January 10, 2025

Telugu Love Poetry – Don’t Talk to me| నాతో మాట్లాడొద్దు… ప్లీజ్ ..

నేనేం అనుకోనులే … వెళ్ళు… మర్యాద పూర్వకం గా నైనా సరే…. నాతో మాట్లాడొద్దు… ప్లీజ్

Telugu Love Poetry - Dont Talk to me

Telugu Love Poetry - Dont Talk to me -

Telugu Love Poetry – Don’t Talk to me| నాతో మాట్లాడొద్దు… ప్లీజ్ .. 

 

మర్యాదపూర్వకం గా నైనా సరే 

నాతో మాట్లాడొద్దు … ప్లీజ్ (Telugu Love Poetry – Don’t Talk to me)

 

నీ చిన్నిపాటి సవ్వడికే 

గుండెలోని అణువులన్నింటికీ 

నే ఎప్పుడో వేసిన తాళం కప్పలన్నీ 

భళ్ళున తెరచుకొంటాయి 

 

వద్దు వద్దని నా గుండె 

ఎంత చెప్తున్నా వినకుండా 

నా కళ్ళలో నేను కట్టుకొన్న రిజర్వాయిర్ 

నిలువునా బద్దలై పోతుంది 

 

అందుకే…

నేనెవరో తెలీనట్టు 

నీ దారిన నువ్వు పో ..

 

లేకపోతే ..

నా శరీరమంతటినీ 

బిగించి… బిగించి 

నేను కట్టుకున్న ముళ్ళ తీగ 

నువ్వు కావాలన్న కోర్కె తో 

నిలువునా నా ప్రాణాలు తీసేస్తుంది 

 

నేనేం అనుకోనులే … వెళ్ళు… 

మర్యాద పూర్వకం గా నైనా సరే….

నాతో మాట్లాడొద్దు… ప్లీజ్ 

(16-03-2009)