T20 World Cup 2026 Ind v WI Sanju Samson| సంజూ సామ్సన్ వీర విహారం|ప్రపంచ కప్ సెమీ ఫైనల్ లో భారత్
ప్రపంచ కప్ లో అత్యంత కీలకమైన మ్యాచ్ లో భారత్ ను దగ్గరుండి గెలిపించాడు సంజూ సామ్సన్. ఈ రోజు జరిగిన మ్యాచ్ ని అందులోనూ సంజూ ఇన్నింగ్స్ నీ ఎప్పటికీ మర్చిపోలేరు భారత క్రికెట్ అభిమానులు.

Ind v WI Sanju Samson
T20 World Cup 2026 Ind vs WI Sanju Samson|సంజూ సామ్సన్ వీర విహారం|ప్రపంచ కప్ సెమీ ఫైనల్ లో భారత్
కోల్కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో అద్భుతం జరిగింది. టీ 20 ప్రపంచ కప్ లో ఇప్పటివరకూ అజేయం గా గెలుపు సాధిస్తున్న వెస్టిండీస్ జట్టు ఇండియా చేతిలో ఓడిపోయింది. బాట్స్ మన్ వరుస వైఫల్యం, బౌలింగ్ లో పదును లేకపోవడం వంటి సమస్యలతో బరిలోనికి దిగింది బారత క్రికెట్ జట్టు. అప్పటికే మెరుగైన రన్ రేట్ తో ఉన్న వెస్టిండీస్ జట్టు హాట్ ఫేవరేట్ గా బరిలోనికి దిగింది. ఒకవేళ వాతావరణం ఏమైనా ఇబ్బంది కలిగించి మ్యాచ్ కు అంతరాయం ఏర్పడితే వెస్టిండీసే విజేత. ఇన్ని ప్రతికూలతల మధ్య మ్యాచ్ జరిగింది. వర్షం పడకూడదని సగటు క్రికెట్ అభిమాని మొక్కని దేవుడు లేడు. Ind v WI Sanju Samson
సీన్ మార్చివేసిన టాస్ గెలుపు :
ఈ మ్యాచ్ లో భారత్ టాస్ గెలిచిన దగ్గర నుండి సీన్ అంతా మారిపోయింది. భారత్ వ్యూహాత్మకం గా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఈ నిర్ణయమే మ్యాచ్ మొత్తాన్నీ మలుపు తిప్పింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 195 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది. ప్రపంచ కప్ లో భారత్ అంత లక్ష్యాన్ని ఇంతవరకూ చేధించ లేదు.
భారత క్రికెట్ అభిమానుల ఆశలన్నీ అభిషేక్ శర్మ పైనే. కొంచం కుదురుకుంటే చాలు శివాలెత్తి పోతాడు అని అందరి నమ్మకం. అందరి నమ్మకాన్ని వమ్ము చేస్తూ అతి తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. భారత శిబిరం లో నిశ్శబ్దం ఇప్పుడు ఎవరు ఇంకా. ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, పాండ్యా ఎవరు ఈ రోజు గెలిపించేది అనుకొంటున్నారు.
అతనిపై ఎవరికీ ఆశలు లేవు Ind v WI Sanju Samson
కనీసం లేశ మాత్రమైనా ఒక బాట్స్ మన్ గురించి ఎవరూ అనుకోలేదు. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఇతడే ఆడబోతున్నాడని ఆ క్షణం లో ఎవరికీ తోచలేదు. మిడిల్ ఆర్డర్ లో ఎవరో ఒకరు కాపాడతారు అనుకున్నారు. అంతే గాని మరొక ఎండ్ లో జూలు విదిల్చిన సింహం లా నిలబడి ఉన్న సంజూ సామ్సన్ గురించి ఎవరూ ఆలోచించలేదు. ఒక పదో పదిహేనో కొట్టి అవుట్ అయిపోతాడని అనుకున్నారేమో ఎవరూ కనీసం ఊహించనూ లేదు.
డగౌట్ లో కూర్చొని తమ సీనియర్ ఆటగాళ్ళు క్లిష్ట పరిస్థితుల్లో ఏ విధం గా జట్టు కు విజయాలు అందించారో దగ్గరుండి చూసాడు. ఒకటి కాదు, రెండు కాదు దాదాపు వందకు పైగా మ్యాచ్ లు డగౌట్ లో ఉండి చూశాడు. తను జట్టులో ఉండేవాడు కానీ ప్లేయింగ్ లెవెన్ లో చోటు దక్కేది కాదు. Ind v WI Sanju Samson
అనేక మైన కారణాలతో సంజూకి పైనల్ ఎలెవన్ లో స్థానం దక్కేది కాదు. తనకంటే జూనియర్ ప్లేయర్లు కూడా ముందుకు వెళ్ళిపోతున్నా చెక్కు చెదరని ఆత్మ విశ్వాసం తో అవకాశాల కోసం ఎదురు చూసాడు. గతం లో దక్షిణాఫ్రికా సీరీస్ లో వరుసగా రెండు టీ 20 లలో రెండు సెంచరీలు చేసిన అరుదైన రికార్డు తన పేరుమీదే ఉంది.
