April 19, 2025

Social Media Trolls Killed Woman in AP| సోషల్ మీడియా అరాచకానికి మహిళ బలి

సోషల్ మీడియా ఆమె ప్రాణం తీసింది. ఇంటి పట్టా చేతికి అందిన వెంటనే ఆ మహిళ తన ఆనందాన్ని మీడియా ముందు వ్యక్త పరచింది. తనకు ఒక ఇంటిని ఇచ్చిన ఘనత ప్రస్తుత ప్రభుత్వానిదే అంటూ పొగడ్తలతో ముంచెత్తింది. అదే ఆమె చేసిన తప్పు. అలా మాట్లాడటమే తన ప్రాణం మీదకు తీసుకు వస్తుంది అంటే ఒక క్షణం ఆలోచించి ఉండేదేమో. ఇద్దరు చిన్న చిన్న ఆడపిల్లలను పెట్టుకొని అంతటి అఘాయిత్యానికి పాల్పడి ఉండేది కాదేమో.

Social media trolls

సోషల్ మీడియా ట్రోల్స్ భరించలేక ప్రాణాలు తీసుకున్న మహిళ

Social Media Trolls Killed Woman in AP| సోషల్ మీడియా అరాచకానికి మహిళ బలి

సోషల్ మీడియా ఆమె ప్రాణం తీసింది. ఇంటి పట్టా చేతికి అందిన వెంటనే ఆ మహిళ తన ఆనందాన్ని మీడియా ముందు వ్యక్త పరచింది. తనకు ఒక ఇంటిని ఇచ్చిన ఘనత ప్రస్తుత ప్రభుత్వానిదే అంటూ పొగడ్తలతో ముంచెత్తింది. అదే ఆమె చేసిన తప్పు. అలా మాట్లాడటమే తన ప్రాణం మీదకు తీసుకు వస్తుంది అంటే ఒక క్షణం ఆలోచించి ఉండేదేమో. ఇద్దరు చిన్న చిన్న ఆడపిల్లలను పెట్టుకొని అంతటి అఘాయిత్యానికి పాల్పడి ఉండేది కాదేమో. ఆమె మనసు ఎంత గాయపడి ఉండక పోతే అంతటి నిర్ణయం తీసుకొని ఉంటుంది. రెండు రోజులు నరకం అనుభవించి తన చిన్న ఆడ పిల్లలను వదిలి తను ప్రాణం తీసుకొని వెళ్ళిపోయింది. కోటి ఆశలతో ఉరకలెత్తిన ప్రవాహం లా సాగిన ఆమె మాటలు ఎవరూ మర్చిపోలేరు. గీతాంజలి గారికి ఇదే మా శ్రద్ధాంజలి.(Social Media Trolls)

తుచ్చమైన రాజకీయం కోసం ..

తుచ్చమైన రాజకీయం కోసం ఎప్పుడూ కోరలు సాచి ఎదురు చూస్తున్నాయి ప్రస్తుత రాజకీయ పార్టీల సోషల్ మీడియా టీములు. సామాన్యులు, ముఖ్యం గా మహిళలు ప్రభుత్వానికి అనుకూలం గా గాని, వ్యతిరేకం గా గాని మాట్లాడితే ఈ సోషల్ మీడియా టీములు విరుచుకు పడుతున్నాయి. అసభ్యకరమైన భాషలో వారిని బండబూతులు తిడుతున్నాయి. వారి బంధువుల వద్ద, మిత్రుల వద్ద తలెత్తుకోలేని విధం గా వారిని ట్రోల్ చేస్తున్నాయి. నీచమైన భాష లో రాబందుల వలె పొడుచుకు తింటున్నాయి. ఇందులో అధికార పక్షం అని లేదు. ప్రతి పక్షం అనిలేదు. అందరూ తప్పు చేస్తున్నారు. వీరి వికృత చేష్టలకు అమాయకులు  సమాజం లో తలెత్తుకోలేక ప్రాణాలు తీసుకొంటున్నారు. (Social Media Trolls)

