January 10, 2025

Telugu quotes on how to avoid suicidal thoughts – ఆత్మహత్య ఆలోచనలు నిరోధించే కొటేషన్స్

ఈ రోజు చనిపోతే రేపటికి రెండు.. ఒకటి రెండేళ్ళు గడిచిపోతే నిన్ను అందరూ మర్చిపోతారు. చచ్చి ఏం సాధించినట్టు… ఏదైనా బ్రతికి చూపించాలి. అపుడు  నిన్ను గేలి చేసిన వాళ్ళే నీపై ప్రశంశలు కురిపిస్తారు…

Telugu quotes on suicidal thoughts

Telugu quotes on suicidal thoughts

Telugu quotes on how to avoid suicidal thoughts – ఆత్మహత్య ఆలోచనలు నిరోధించే కొటేషన్స్

డియర్ ఫ్రెండ్.. చనిపోవాలని అనిపిస్తోందా… జీవితం మీద విరక్తి కలుగుతోందా.. కొద్ది నిమిషాలు ఈ ఆర్టికల్ చదువు….. బలవంతం గా ప్రాణం తీసుకొనే హక్కు నీకు లేదు… క్షణికావేశం తో నువ్వు తీసుకొనే నిర్ణయం వలన నీకు ఎటువంటి ప్రయోజనం ఉండదు… బ్రతకాలి..(Telugu Quotes on Suicidal thoughts)

ఈ విశాల విశ్వం లో మనిషిగా పుట్టడం ఒక గొప్ప అదృష్టం. మనిషిగా జీవించే అవకాశం రావడం ఒక గొప్ప అవకాశం. ఈ క్రమం లో మనం చేసే అనేక ప్రయత్నాలలో కొన్ని సార్లు ఓడిపోతాం.. అపుడు  గెలిచి చూపించాలి. కొన్ని సార్లు పడిపోతాం..అపుడు లేచి చూపించాలి

చావు ఒక్కటే శరణ్యం అనిపిస్తుంది అనేకసార్లు. మనకు ఎదురైన సమస్యలు అన్నిటికీ చావు ఒక్కటే పరిష్కారం కాదు. ఈ రోజు చనిపోతే రేపటికి రెండు.. ఒకటి రెండేళ్ళు గడిచిపోతే నిన్ను అందరూ మర్చిపోతారు. చచ్చి ఏం సాధించినట్టు… ఏదైనా బ్రతికి చూపించాలి. అపుడు  నిన్ను గేలి చేసిన వాళ్ళే నీపై ప్రశంశలు కురిపిస్తారు…

నిజానికి నీకూ చనిపోవాలని ఉండదు.. నీ చుట్టూ ఉండే పరిస్థితులు నీకు ఆ పరిస్థితి కల్పిస్తాయి… అప్పుడే నీకు సంయమనం అవసరం. నీ కుటుంబం రోడ్డున పడుతుంది. అల్లారుముద్దు గా పెంచుకున్న నీ పిల్లలు రోడ్ల పై అడుక్కొనే పరిస్థితి రావచ్చు… నీ భార్య , నిన్ను నమ్ముకున్న నీ ముసలి తల్లిదండ్రులు బిచ్చమెత్తు కొంటుంటే నీ ఆత్మ శాంతిగా ఉంటుందా…

ప్రాణానికి ప్రాణం గా ప్రేమించిన లవర్ మోసం చేస్తే… చావడమేనా.. నీ పై ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్న నీ తల్లిదండ్రులకు ఎంత శోకాన్ని మిగుల్చుతావు.. అలా చనిపోతే  నీ ఆత్మ శాంతి గా ఉంటుందా.. తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు బ్రో.. ఆలోచించు..

పరీక్షలో ఫెయిల్ అయ్యామని, బిజినెస్ లో లాస్ వచ్చిందని, బెట్టింగ్ లో సర్వం కోల్పోయామని, అప్పులపాలు అయిపోయామని, జీవితం లో అన్ని రంగాలలో ఓడిపోయామని.. ఇలా రకరకాల కారణాలతో జీవితాన్ని అంతం చేసుకోవాలని అనుకుంటే.. ఈ వీడియో చూడు… కొన్ని మంచి మాటలు విను.. నీ నిర్ణయం మార్చుకో..

నువ్వొక హీరోవి… అవును నిజం. నువ్వు జీవితం లో ఓడిపోవచ్చు గాని నీలోని హీరో అలాగే ఉన్నాడు.. ఒక్కక్షణం నీ శక్తిని గుర్తించు.. తాత్కాలికమైన ఆవేశానికి గురి కావద్దు.. మళ్ళీ చెప్తున్నాను.. నువ్వొక హీరో వి.. విశేషమైన శక్తి సామర్ధ్యాలు నీలో ఇప్పటికీ  ఉన్నాయి.. బ్రతికి చూపించు… ప్రపంచమే నీకు సలాం కొడుతుంది .   మీలో  ఆత్మ స్థయిర్యాన్ని   కలిగించే కొన్ని మంచి మాటలు వినండి…  

 

“ఒక్క ఓటమి నీ జీవితానికి అంతం కాదు, అది సరికొత్త విజయానికి పునాది .”

(One missed success is not the end of your life; it is the beginning of a new victory.)

“ఓటమి ఒక విరామం మాత్రమే, నిజమైన ప్రయాణం నీ ఆశయంపై నువ్వు నిలబడినప్పుడు మొదలవుతుంది.”