ఎవరో స్పెషలిస్టు ఆటగాడు జట్టులోకి రావాలంటే ముందుగా బలయ్యేది సంజూనే. తను మంచి ఫాం లో ఉన్నపుడు జట్టులో ఆడే అవకాశాలు వచ్చేవి కావు. ఎప్పుడో ఒకటో రెండో మ్యాచ్ లలో ఆడిస్తే లయతప్పి తక్కువ స్కోరుకే అవుట్ కావడం తో అవకాశాలు ఇచ్చే వారు కాదు.
న్యూజిలాండ్ సీరీస్ లో వైఫల్యం Ind v WI Sanju Samson
ఈ ప్రపంచ కప్ ముందు జరిగిన టీ 20 సీరీస్ లో కూడా సరిగా రాణించలేక పోయాడు సంజూ. దాంతో ఇక భారత జట్టులో అతను స్థానం కోల్పోయినట్టే అని అందరూ అనుకున్నారు. అందుకే ఫాం లో లేడని ఈ ప్రపంచ కప్ లో మొదటి నాలుగు మ్యాచ్ లలో ఆడించలేదు. ఇంతకు ముందు జరిగిన టీ 20 జట్టులో సభ్యుడైనప్పటికీ, కనీసం ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచ కప్ లో అలాగే బెంచ్ కు పరిమితం అవుతాడని అనుకొన్నారు. న్యూజిలాండ్ తో జరిగిన సీరీస్ లో కూడా సరిగ్గా రాణించలేక పోవడం తో సంజూ కెరీర్ ముగిసి నట్లే అని అందరూ అనుకున్నారు.
జూలు విదిల్చిన సింహం లా సంజూ
ఈ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో తనకు లభించిన అవకాశాన్ని అద్భుతం గా అందిపుచ్చు కున్నాడు సంజూ. న భూతో న భవిష్యత్ అన్న తీరులో అద్భుతమైన బ్యాటింగ్ చేసాడు. ఎక్కడా తడబాటు లేదు. ఎక్కడా అనవసరమైన షాట్ లేదు. ప్రత్యర్ధి బౌలర్లకు ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. ఉద్రేకం గా బ్యాటింగ్ చెయ్యలేదు. ఒక్కొక్క బంతినీ ఎలా ఆడాలో అలా ఆడాడు.
మరొక ప్రక్క మిగిలిన బ్యాట్స్ మన్ అవుట్ అవుతున్నా సరే చలించలేదు. అందరూ ఒక పిచ్ మీదా తాను మాత్రం మరొక పిచ్ మీదా బ్యాటింగ్ చేస్తున్నట్లు ఆడాడు. అద్భుతమైన షాట్లు ఆడాడు. కళ్ళు చెదిరే ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం మూడు పరుగుల తేడా తో సెంచరీ మిస్ అయినప్పటికీ జట్టును గెలిపించాడు.Ind v WI Sanju Samson
భారత జట్టు ప్రతి క్రికెట్ అభిమానీ కొన్ని సంవత్సరాల పాటు గుర్తు పెట్టుకొనే ఇన్నింగ్స్ ఆడాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. ఇంత కాలం తాను అనుభవించిన వేదనను గూర్చి నర్మగర్భం గా చెప్పకనే చెప్పాడు. దాదాపు వంద మ్యాచ్ లలో డగౌట్ లోనే ఉన్నానని చెప్పాడు. ఏది ఏమైనా ప్రపంచ కప్ లో అత్యంత కీలకమైన మ్యాచ్ లో భారత్ ను దగ్గరుండి గెలిపించాడు సంజూ సామ్సన్. ఈ రోజు జరిగిన మ్యాచ్ ని అందులోనూ సంజూ ఇన్నింగ్స్ నీ ఎప్పటికీ మర్చిపోలేరు అభిమానులు.
2016 పరాజయానికి ప్రతీకారం తీర్చుకున్న భారత్ Ind v WI Sanju Samson
భారత్ లో 2016 లో జరిగిన టీ 20 ప్రపంచ కప్ లో సెమీఫైనల్ లో భారత్ పరాజయం పాలైంది. అది కూడా వెస్టిండీస్ జట్టు చేతిలో. సరిగ్గా పదేళ్ళ తర్వాత క్వార్టర్ ఫైనల్ లోనే వెస్టిండీస్ ను ఓడించి ప్రతీకారం తీర్చుకుంది భారత్. 2016 మార్చి 31 వ తేదీన ముంబై లోని వాంఖడే లో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్ ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. 192 పరుగుల స్కోరు చేసినప్పటికీ వెస్టిండీస్ బ్యాట్స్ మన్ ని కట్టడి చేయలేక పోయింది భారత జట్టు.
ఫలితం గా సెమీ ఫైనల్ లో పరాజయం పాలైంది. పదేళ్ళ తర్వాత ఒక స్వీట్ రివెంజ్ తీర్చుకొంది భారత జట్టు. అప్పుడు లెండిల్ సిమ్మన్స్ 82 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి వెస్టిండీస్ ని గెలిపిస్తే ఇప్పుడు సంజూ 97 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి జట్టుని గెలిపించాడు.