నీచమైన బాష వాడుతారు…

సోషల్ మీడియా వేదిక  గా వారు ఇచ్చే ప్రసంగాలు చూస్తే సగటు ప్రేక్షకుడికి కడుపులో తిప్పినట్టు అవుతుంది. మీ ఇళ్ళలో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా అని అందరికీ అడగాలని అనిపిస్తుంది. సభ్య సమాజం లో ఇటువంటి చీడ పురుగులు కూడా ఉంటారా అనిపిస్తుంది. కాని వాళ్ళని ఎవరూ ఏమీ అనలేం. ఎందుకంటే వారు ఆయా రాజకీయ పార్టీల ముసుగు లో ఉంటారు కాబట్టి. ఆయా పార్టీల తరపున మాట్లాడితే అంత వెకిలి గా మాట్లాడాలా అని అనుకుంటాం గాని ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితి.(Social Media Trolls)

ముఖ్యమంత్రి పదవి లో ఉన్న వ్యక్తి అని కూడా లేకుండా ఏకవచనం తో మాట్లాడుతూ విషం చిమ్మే అనేక మంది సోషల్ మీడియా అవతారాల్ని చూస్తున్నాం. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి గా పనిచేసిన వ్యక్తి అనే గౌరవం కూడా లేకుండా  అధికార పక్షమూ అంతకు మించి  బురద చిమ్మే ప్రయత్నాలు చూస్తుంటాం. దీనికి అంతు ఎక్కడో ఎవరికీ తెలీదు.

ఒక పౌరునిగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడమే ఈ రోజులలో పాపం అన్నట్టు తయారైంది. ఆమె తన ఆనందాన్ని వ్యక్తం చేయడం కూడా తప్పు అయిపొయింది.

ఈ పద్దతి మారాలి  (Social Media Trolls)

ఈ పధ్ధతి మారాలి. ట్రోల్ చేస్తున్న అవతలి వారు కూడా మనుషులే అనే స్పృహ ఉండాలి. పార్టీ అధినేతలు ఈ విషయం లో దృష్టి సారించాలి. లేకపోతే వచ్చే రెండు నెలలలో ఎన్నికలు ముగిసే లోపు ఎన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోతాయో చెప్పలేం. వ్యక్తిత్వ హననానికి పాల్పడటం తో సమాజం లో తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మహిళలకు ఈ ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. అత్యంత నీచం గా కామెంట్లు పెట్టడం తో ప్రధానం గా మహిళలు తట్టుకోలేక పోతున్నారు.

గీతాంజలి ఇప్పుడు బ్రతికి లేదు 

కళ్ళనిండా ఎన్నో ఆశలతో ఇంటి పట్టా అందుకున్న గీతాంజలి ఇప్పుడు బ్రతికి లేదు. కాని అమ్మ ప్రేమకు దూరమైన ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. తల్లి లేని లోటును ఆ పిల్లలకు ఎవరు తీర్చగలరు ? ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది.. ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవుతారు. కాలం నడుస్తూ ఉంటుంది. కాని.. తమను  గుండెలలో పొదువుకొని ఎంతో ప్రేమను పంచిన అమ్మ తిరిగి వస్తుందేమో అని ఆ చిన్న పిల్లల కళ్ళు ఎప్పటికీ ఎదురుచూస్తూనే ఉంటాయి. తల్లి తన పిల్లలపై చూపే లాలిత్యానికి ఆల్టర్ నేటివ్ ఈ ప్రపంచం లోనే లేదని మనకు తెలుసు. అకారణం గా ఆ చిన్న పిల్లలకు తల్లిని దూరం చేసిన వాళ్లకు ఆ పాపం తగులుతుంది. సందేహమే లేదు.

ఇటువంటి మరణాలు  మరిన్ని జరగకూడదు అంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి అందరూ..

