January 10, 2025

TATA IPL 2024 Winner KKR |ఫైనల్ లో చేతులెత్తేసిన సన్ రైజర్స్ |మూడవ సారి ట్రోఫీ గెలిచిన KKR

TATA IPL 2024 Winner KKR |ఫైనల్ లో చేతులెత్తేసిన సన్ రైజర్స్ |మూడవ సారి ట్రోఫీ గెలిచిన KKR

టాటా ఐపీఎల్ 2024 ఫైనల్ లో KKR విజయ కేతనం ఎగురవేసింది. టోర్నమెంట్ మొత్తం సంచలనం రేపిన సన్ రైజర్స్ జట్టు రన్నరప్ గా నిలచింది. ఈ సారి ఈ ఫైనల్ పోటీ పూర్తి ఏకపక్షం గా జరిగింది. చూస్తున్న ప్రేక్షకులకు ఎటువంటి ఆసక్తి కలిగించని ఫైనల్ ఇది. బ్యాటింగ్ లో సంచలనాలు సృష్టించిన సన్ రైజర్స్ జట్టు కేవలం 113 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. ఎవరూ ఊహించని స్కోరు ఇది. కొన్ని మ్యాచ్ లలో సన్ రైజర్స్ తొలి 6 ఓవర్ల లో సాధించిన స్కోరు ఇది. KKR ఎటువంటి పొరపాటు చేయకుండా 10 ఓవర్ల లోనే లక్ష్యాన్ని సాధించి కప్ ను ఎగరేసుకు పోయింది. KKR ట్రోఫీ గెలవడం ఇది మూడవ సారి. దశాబ్ద కాలం తర్వాత మళ్ళీ ఐపీఎల్ ట్రోఫీ గెలవడం తో KKR శిబిరం సంబరాల్లో మునిగిపోయింది.(TATA IPL 2024 Winner KKR)

బ్యాటింగ్ లో సంచలనాలకు మారుపేరుగా నిలచిన SRH ఫైనల్ లో చాలా పేలవమైన ప్రదర్శన చేసింది.