March 7, 2026
Home » Swami Vivekananda Famous Quotations – స్వామి వివేకానంద కొటేషన్స్ – National Youth Day

Swami Vivekananda Famous Quotations – స్వామి వివేకానంద కొటేషన్స్ – National Youth Day

“స్వేచ్ఛగా ఉండేందుకు ధైర్యం చెయ్యి, నీ ఆలోచనలు నిన్ను ఎంతదూరం తీసుకెళ్తాయో తెలుసుకో, వాటిని జీవితంలో అమలు చేయడానికి ప్రయత్నించు.”

Swami Vivekananda Famous Quotations in Telugu

Swami Vivekananda Famous Quotations in Telugu

Swami Vivekananda Famous Quotations – స్వామి వివేకానంద కొటేషన్స్ – National Youth Day

స్వామి వివేకానంద జన్మదినమైన జనవరి 12 న జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకొంటాం. ఈ సందర్భం గా యువత ను ఉద్దేశించి స్వామి వివేకానంద చెప్పిన కొన్ని కొటేషన్స్ క్రింద ఇవ్వబడ్డాయి. దేశ నిర్మాణం లో యువత ప్రధాన మైన పాత్ర పోషించాలని ఆయన అనేక సందర్భాలలో చెప్పారు.(Swami Vivekananda Famous Quotations)

“Arise, awake, and stop not till the goal is reached.”
“లేచి నిలబడు, మేలుకో, లక్ష్యం చేరేవరకు ఆగి పోవద్దు.”

 

“Take risks in your life. If you win, you can lead. If you lose, you can guide.”
“నీ జీవితంలో ఆపదలను ఎదుర్కోవడానికి సిద్ధం గా ఉండు . గెలిస్తే నీవు నాయకుడివి అవుతావు , ఓడిపోతే మార్గదర్శకుడివి అవుతావు.”

 

“The greatest sin is to think yourself weak.”
“నీపై నీకు నమ్మకం లేకపోవడమే అతి పెద్ద పాపం.”

 

“You have to grow from the inside out. No one can teach you, none can make you spiritual.”
“నీకు నువ్వే  అంతర్గతంగా ఎదగాలి. ఎవరూ నీకు బోధించలేరు, ఎవరూ నిన్ను ఆధ్యాత్మికునిగా   చేయలేరు

 

“All power is within you; you can do anything and everything.”
“అన్ని శక్తులు నీలోనే  ఉన్నాయి. నీవు ఏదైనా చేయగలవు, నీవు ప్రతీదీ చేయగలవు .”

 

“Strength is life, weakness is death.”
“జీవితం అంటేనే బలం, బలహీనత అంటే మరణమే.”

 

“Take up one idea. Make that one idea your life.”
“ఏదైనా ఒక ఆలోచనను చేపట్టు . ఆ ఆలోచనే నీ జీవితం అయ్యేటట్లు కృషి చేయి.”

 

“Talk to yourself once a day, otherwise, you may miss meeting an intelligent person in this world.”
“రోజుకు ఒక్కసారైనా నీతో నీవు మాట్లాడుకో, లేకపోతే ఈ లోకంలో ఒక తెలివైన వ్యక్తిని  కలిసే అవకాశం తరచూ కోల్పోతావు.”

 

“In a day, when you don’t come across any problems, you can be sure that you are traveling on the wrong path.”
“ఏదైనా ఒకరోజు నీకు ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదంటే, నిజంగా నువ్వు తప్పు దారిలో నడుస్తున్నావేమో ఆలోచించు.”

 

“Dare to be free, dare to go as far as your thought leads, and dare to carry that out in your life.”
“స్వేచ్ఛగా ఉండేందుకు ధైర్యం చెయ్యి, నీ ఆలోచనలు నిన్ను ఎంతదూరం తీసుకెళ్తాయో తెలుసుకో, వాటిని జీవితంలో అమలు చేయడానికి ప్రయత్నించు.”

