శభాష్ ఇండియన్ నేవీ … సముద్రపు దొంగ ఒకడు నవ్వులు పూయించాడు గా
శభాష్ ఇండియన్ నేవీ … సముద్రపు దొంగ ఒకడు నవ్వులు పూయించాడు గా ….
కొన్ని సీరియస్ సంఘటనలు జరిగేటప్పుడు ఉన్నట్టుండి నవ్వు తెప్పించే ఘటనలు కూడా కొన్ని చోటు చేసుకొంటాయి.. ఇరాన్ నౌక పై దాడి చేసిన సోమాలియా సముద్రపు దొంగలను భారత నౌకాదళ కమెండోలు బంధించారు.. ఆ సముద్రపు దొంగలలో ఒకరు చేసిన పని నెట్టింట నవ్వులు పూయిస్తోంది…RCB Jersey Somali Pirate
అసలు ఏం జరిగింది ..?
ఇరాన్ కు చెందిన కార్గో బోటు ను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్ చేసారు.. సమాచారం అందుకొన్న భారత నౌకాదళానికి చెందిన యుద్ధ నౌక INS సుమిత్ర సొమాలి తీర ప్రాంతానికి చేరుకొంది. ఇది కోచి సముద్ర తీరానికి దాదాపు 800 నాటికల్ మైళ్ళ దూరం అంటే 1574 కిలో మీటర్ల దూరం లోని పశ్చిమ ప్రాంతం. భారత కమెండో లు మెరుపు దాడి చేసి ఆ నౌక లో ఉన్న 19 మంది పాకిస్తానీ లను రక్షించారు. అల్ నేమీ అనే పేరు గల కార్గో నౌక అనూహ్యం గా ఈ పైరేట్ల బారిన పడింది. ఇరాన్ కు చెందిన ఈ నౌక ను కాపాడటం , దాన్లో ఉన్న 19 మంది పాకిస్తాన్ దేశీయులను కాపాడటం తో భారత నౌకాదళం పై హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి.(RCB Jersey Somali Pirate)
ఈ సముద్రపు దొంగ (పైరేట్) ఏం చేసాడంటే….(RCB Jersey Somali Pirate )
ఈ సందర్బం గా ఆ సముద్రపు దొంగలను బంధించి ఉంచిన ఫోటో ఒక దానిని భారత నౌకాదళం విడుదల చేసింది. ఈ ఫోటో ను నిశితం గా గమనించిన వారు నిజం గానే ఆశ్చర్య పోయారు. ఎందుకంటే…. సోమాలియా కు చెందిన ఆ సముద్రపు దొంగల్లో ఒకడు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ఆటగాళ్ళు ధరించే జెర్సీ ధరించి ఉన్నాడు. దీనిని చూసిన వారు నెట్ లో తమ కామెంట్స్, మీమ్స్ తో హాల్ చల్ చేస్తున్నారు. అనేక జోకులు వేసారు.. రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు (RCB) ఒక్కసారి కూడా కప్ గెలవక పోవడం తో విరక్తి చెంది అలా సముద్రపు దొంగ అయ్యాడని X (Twitter) లో , ఇతర సోషల్ మీడియా వేదికల పై జోకులు వేస్తున్నారు.
నెటిజన్లు ఇంకా ఏమని అంటున్నారో మీరే చూడండి…(RCB Jersey Somali Pirate )
- “ఆర్సీబీ ఒక్కసారి కూడా కప్ గెలవక పోవడం తో నిరాశ కు గురై సముద్రపు దొంగ అయిపోయి ఉంటాడు ” అని ఒకరు
- “Divided by Nation, United by RCB”
- “RCB ఫాన్ ఫాలోయింగ్ విశ్వ వ్యాప్తం అయ్యింది “
- “RCB జెర్సీ వేసుకొంటే భారత నౌకాదళం ఏమైనా కొంచం జాలి చూపిస్తుందని వేసుకొని ఉంటాడు ” అని ఒకరు
- “RCB జట్టు ఎలాగూ ట్రోఫీ గెలవడం లేదు కాబట్టి నేరుగా ఆ ట్రోఫీ నే ఎత్తుకు పోవాలని అలా వేసుకొని ఉంటాడు” అని ఒకరు…
- “అసలు వాళ్ళు ఆ జెర్సీ వేసుకోవడం వల్లనే దొరికిపోయారు… ఆ జెర్సీ పవర్ అలాంటిది ” అని మరొకరు..
- “RCB ఫాన్ కావడం అంత ఈజీ కాదు” అంటూ మరొకరు
- “అతడు మన వాడే అయ్యుంటాడు.. RCB ట్రోఫీ గెలవక పోవడం తో సోమాలియా వెళ్లి దొంగ గా మారి ఉంటాడు” అని ఒకరు
- “ఇంత కంటే తక్కువ స్థాయి కి దిగజారదు అనుకొన్న ప్రతీ సారీ RCB ఇలా దిగజారుతూ ఉంటుంది” అని మరొకరు
- “జైలర్ సినిమా లో ఒక వ్యక్తి RCB జెర్సీ వేసుకొంటే ఆ సీన్లు తొలగించాలని రాద్దాంతం చేసారు.. ఇప్పుడు చెప్పండి” అని మండి పడుతూ ఒకరు
- “ఈ సాలా షిప్ namde” అంటూ ఒకరు..
- “ఆడటానికి అవకాశం రాని ఎక్స్ ట్రా ప్లేయర్ అతను” అంటూ మరొకరు…
- “ఇది కావాలనే చేసి ఉంటారు. కోహ్లీ బ్యాటింగ్ చేస్తున్నపుడు పాలస్తీనా మద్దతు దారుడు అతనికి దగ్గరగా వెళ్ళాడు .. ఇతరుల గుర్తింపు కోసం.. అటువంటి ఉద్దేశ్యం వీళ్ళకి కూడా ఉండి ఉండవచ్చు ” అని ఒకరు…
- “అంతర్జాతీయ జలాలలో కూడా RCB కి ఓటమే ఎదురౌతోంది ” అంటూ ఒకరు…
ఇలా నెట్టింట సోషల్ మీడియా లో పాజిటివ్ గా, నెగెటివ్ గా అనేక జోక్స్ వేస్తున్నారు.. అనేక మీమ్స్ కూడా పెడుతున్నారు. ఆ పైరేట్ ఏ ఉద్దేశ్యం తో వేసుకున్నాడో గాని అతడు ఆ జెర్సీ తో ఉన్న ఫోటో వైరల్ అవుతోంది.
ఇదిలా ఉంటే గత ఆదివారం అంటే 28 జనవరి 2024 న ఇరాన్ కు చెందిన మరొక ఫిషింగ్ నౌక FV ఇమాన్ ను కూడా ఈ పైరేట్ల బారి నుండి కాపాడింది భారత నౌకాదళం. సోమాలియా తూర్పు కోస్తా ప్రాంతం లో ఈ సంఘటన జరిగింది. ఈ ఘటన లో 17 మంది నౌక లోని సిబ్బంది ని భారత నౌకాదళం కాపాడింది.
VIJAY NEWS DESK