Stock Market Today Telugu-కుదేలైన స్టాక్ మార్కెట్-క్షీణించిన షేర్లు
స్టాక్ మార్కెట్ లు గత రెండు రోజులు గా పతనం అవుతూ వస్తున్నాయి.. గత 18 నెలల లో ఎప్పుడూ లేనంత గా స్టాక్ మార్కెట్ పతనం అయ్యింది… 2022 జూన్ 13 తర్వాత మార్కెట్ ఇంతగా పతనం కావడం ఇదే మొదటిసారి.. 17-01-24 బుధవారం నాడు ఒక్కసారిగా తీవ్ర ఒత్తిడి కి గురయ్యాయి మార్కెట్ లు.(Stock Market Today Telugu)
కుదేలైన హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు షేర్లు:
హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు షేరు ఒక్కసారిగా 8.46 % నష్టపోయింది. 2020 మార్చి 23 న ఈ బ్యాంకు షేరు 12.7% నష్టపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే ఇంత నష్టం జరిగింది. ఈ బ్యాంకు కు చెందిన డిసెంబర్ త్రైమాసిక ఫలితాలు నిరాశాజనకం గా ఉండటం తో మోర్గాన్ స్టాన్లీ మరియు సి ఎల్ ఎస్ ఏ సంస్థలు షేర్ రేటింగ్ ను తగ్గించడం వలన హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు షేర్లు దారుణం గా పతనం అయ్యాయి.
అధిక వెయిటేజీ కలిగిన హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు షేర్ల పతనం తో పాటు చైనా ఆర్ధిక వ్యవస్థ బలహీన పడింది అనే సంకేతాలు, అమెరికా ద్రవ్యోల్బణం, ఫెడరల్ బ్యాంక్ వడ్డీ రేట్లకు సంబంధించి తగ్గింపు ఒత్తిడి వంటి ఇతర అంశాల వలన స్టాక్ మార్కెట్ పతనం చవి చూసింది. సెన్సెక్స్ మరియు నిఫ్టీ 2 శాతానికి పైగా క్షీణించాయి.
17-01-24 బుధవారం దేశీయ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ 50 ఇలా ఉన్నాయి
సెన్సెక్స్ 1628 పాయింట్లు కోల్పోయి 71,501 పాయింట్ల వద్ద స్థిర పడింది
నిఫ్టీ 460 పాయింట్లు కోల్పోయి 21,572 పాయింట్ల వద్ద స్థిర పడింది.
17-01-2024(Wednesday) | ||
Sensex | 71,501 | -1628 |
Nifty | 21,501 | -460 |
మార్కెట్ల పతనం తో హెచ్ డి ఎఫ్ సి బ్యాంకు మొత్తం రూ. 1.07 లక్షల కోట్ల నష్టాన్ని చవి చూసింది. అదే విధంగా బి ఎస్ ఈ రూ. 4.69 లక్షల కోట్ల సంపద నష్టపోయింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు కూడా నష్టాలను చవి చూసాయి.
18-01-24 గురువారం జరిగిన ట్రేడింగ్ వివరాలు:
స్టాక్ మార్కెట్ల పతనం వరుసగా మూడవ రోజు కూడా కొనసాగింది. మార్కెట్ సెంటిమెంట్ బలహీనం గా ఉండటం తో గురువారం ఉదయం సెన్సెక్స్ 477 పాయింట్లు కోల్పోయి 71,018 వద్ద ప్రారంభం అయ్యింది. నిఫ్టీ కూడా ఒత్తిడి ని ఎదుర్కొని 158 పాయింట్లు కోల్పోయి 21,414 పాయింట్ల వద్ద ప్రారంభం అయ్యింది. అధిక వెయిటేజీ కలిగిన హెచ్ డీ ఎఫ్ సి షేర్ ల పతనం తో మార్కెట్ కోలుకోలేక పోయింది. చివరికి సెన్సెక్స్ 314 పాయింట్లు కోల్పోయి 71,187 వద్ద స్థిర పడింది. అలాగే నిఫ్టీ 110 పాయింట్లు కోల్పోయి 21,462 పాయింట్ల వద్ద స్థిర పడింది.
18-01-2024(Thursday) | ||
Sensex | 71,187 | -314 |
Nifty | 21,462 | -110 |
అధిక నష్టాలు చవి చూసిన షేర్లు(Stock Market Today Telugu)
- LTI Mindtree : 672.60 రూపాయలు నష్టపోయి 5,603 రూపాయల వద్ద స్థిరపడింది (10.7% నష్టం)
- HDFC Bank: 51.35 రూపాయలు నష్టపోయి 1,486 రూపాయలు వద్ద స్థిరపడింది (3.34 % నష్టం)
- NTPC : 10 రూపాయలు నష్టపోయి 299 రూపాయలు వద్ద స్థిరపడింది (3.23% నష్టం)
- Titan company: 95 రూపాయలు నష్టపోయి 3,734.70 రూపాయలు వద్ద స్థిరపడింది (2.49% నష్టం)
- Asian Paints: 78.45 రూపాయలు నష్టపోయి 3,163.85 రూపాయలు వద్ద స్థిరపడింది (2.42% నష్టం )
ఈ రోజు అధిక లాభాలను చవి చూసిన షేర్లు :(Stock Market Today Telugu)
- Sun Pharma: 36.75 రూపాయలు పెరిగి 1,335.75 వద్ద స్థిరపడింది (2.83% లాభం)
- Cipla : 28.95 రూపాయలు పెరిగి 1,322.95 వద్ద స్థిర పడింది (2.24% లాభం)
- Tech Mahindra: 28.40 రూపాయలు పెరిగి 1,355.15 వద్ద స్థిర పడింది (2.14.% లాభం)
- Tata Motors: 13.50 రూపాయలు పెరిగి 819.05 వద్ద స్థిరపడింది.(1.68% లాభం)
- Axis Bank : 15.20 రూపాయలు పెరిగి 1,097 .50 వద్ద స్థిర పడింది (1.40% లాభం)