 

“Youth is the best time. The way in which you utilize this period will decide the nature of coming years that lie ahead of you.”
“యవ్వన కాలమే అత్యుత్తమ సమయం. యువకునిగా ఉన్నపుడు  నీ సమయాన్ని ఎలా ఉపయోగించు కున్నావో అదే  నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.” (Swami Vivekananda Famous Quotations)

 

“Be a hero. Always say, ‘I have no fear.'”
” హీరో లా ఉండటానికి ప్రయత్నించు… ఎప్పుడూ ‘నాకు భయం లేదు’ అని చెప్పు.”

 

“Do one thing at a time, and while doing it, put your whole soul into it.”
“ఒకసారి ఒకే పని చేయి, అయితే ఆ పని చేసేటప్పుడు మాత్రం మనస్పూర్తిగా చేయి”

 

“The fire that warms us can also consume us; it is not the fault of the fire.”
“అవసరమైనప్పుడు మనకు వేడినిచ్చే అగ్ని మనల్ని కాల్చివేయగలదు కూడా. అది అగ్ని యొక్క తప్పు కాదు .”

 

“Success is achieved by only those who try.” (Swami Vivekananda Famous Quotations)
” ప్రయత్నించిన వాళ్ళకే విజయం స్వంతం అవుతుంది”

 

“Learn everything that is good from others, but bring it in, and in your own way absorb it; do not become others.”
“ఇతరుల నుంచి మంచి విషయాలు నేర్చుకో, వాటిని నీ స్వంత పద్ధతిలో ఆచరించు. కానీ, నువ్వు వారిలా మాత్రం మారిపోవద్దు.”

 

“In a conflict between the heart and the brain, follow your heart.”
“నీ మనసుకు మరియు మెదడుకు మధ్య వాదన వస్తే, నీ మనసు చెప్పిందే విను”

 

“We are what our thoughts have made us; so take care about what you think.”
“మన ఆలోచనలలే మనల్ని రూపొందించాయి. కాబట్టి నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకో.”

 

“The history of the world is the history of a few men who had faith in themselves.”
“తమపై తమకు నమ్మకం ఉన్న కొందరు వ్యక్తుల చరిత్రనే ప్రపంచ చరిత్ర గా పరిగణిస్తున్నాము”

 

“Fill your mind with high thoughts, highest ideals; place them day and night before you.”
“నీ మనసును ఉన్నత ఆలోచనలతో, అత్యుత్తమ ఆదర్శాలతో  నింపుకో. వాటిని పగలూ రాత్రి తప్పక ఆచరించు.”

 

“Meditation can turn fools into sages, but unfortunately, fools never meditate.”
“ధ్యానం మూర్ఖులను ఋషులుగా మార్చగలదు. కానీ దురదృష్టవశాత్తూ, మూర్ఖులు ఎప్పుడూ ధ్యానం చేయరు.”

 

“Condemn none: If you can stretch out a helping hand, do so.”
“ఎవరినీ ఖండించకు. సహాయ హస్తాన్ని అందించగలిగితే మాత్రం ఆ పని చెయ్యి”

 

“The world is the great gymnasium where we come to make ourselves strong.”
“ఈ ప్రపంచం మనల్ని శక్తివంతంగా మార్చగలిగే ఒక గొప్ప వ్యాయామశాల.”

 

“Do not lower your goals to the level of your abilities. Instead, raise your abilities to the height of your goals.”
“నీ లక్ష్యాలను నీ సామర్థ్యాలకు తగినట్టు గా తగ్గించుకోవద్దు. దానికి బదులుగా, నీ సామర్థ్యాలను నీ లక్ష్యాల స్థాయికి పెంచుకోవడానికి ప్రయత్నించు.”

 

“Stand up, be bold, and take the whole responsibility on your shoulders.”
“నిలబడండి, ధైర్యంగా ఉండండి, పూర్తి బాధ్యత మీరే తీసుకోండి.” (Swami Vivekananda Famous Quotations)

 

ఇవి కూడా చదవండి :

ఆత్మహత్య ఆలోచనలు నిరోధించే కొటేషన్స్ 

టైం మ్యానేజ్ మెంట్ గురించి కొటేషన్స్ 

నెగెటివ్ ఆలోచనలు రాకుండా నిరోధించే కొటేషన్స్