(Failures are only pauses, the real journey begins when you stand firm on your goal.)

“సవాళ్లు మనల్ని వెనక్కి లాగవు, అవే మన విజయానికి మెట్లను కడతాయి.”

(Challenges don’t pull us back, they lay the steps toward our success.)

“నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది, కష్టాలను అధిగమించు, అద్భుతాలను చూస్తావు .”

(Your life is in your hands; overcome difficulties and prepare for miracles.)

“అప్పుడప్పుడు బాధ గా ఉంటుంది, కాని అదే నీలో ఉన్న నిజమైన శక్తిని నీకు తెలియజేస్తుంది ”

(The pain you sometimes feel is only to help you discover the true strength within you.)

“ఇక ఏమీ లేదు నాకు అని బాధ పడకు, జీవితం ఎప్పుడూ నీకోసం ఒక కొత్త మార్గాన్ని తెరుస్తూనే ఉంటుంది.”

(Life always opens a new path where you thought none existed.)

“ఒక్క ఘడియలో జీవితాన్ని ముగించాలనుకోవడం కాదు, ఆ ఒక్క ఘడియలో కొత్త జీవితం మొదలు పెట్టు.”

(Don’t think of ending your life in a moment, start a new life in that very moment.)

“ప్రతీ కష్టంలోనూ ఒక అవకాశం ఉంటుంది, దాన్నిఒడిసి పట్టుకుని నీ విజయాన్ని సాధించు .”

(Every difficulty has an opportunity; grab it and build your success.)

“ఓటమి నీ కష్టానికి వచ్చే ఫలితమేమీ కాదు, అదే నీ విజయానికి పునాది.”

(Failure is not the result of your effort, it is the foundation for your success.)

“నువ్వు అనుకున్నదంతా జరుగుతుంది , నీ జీవితంలో మంచిరోజులు ముందు ఉన్నాయి .”

(Everything you aspire to hasn’t forgotten you; your time in life is yet to come.)

“జీవితాన్ని ప్రేమించు, ఎందుకంటే జీవితం లో ఎన్నో విజయాలు సాధించే శక్తి నీలో ఉంది .”

(Love life, because many victories are still within you.)

“ముందుకు వేసే ప్రతి అడుగు, నీ బాధను వెనక్కి నెట్టి నిన్ను విజయానికి దగ్గర చేస్తుంది.”

(Every step you take forward pushes the pain back and brings you closer to success.)

“నువ్వు కష్టాల్ని ఎదుర్కొనడానికి సిధ్ధంగా ఉన్నప్పుడు, జీవితం నీకోసం కొత్త మార్గాలను తెరుస్తుంది.”

(When you’re ready to face your challenges, life will open new doors for you.)

“జీవితం ఇక శూన్యం అనిపించే ఘడియలే నీ జీవితానికి ఒక కొత్త ప్రారంభాన్ని ఇస్తాయి..”

(The moments that feel like the end are the ones that lead to a new beginning.)

“జీవితానికి విలువ ఇవ్వడం అంటే, నీలోని కష్టాలను అంగీకరించి, విజయాన్ని నమ్మడమే.”

(Valuing life means accepting your struggles and believing in success.)

“ప్రతీ వెనుకడుగు నీ విజయానికి ఒక పునాదిగా మారి గెలుపును మరింత చేరువ చేస్తుంది.”

(Every step backward becomes the foundation that accelerates your success.)

“నిన్ను నువ్వు గెలవడంలోనే జీవిత పరమార్ధం దాగి ఉంది.”

(The meaning of life lies in overcoming yourself.)

“సవాళ్లు నిన్ను ఆపలేవు, అవి నీలోని సత్తా అంతటినీ బయటపెడతాయి.”

(Challenges cannot deter you; they bring out the full strength in you.)

“నిరాశలో నువ్వు కూరుకు పోయినా , జీవితం నీకొక సరికొత్త ఆశను తప్పకుండా ఇస్తుంది”

(If despair feels unrelenting, life will inevitably offer you new hope.)

జీవితం నీకిచ్చిన కష్టాలు నీకు విజయానికి అత్యంత ముఖ్యమైన పాఠాలు నేర్పిస్తాయి.”
(The hardships life has given you will teach you the most important lessons for success.)

జీవితం లో విఫలమై ఆత్మహత్యే శరణ్యం అనుకొనే మీకు తెలిసిన వారికి, మిత్రులకు తప్పకుండా షేర్ చెయ్యండి. క్షణికావేశం లో తీసుకొనే నిర్ణయం మిగిలిన కుటుంబ సభ్యులను విషాదం లో ముంచెత్తు తుంది. నిరాశ, నిస్పృహ ల మధ్య ఉన్న మీ మిత్రులకు, మీకు తెలిసిన వారికి తప్పకుండా షేర్ చెయ్యండి. వారి ప్రాణాలను కాపాడండి.

జీవితం పై ఆశ కలిగించే కొటేషన్స్, ఆత్మహత్య నిరోధించే కొటేషన్స్, ఆత్మహత్య ఆలోచనలు ఆపడం ఎలా? ఆత్యహత్య చేసుకోవాలనిపిస్తే నిరోధించడం ఎలా? ఆత్మహత్య ఆలోచనలు ఆపుకోవడం ఎలా?