January 10, 2025

Sun Risers Hyderabad Qualified for Play offs| TATA IPL 2024| ప్లే ఆఫ్ కు చేరిన సన్ రైజర్స్

సంచలనాలకు చిరునామా గా మారిన IPL2024 లో RCB ఫైనల్ కి చేరి ఈసారి కప్పు గెలిచినా ఆశ్చర్య పోనవసరం లేదు. అన్ని జట్లు ధీమా గా ఉన్నప్పటికీ హాట్ ఫేవరేట్ మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ అనే చెప్పవచ్చు. ఒకవేళ ఫైనల్ SRH కి RCB కి మధ్య జరిగి ఆ మ్యాచ్ లో RCB ఓడిపోతే మాత్రం అశేష క్రికెట్ RCB అభిమానుల గుండె ముక్కలు అవుతుంది. ఇది కేవలం ఊహాగానం మాత్రమే… ఇలా జరగాలని ఏం లేదు… జరగకూడదని కూడా ఏం లేదు… చూద్దాం.. ఏం జరుగుతుందో 

Sun Risers Hyderabad in finals Pat Cummins

Sun Risers Hyderabad in finals - Pat Cummins Captain

SRH Qualified for Play offs TATA IPL 2024| ప్లే ఆఫ్ కు చేరిన సన్ రైజర్స్

ఉప్పల్ స్టేడియం లో జరగవలసిన మ్యాచ్ వర్షార్పణం కావడం తో సన్ రైజర్స్ జట్టు నేరుగా ప్లే ఆఫ్స్ కు చేరింది. వాతావరణం అనుకూలం గా లేకపోవడం తో ఎంపైర్ లు మ్యాచ్ జరగడం అసాధ్యం అని ప్రకటించడం తో రెండు జట్లకు ఒక్కొక్క పాయింట్ చొప్పున కేటాయించారు. దీనితో సన్ రైజర్స్ నేరుగా ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించిన మూడవ జట్టుగా నిలిచింది. ఇప్పటికే  KKR, RR జట్లు ప్లే ఆఫ్స్ కు చేరుకున్నాయి. Sun Risers Hyderabad Qualified for Play offs

ఎప్పుడూ సరైన ఆటగాళ్లను ఎంపిక చేయకుండా సరైన కూర్పు లేకుండా ఆడి కనీసం ప్లే ఆఫ్స్ కాదుకదా చివరి స్థానాల్లో నిలిచిన సన్ రైజర్స్ ఈ రోజు ఇలా ఠీవి గా క్వాలిఫై కావడం శుభ సూచకమే. ఈ IPL సీజన్ లో సంచలనాలు సృష్టించిన జట్టు ఏదైనా ఉంది అంటే ముందు స్థానం లో ఉండేది సన్ రైజర్స్ జట్టే. బ్యాటింగ్ లో విశ్వ రూపాన్ని చూపించింది. ఎందరో ఆటగాళ్ళు వెలుగు లోనికి వచ్చారు. ఒకరు ఫెయిల్ అయితే మరొకరు ఆడారు. అసలు సన్ రైజర్స్ మొదట బ్యాటింగ్ చేస్తుంది అంటేనే ప్రత్యర్ధి బౌలర్ల వెన్ను లో వణుకు పుట్టింది అనడం లో ఎలాంటి సందేహం లేదు.

కమ్మిన్స్ అయితే దేవుడే అయ్యాడు Sun Risers Hyderabad Qualified for Play offs 

ప్రపంచ కప్ ఫైనల్ లో గెలిచి సగటు భారత క్రికెట్ అభిమాని కి విలన్ గా కనిపించిన కమ్మిన్స్ అతి తక్కువ కాలం లోనే అదే భారత అభిమానుల చేత శభాష్ అనిపించు కున్నాడు. వరల్డ్ కప్ గెలిచి స్వదేశం వెళ్తే పలకరించే దిక్కే లేని కమ్మిన్స్ కి భారత దేశం లో క్రికెట్ కి ఉన్న ఆదరణ చూస్తే మతి పోయినంత పని అయ్యింది అని చెప్పవచ్చు. దాదాపు ప్రతి జట్టు ను తమ తమ హోం గ్రౌండ్ లో ఓడించి స్టేడియం ని సైలెన్స్ చేసిన ఘనత కూడా కమ్మిన్స్ కే దక్కుతుంది. అందుకే అందరూ అతన్ని’ సైలెన్సర్ ‘ అంటున్నారు..