  • ప్రధానం గా మహిళలు తామర తంపర గా పుట్టు కొచ్చిన సోషల్ మీడియా చానళ్ళ తో వీలైనంత మాట్లాడకుండా ఉండటం మంచిది.
  • ప్రభుత్వం పై అభిమానం ఉంటే ఓటు రూపం లో దానిని వ్యక్త పరచ వచ్చు గాని అడ్డమైన చానళ్ళ వారితో తమ అభిప్రాయం పంచుకోకుండా ఉండటమే మేలు.
  • ఈ ఎన్నికలు ముగిసే వరకూ సోషల్ మీడియా కు చెందిన ఫేస్ బుక్, యూ ట్యూబ్ వంటి వాటిని వ్యక్తిగతం గా నిషేదించు కోవడం ఎంతైనా మంచిది.
  • టీవీ చానళ్ళ లో జరిగే డిబేట్ లు చూడటం వలన బీపీ పెరిగి ఆరోగ్యం చెడిపోవడం తప్ప మరొక ప్రయోజనం లేదు.
  • రాజకీయ పక్షాల గురించి ఇంట్లో వాళ్ళతో, మిత్రులతో ఎట్టి పరిస్థితులలోనూ వాదన పెట్టుకోవద్దు.
  • వాట్సప్, టెలిగ్రాం వంటి వాటిలో ఫ్యామిలీ గ్రూపుల్లో ఎటువంటి రాజకీయ సంబంధ పోస్టులు షేర్ చెయ్యకండి.
  • పొరపాటున మన ఇంట్లో మహిళలు ఏవైనా ట్రోల్స్ ఎదుర్కోవలసిన పరిస్థితి వస్తే వారికి మానసిక స్థయిర్యం ఇవ్వండి. ట్రోల్స్ చేస్తున్న పిచ్చి కుక్కల మాదిరి మీరూ వారిని వేధించి వారి మరణానికి కారణం కాకండి.

PS: గీతాంజలి మరణాన్ని రాజకీయం గా వాడుకోకుండా వారి చిన్న పిల్లలకు ఒక అండగా నిలబడాలి జగన్ ప్రభుత్వం. ఆ పిల్లల చదువులు పూర్తి అయ్యేంత వరకు వారి భాద్యత తీసుకుంటేనే ఆమెకు న్యాయం చేసినట్లు అవుతుంది. ప్రభుత్వం ఈ విషయం లో సకారాత్మకం గా స్పందిస్తుందని ఆశిద్దాం.

-Vijay News Telugu Team

2 thoughts on “Social Media Trolls Killed Woman in AP| సోషల్ మీడియా అరాచకానికి మహిళ బలి

  1. Ha news kodhiga wrong sir. Trolling jarigindhi but Ami suicide cheshukoka mundhu trolling cheyaledhu sir. 7.03.24 ami suicide attempt cheshindhi. Ami medha trolling debates start ayindhi 8 or 9 nuchi apati. 7.03.24 ha roju case file cheyaledhu sir. Chanipoyindhi 11.03.24. case e roju night file chesharu. Ami personal reasons kuda unavi ani antunaru sir. Nijam edho police ly chepali sir . Ami nu two political partys use cheshukuntunavi sir. Challa siggu paduthuna oka women chanipothi Ami medha politics chestunaru.Atuvati state unadhuku.

    1. ఏది ఏమైనా ఒక మహిళను ఆ విధం గా ట్రోల్ చెయ్యడం తప్పు. ఐదు రూపాయల కోసం ఎవరైనా అలా చెప్పేస్తారా… వైసీపీ వాళ్ళు బలవంతం గా ఆమె చేత చెప్పించారు అంటున్నారు. ఆమె మాట్లాడే విధానం చూస్తే అలా అనిపిస్తోందా…? ఆమె సూసైడ్ attempt చేసుకున్న తర్వాత కూడా ట్రోల్ చెయ్యడం నిజం గా దారుణం అండి.. వదిలెయ్యండి. ఆమె తప్పుడు నిర్ణయం తీసుకుంది. ఆ చిన్న పిల్లలు ఎలా ఉంటారో అనే నాకు చాలా బాధ కలుగు తోంది.ఈ పొలిటికల్ పార్టీలు, ట్రోల్ చేసేవాళ్ళు అందరూ బాగానే ఉన్నారు . ఆ పిల్లలకు తల్లి లేదు..ఆ లోటు ఎవరూ తీర్చ లేనిది. ఆ ఇద్దరు పిల్లల కు ఈ పొలిటికల్ పార్టీలు న్యాయం చెయ్యాలి.

Comments are closed.