IND vs ENG Test 2nd Day Highlights – జైస్వాల్ బుమ్రా దుమ్ము దులిపారు

Ind vs Eng 2 nd Test pic credits : X
బ్యాటింగ్ లో జైస్వాల్ – బౌలింగ్ లో బుమ్రా దుమ్ము దులిపారు (Ind vs Eng 2nd Test)
వైజాగ్ లో ఇండియా – ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండవ టెస్టు రెండవ రోజు ఆట లో భారత ఆటగాళ్ళదే పైచేయి గా నిలచింది. యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించగా, బౌలింగ్ లో తన రివర్స్ స్వింగర్స్ తో ప్రత్యర్ధి బాట్స్ మన్ ను కట్టడి చేసి 6 వికెట్లు తీసి ఇంగ్లాండ్ ఆల్ అవుట్ కావడం లో కీలక పాత్ర పోషించాడు.(Ind vs Eng 2nd Test)
ఫోర్ కొట్టి మరీ డబుల్ సెంచరీ చేసిన జైస్వాల్
336 /6 స్కోరు తో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 364 పరుగుల వద్ద అశ్విన్ వికెట్ ను కోల్పోయింది. కులదీప్ యాదవ్ బ్యాటింగ్ కి వచ్చి జైస్వాల్ కి అండగా నిలిచాడు. డబుల్ సెంచరీ చేసిన జైస్వాల్ 209 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అండర్సన్ బౌలింగ్ లో బెయిర్ స్టో కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అద్భుతమైన ఆట ప్రదర్శన తో సంచలనాలు సృష్టించాడు జైస్వాల్ అని చెప్పవచ్చు. 200 మార్కు ను కూడా బౌండరీ కొట్టి చేరుకున్నాడంటే జైస్వాల్ ఎంత ఆత్మవిశ్వాసం తో ఆడుతున్నాడో మనం అర్ధం చేసుకోవచ్చు.

pic credits: X
కాంబ్లీ, గవాస్కర్ తర్వాత స్థానం లో జైస్వాల్
అతి తక్కువ వయసు లో టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన మూడవ భారతీయుని గా చరిత్ర పుటలకు ఎక్కాడు. అతి తక్కువ వయసు లో టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన వారిలో మొదట వినోద్ కాంబ్లీ ఉండగా రెండవ స్థానం లో సునీల్ గవాస్కర్ ఉన్నారు. మూడవ స్థానం లో ఇప్పుడు జైస్వాల్ చేరాడు. మొదటి ఇన్నింగ్స్ లో కనీసం ఒక బ్యాట్స్ మన్ కూడా హాఫ్ సెంచరీ కూడా చేయని మ్యాచ్ లో ఏకం గా 209 పరుగులు చెయ్యడం నిజంగా అభినందించవలసిన విషయం.
బుమ్రా 6 పరుగులకు, ముఖేష్ కుమార్ డకౌట్ గాను వెనుతిరిగారు. కుల్దీప్ 8 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. భారత్ మొదటి ఇన్నింగ్స్ లో 396 పరుగులకు ఆలౌట్ అయ్యింది. జేమ్స్ అండర్సన్, బషీర్, రెహాన్ అహ్మద్ మూడేసి వికెట్లు తీసుకోగా హార్ట్లీ మాత్రం ఒక వికెట్ తీసుకొన్నాడు జో రూట్ కి వికెట్లు లభించలేదు. ఇంగ్లాండ్ మొత్తం 112 ఓవర్లు బౌల్ చేసింది.
కళ్ళు చెదిరే ఇన్నింగ్స్ ఆడిన క్రాలే …
బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు ప్రారంభం లో నిలకడ గానే ఆడింది. అయితే జట్టు స్కోరు 59 పరుగుల వద్ద డుకెట్ రూపం లో మొదటి వికెట్ ను కోల్పోయింది. కుల్దీప్ బౌలింగ్ లో పాటి దార్ క్యాచ్ తీసుకున్నాడు. మరొక ప్రక్క చాలా నిలకడ గా ఆడుతున్న క్రాలీ 76 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్ లో అయ్యర్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. క్రాలే ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. అప్పటికి ఇంగ్లాండ్ జట్టు స్కోరు 114 /2 . సున్నా పరుగుల వద్ద స్టంపింగ్ ప్రమాదాన్ని తప్పించుకున్న పోప్ క్రీజు లో ఉన్నాడు.
రూట్ – పోప్ – బెయిర్ స్టో తక్కువ స్కోరు కే అవుట్…(Ind vs Eng 2nd Test)
అయితే మరొక ఎండ్ లో ఉన్న జో రూట్ కేవలం 5 పరుగులు మాత్రం చేసి బుమ్రా బౌలింగ్ లో గిల్ కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికి జట్టు స్కోరు 123/3 . ఇంగ్లాండ్ బ్యాట్స్ మన్ పెద్దగా ప్రభావం చూపలేక పోయారు. పోప్ కూడా 23 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. జట్టు స్కోరు 136/4 . ఆ తర్వాత 25 పరుగులు చేసిన బెయిర్ స్టో బుమ్రా బౌలింగ్ లోనే గిల్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఒక వైపు బెన్ స్టోక్స్ బ్యాట్ నుండి పరుగులు బాగానే వచ్చాయి. జట్టు స్కోరు 172 పరుగుల వద్ద ఫోక్స్ రూపం లో 6 వ వికెట్ ను కోల్పోయింది ఇంగ్లాండ్.
“ఏమన్నా బాల్ వేసావు బుమ్రా …”
రెహాన్ అహ్మద్ 6 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. బెన్ స్టోక్స్ 5 ఫోర్లు, ఒక సిక్సర్ తో 47 పరుగులు చేసి బుమ్రా వేసిన ఒక అద్భుతమైన బాల్ కి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. “ఏమన్నా బాల్ వేశావ్ బుమ్రా ..” అన్నట్టు స్టోక్స్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్ బుమ్రా లో మరింత ఆనందాన్ని నింపింది. ఆ తర్వాత హార్ట్లీ 21 పరుగులకు, అండర్సన్ 6 పరుగులకు బుమ్రా బౌలింగ్ లోనే అవుట్ కావడం తో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. బషీర్ 8 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు.
ఇంగ్లాండ్ జట్టు 55.5 ఓవర్ల లో 253 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీనితో మొదటి ఇన్నింగ్స్ లో భారత్ జట్టుకు 143 పరుగుల ఆధిక్యత లభించింది.Ind vs Eng 2nd Test

