Sun Risers Hyderabad in Finals| TATA IPL 2024| ఫైనల్స్ కి దూసుకెళ్లిన సన్ రైజర్స్
మొదటి 9 మ్యాచుల్లో 8 విజయాలు సాధించి టేబుల్ టాప్ లో చాలా కాలం ఉన్న జట్టు ఇలా క్వాలిఫైయర్ లో ఓడిపోవడం తో RR అభిమానులు తీవ్ర నిరాశ లో కూరుకు పోయారు. ఈ సారి తమ జట్టే ట్రోఫీ గెలుస్తుంది అని బలం గా నమ్మిన రాజస్థాన్ రాయల్స్ అభిమానులు స్టేడియం లో కంటతడి పెట్టారు.
Sun Risers Hyderabad in Finals| TATA IPL 2024| ఫైనల్స్ కి దూసుకెళ్లిన సన్ రైజర్స్
చెన్నై లో నిన్న జరిగిన క్వాలిఫయిర్ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాజస్తాన్ రాయల్స్ జట్టును ఓడించి ఫైనల్స్ లో అడుగు పెట్టింది. ఇప్పటికే ఫైనల్ చేరిన KKR జట్టుతో సన్ రైజర్స్ జట్టు తలపడుతుంది. చేపాక్ స్టేడియం రెండవ సెషన్ లో పూర్తిగా స్పిన్ కు అనుకూలం గా మారిపోవడం తో రాజస్థాన్ రాయల్స్ బాట్స్ మన్ చేతులెత్తేశారు..Sun Risers Hyderabad in Finals
ఎటువంటి డ్యూ లేకపోవడం తో పిచ్ స్పిన్నర్లకు అనుకూలం గా మారింది. షాబాజ్ మరియు అభిషేక్ శర్మ తమ స్పిన్ మాయాజాలం తో RR నడ్డి విరిచారనే చెప్పవచ్చు. ప్రధాన బ్యాట్స్ మన్ తక్కువ పరుగులకే పెవిలియన్ చేరుకున్నారు. తొలి ఆరు ఓవర్ల లో ఒక వికెట్ నష్టానికి 50 పరుగులు చేసి కొంచం పటిష్టమైన స్థితిలోనే కనిపించింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్ల కు పిచ్ ఏ విధం గానూ సహకరించక పోవడం తో RR కు ఓటమి తప్పలేదు.Sun Risers Hyderabad in Finals
మే 26 న జరిగే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో SRH జట్టు KKR తో తలపడుతుంది. ఈ మ్యాచ్ కూడా చెన్నై లో ఇదే స్టేడియం లో జరుగుతుంది. దాదాపు ఈ మధ్యకాలం లో జరిగిన అన్ని మ్యాచ్ లలో రెండవ సారి డ్యూ ఎక్కువగా రావడం, దానితో బ్యాట్స్ మన్ కు అనుకూలం గా మారడం చూస్తూనే ఉన్నాం.. అయితే నిన్న జరిగిన మ్యాచ్ లో మాత్రం అలా జరగలేదు. డ్యూ లేకపోవడం తో పిచ్ స్పిన్నర్లకు అనుకూలం గా మారిపోయింది.
తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ లో RR కు ఏ విభాగం లోనూ కలిసి రాలేదు. అయితే సన్ రైజర్స్ లాంటి బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న జట్టును కేవలం 170 పరుగులకు కట్టడి చేయడం లో బౌలర్లు తీవ్రం గా కష్టపడ్డారు. లేదంటే సన్ రైజర్స్ భారీ స్కోరు చేసేది. బౌలింగ్ బాగానే చేసినప్పటికీ వాతావరణం సహకరించక పోవడం తో వికెట్లను స్పిన్నర్లకు సమర్పించు కోవలసి వచ్చింది.
మొదటి 9 మ్యాచుల్లో 8 విజయాలు సాధించి టేబుల్ టాప్ లో చాలా కాలం ఉన్న జట్టు ఇలా క్వాలిఫైయర్ లో ఓడిపోవడం తో RR అభిమానులు తీవ్ర నిరాశ లో కూరుకు పోయారు. ఈ సారి తమ జట్టే ట్రోఫీ గెలుస్తుంది అని బలం గా నమ్మిన రాజస్థాన్ రాయల్స్ అభిమానులు స్టేడియం లో కంటతడి పెట్టారు.
సన్ రైజర్స్ అభిమానులు ముఖ్యం గా జట్టు ఓనర్ కావ్యా మారన్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అశేషం గా హాజరైన సన్ రైజర్స్ అభిమానులతో చేపాక్ స్టేడియం నిండిపోయింది. స్టేడియం లో చాలా చోట్ల CSK అభిమానులు కూడా కనిపించారు. దక్షిణాది కి చెందిన సన్ రైజర్స్ జట్టు ఫైనల్ కి చేరుకోవడం తో దక్షిణాది రాష్ట్రాల క్రికెట్ అభిమానులు సన్ రైజర్స్ జట్టు గెలవాలని కోరుకొంటున్నారు. ఈ సారి తప్పకుండా సన్ రైజర్స్ జట్టు ఐపీఎల్ ట్రోఫీ గెలుస్తుందని , ఫైనల్ లో KKR కి పరాభవం తప్పదని అభిమానులు పెద్ద ఎత్తున చర్చించు కొంటున్నారు.