స్టేడియం లోనూ, విమానాశ్రయాలలో కమ్మిన్స్ ఎక్కడ కనబడితే అక్కడ భారత క్రికెట్ అభిమానులు అతడికి నీరాజనాలు పట్టారు. సన్ రైజర్స్ యాజమాన్యం అయితే మరింత ప్రోత్సహించింది … విదేశీయుడై నప్పటికీ పాట్ కమ్మిన్స్ కి వచ్చిన ఆదరణ ఇతర ఏ ఆటగాడికీ రాలేదు అనే చెప్పవచ్చు. ఆఫ్ కోర్స్… వార్నర్ తో తెగతెంపులు చేసుకొన్న తర్వాతే తమ జట్టు గాడిలో పడిందని కూడా సన్ రైజర్స్ యాజమాన్యం భావిస్తూ ఉండవచ్చు.

ప్లే ఆఫ్స్ కి చేరుకొనే నాల్గవ జట్టు ఏది..?

ఇక ప్లే ఆఫ్స్ కు చేరుకొనే నాల్గవ జట్టు పైనే అందరికీ ఆసక్తి కనిపిస్తోంది. ఎందుకంటే CSK మరియు RCB మధ్య జరిగే మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వారు నేరుగా ప్లే ఆఫ్ కు చేరుకుంటారు. అయితే RCB కి మాత్రం కొన్ని పరిమితులు ఉన్నాయి. అనుకున్న రన్ రేట్ తో గెలవక పోతే మాత్రం ఆశలు గల్లంతే.. ఒక వేళ గెలిచినా కూడా కొన్ని పరిమితులకు లోబడి గెలిస్తేనే జట్టు అర్హత సాధిస్తుంది.

RCB ప్లే ఆఫ్స్ కు చేరాలంటే…(Sun Risers Hyderabad Qualified for Play offs)

RCB ప్లే ఆఫ్స్ కి చేరుకోవాలంటే ’18’ ఫ్యాక్టర్ ను దాటాలి. CSK పై 18 పరుగుల తేడా తో విజయం సాధించాలి. లేదా 18.1 ఓవర్ల లోనే తన విజయ లక్ష్యాన్ని సాధించాలి. ఈ రెండింటి లో ఏది సాధించినా RCB నేరుగా ప్లే ఆఫ్స్ కి వెళ్లి చరిత్ర సృష్టిస్తుంది. దారుణం గా మొదట ఆడిన అన్ని మ్యాచ్ లు ఓడిపోయి RCB అభిమానుల్ని నిరాశ పరిచినప్పటికీ రెండవ సెషన్ లో మాత్రం అదర గొడుతోంది RCB. ఈ IPL లోనే అతి కీలకమైన మ్యాచ్ గా చెప్పబడుతున్న ఈ మ్యాచ్ 18 వ తేదీన జరగడం ఒక విశేషం. అన్నిటికి మించి విరాట్ కోహ్లీ జెర్సీ నంబర్ కూడా 18 కావడం విశేషం. ఈ మ్యాచ్ లో కోహ్లీ ఏమైనా రెచ్చిపోయి ఆడి RCB ని ప్లే ఆఫ్స్ కి చేరిస్తే నిజం గా IPL లో సంచలనమే అవుతుంది.

సంచలనాలకు చిరునామా గా మారిన IPL2024 లో RCB ఫైనల్ కి చేరి ఈసారి కప్పు గెలిచినా ఆశ్చర్య పోనవసరం లేదు. అన్ని జట్లు ధీమా గా ఉన్నప్పటికీ హాట్ ఫేవరేట్ మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ అనే చెప్పవచ్చు.

PS: ఒకవేళ ఫైనల్ SRH కి RCB కి మధ్య జరిగి ఆ మ్యాచ్ లో RCB ఓడిపోతే మాత్రం అశేష క్రికెట్ RCB అభిమానుల గుండె ముక్కలు అవుతుంది. ఇది కేవలం ఊహాగానం మాత్రమే… ఇలా జరగాలని ఏం లేదు… జరగకూడదని కూడా ఏం లేదు… చూద్దాం.. ఏం జరుగుతుందో 

Vijay Sports News Desk

17-05-2024