ ఈ సినిమా విజయం సాధించింది అనే చెప్పాలి. (Sankranthi Winner 2025)

ప్రేక్షకుల తీర్పు ఇదే 

విపరీతమైన హైప్ తో విడుదలైన ‘గేమ్ చేంజర్’ రెండవ స్థానం లో ఉంది. డాకూ మహారాజ్ , సంక్రాంతి కి వస్తున్నాం సినిమాలకు ప్రేక్షకాదరణ లభించడం తో ఈ రెండు సినిమాలు మొదటి స్థానం లో కొనసాగుతున్నాయి అని అనుకోవాల్సిందే. అందుచేత సంక్రాంతి 2025 సంయుక్త విజేతలు డాకూ మహారాజ్ మరియు సంక్రాంతికి వస్తున్నాం.