January 10, 2025

Stone Attack on AP CM YS Jagan in Vijayawada – సిఎం జగన్ పై రాళ్ళ దాడి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్ జగన్  మోహన రెడ్డి పై రాళ్ళ దాడి జరిగింది. మేమంతా సిద్ధం సభలలో భాగం గా  విజయవాడ లోని సింగ్ నగర్ రోడ్ షో లో పాల్గొన్నపుడు ఈ సంఘటన జరిగింది. జగన్ ఎడమ కనుబొమ్మ పై తీవ్రమైన గాయం తగిలింది. క్యాట్ బాల్ ఉపయోగించి వేగం గా రాయిని విసరడం వల్లనే ఈ  ఘటన జరిగినట్లు భావిస్తున్నారు.

Stone Attack on AP CM Jagan -

ముఖ్యమంత్రి ఎడమ కనుబొమ్మ పై గాయం pic credits: X @YSR Congress Party

Stone Attack on AP CM YS Jagan in Vijayawada – సిఎం జగన్ పై రాళ్ళ దాడి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్ జగన్  మోహన రెడ్డి పై రాళ్ళతో  దాడి జరిగింది. మేమంతా సిద్ధం సభలలో భాగం గా  విజయవాడ లోని సింగ్ నగర్ రోడ్ షో లో పాల్గొన్నపుడు ఈ సంఘటన జరిగింది. జగన్ ఎడమ కనుబొమ్మ పై తీవ్రమైన గాయం తగిలింది. క్యాట్ బాల్ ఉపయోగించి వేగం గా రాయిని విసరడం వల్లనే ఈ  ఘటన జరిగినట్లు భావిస్తున్నారు. జగన్ ఎడమ కనుబొమ్మ పై భాగం లో Y ఆకారం లో గాయం తగలడం తో  రక్తం కారి  జగన్ విలవిల్లాడారు.  జగన్ పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ కు కూడా కంటిపై గాయం తగిలింది.

ఆకతాయిలు చేసిన దాడి కాకపోవచ్చు 

ఎవరో ఆకతాయిలు చేసిన పనిగా ముందు అందరూ భావించారు. అయితే గాయం తీవ్రత ఎక్కువగా ఉండటం సూటిగా గురిచూసి కొట్టినట్లు కనిపించడం తో ఇది ఎవరో  కావాలని చేసిన దాడిగా భావిస్తున్నారు. కుట్ర కోణాన్ని బయట పెట్టడానికి పోలీసు బృందాలను ఏర్పాటు చేసారు.

ఘటన జరిగిన ప్రదేశం లో స్కూల్ భవనాలు ఇతర భవనాలు ఉండటం తో ఎవరైనా వాటి పైనుండి దాడి చేసి ఉంటారని భావిస్తున్నారు. ఒంటి పూట మాత్రమే బడులు ఉండటం తో ఎవరైనా ఆ భవనాల పై నుండి దాడి చేసే అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్నారు. ఘటన దృశ్యాలు కెమెరాలో రికార్డు అయ్యాయి.

దాడి జరిగింది ఇలా… Stone Attack on AP CM YS Jagan

విజయవాడ లో సింగ్ నగర్ మీదుగా యాత్ర జరుగుతోంది. బస్సు పై నిల్చొని జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్నారు. ఆ ప్రాంతం లో అప్పుడు కరెంట్ కూడా లేదు. ఉన్నట్టుండి రెప్ప పాటు కాలం లో వేగం గా దూసుకొచ్చిన రాయి జగన్ ఎడమ కనుబొమ్మ పై భాగం లో గాయం చేసింది. అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ కంటికి కూడా రాయి తగిలింది. ఏం జరిగిందో ఎవరికీ తెలియలేదు. తగిలిన గాయం నుండి రక్తం బయటకు వచ్చేసరికి జగన్ వ్యక్తిగత సిబ్బంది కర్చీఫ్ తో దాన్ని అదిమిపట్టారు. అయినప్పటికీ రక్తం ఉబికి వచ్చి కనురెప్పల వరకూ కారింది. ఈ లోపు వైద్యులు అక్కడకు చేరుకొని ప్రధమ చికిత్స చేసారు. గాయం పై ప్లాస్టర్ వేసిన తర్వాత తన యాత్రను కొనసాగించారు జగన్.

తన కోసం వచ్చిన ప్రజలను నిరుత్సాహ పరచకుండా రోడ్ షో లో పాల్గొన్నారు . విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నప్పటికీ జగన్ ఉత్సాహం గానే ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు వెళ్ళారు..

Stone Attack on AP CM YS Jagan
Stone Attack on AP CM YS Jagan Pic Credits: X @ YSR Congress Party

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్న జగన్ – Stone Attack on AP CM YS Jagan

అనంతరం విజయవాడ  ప్రభుత్వ ఆసుపత్రి కి చేరుకున్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన రెడ్డి తో పాటు ఆయన భార్య వై ఎస్ భారతి కూడా ప్రభుత్వ ఆసుపత్రి కి చేరుకున్నారు. గాయాన్ని పరీక్షించిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు గాయం బలం గానే తగిలింది అని పేర్కొన్నారు. గాయం తీవ్రత ను బట్టి మూడు కుట్లు వేసినట్లు తెలుస్తోంది. గాయం తగిలిన ప్రాంతం లో వాపు కూడా ఎక్కువగానే ఉందని వైద్యులు తెలియజేసారు.  కనీసం ఒక రోజు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడం తో బస్సు యాత్ర కు ఒకరోజు విరామం ప్రకటించారు.

Stone Attack on AP CM YS Jagan  Pic Credits: X @ YSR Congress Party
ప్రభుత్వ వైద్యుల పర్యవేక్షణ లో జగన్ pic: X @YSR Congress Party

ప్రధాని మోడీ తో పాటు పలువురు జగన్ త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేసారు. 

జగన్ త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ తమ ‘X’ అకౌంట్ లో ట్వీట్ చేసారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు త్వరగా కోలుకొని మంచి ఆరోగ్యాన్ని పొందాలని ప్రార్దిస్తున్నానని తెలియ జేశారు.

ఏపీ సి.ఎం పై జరిగిన రాళ్ళ దాడిని ఖండిస్తున్నానని తమిళనాడు సి ఎం స్టాలిన్ తమ ‘X’ ఖాతా లో ట్వీట్ చేసారు. రాజకీయ విబేధాలు ఎప్పుడూ హింస కు దారి తీయకూడదని, ప్రజాస్వామ్య విధానం లో పరస్పర గౌరవాన్ని కాపాడుకుంటూ ముందుకు పోవాలని జగన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ పై జరిగిన రాళ్ళ దాడిని తీవ్రం గా ఖండిస్తున్నట్లు కేటీఆర్ తమ ‘X’ ఖాతా లో ట్వీట్ చేసారు. టేక్ కేర్ జగన్ అన్నా.. గ్లాడ్ యు ఆర్ సేఫ్ అంటూ ప్రజాస్వామ్యం లో హింసకు తావు లేదు ఈ విషయం లో ఎలక్షన్ కమీషన్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

జగన్ పై జరిగిన దాడి తనను షాక్ కు గురిచేసిందని ఆయన త్వరగా కోలుకోవాలని మమతా బెనర్జీ తమ ‘X’ ఖాతా లో ట్వీట్ చేసారు. Stone Attack on AP CM YS Jagan

పలువురు వైసీపీ నేతలు ఈ దాడిని తీవ్రం గా ఖండించారు.