January 10, 2025

TATA IPL 2024 Match 08 MI VS SRH| పైసా వసూల్ మ్యాచ్ |అనేక రికార్డులు బద్దలు|Match Review

TATA IPL 2024 Match 08 MI VS SRH |Match Review| పైసా వసూల్ మ్యాచ్ |అనేక రికార్డులు బద్దలు|

మార్చి 27, 2024 ఐపీఎల్ చరిత్ర లో ఎప్పటికీ గుర్తు ఉండిపోయే రోజు. సన్ రైజర్స్ (SRH) జట్టు కి, ముంబై (MI) జట్టు కి చిరకాలం గుర్తు ఉండిపోయే మ్యాచ్ ఈ రోజే జరిగింది. ఉప్పల్ స్టేడియం పరుగుల వరద పారింది. టీ20 పోటీల చరిత్ర లోనే ఇటువంటి మ్యాచ్ ఇప్పటివరకూ జరగలేదు అంటే అతిశయోక్తి కాదు. రెండు జట్లూ హోరాహోరీ పోటీ పడ్డాయి. ఐపీఎల్ పోటీల చరిత్ర లోనే అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టు గా సన్ రైజర్స్ హైదరాబాద్ నిలచింది. అలాగే రెండవ అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టు గా ముంబై ఇండియన్స్ నిలచింది. ఒక మ్యాచ్ లో అత్యధిక సిక్సర్లు నమోదు అయిన మ్యాచ్ గా కూడా ఇది చరిత్ర పుటలకు ఎక్కింది. టీ20 చరిత్ర లోనే ఇటువంటి మ్యాచ్ ఒకటి జరుగుతుంది అని ఎవరూ ఎప్పుడూ  ఊహించలేదు. ఇటువంటి  అద్బుతమైన మ్యాచ్ చూసే అదృష్టం ఈ ఐపీఎల్ లో క్రికెట్ అభిమానులకు దక్కింది.

పాయింట్స్ టేబుల్ –

S.NoTeamMWLNRRPts
1CSK2201.9794
2RR1101.0002
3SRH2110.6752
4KKR1100.2002
5PBKS2110.0252
6RCB211-0.1802
7GT211-1.4252
8DC101-0.4550
9MI202-0.9250
10LSG101-1.0000