బుమ్రా బౌలింగ్ ‘న భూతో న భవిష్యత్’
భారత్ బౌలింగ్ లో బుమ్రా 45 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. అతి తక్కువ టెస్టు లలో 150 వికెట్ల మైలురాయి ని అందుకున్నాడు బుమ్రా. ఈ రోజు బుమ్రా బౌలింగ్ ‘న భూతో న భవిష్యత్ ‘ అన్నట్టు కొనసాగింది. రివర్స్ స్వింగర్లతో ఇంగ్లాండ్ జట్టు పై విరుచుకు పడిన తీరు కు ఆ జట్టు బాట్స్ మన్ దాసోహ మయ్యారు. ఒకానొక సందర్భం లో ఇంగ్లాండ్ బాట్స్ మన్ బుమ్రా బౌలింగ్ ఆడలేకపోయారు. బుమ్రా వేసిన 15.5 ఓవర్ల లో మొత్తం ఐదు మేడిన్ ఓవర్లు ఉన్నాయంటే పరిస్థితి మనం అర్ధం చేసుకోవచ్చు. టెస్టుల్లో 150 వికెట్ల తీసేసరికి బుమ్రా సరాసరి 20.28 . టెస్టుల్లో ఇది రెండవ అతి తక్కువ సరాసరి. సయ్యద్ బార్నేస్ 16.43 తో మొదటి స్థానం లో ఉన్నారు.
కుల్దీప్ కూడా కీలకమైన 3 వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్ కు ఒక వికెట్ లభించింది. ముఖేష్ కుమార్ కి, అశ్విన్ కు వికెట్లు లభించలేదు. ప్రత్యర్ది ఆలౌట్ అయిన సందర్భం లో ఇలా ఒక వికెట్ కూడా అశ్విన్ తీయలేకపోవడం చాలా ఇన్నింగ్స్ తర్వాత ఇదే.Ind vs Eng 2nd Test
ఆధిక్యం లో భారత్ (Ind vs Eng 2nd Test)
భారత్ రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించింది. రెండవ రోజు ఆట ముగిసే సమయానికి జైస్వాల్ 15 పరుగులతోనూ, రోహిత్ శర్మ 13 పరుగులతోనూ క్రీజ్ వద్ద ఉన్నారు. జట్టు స్కోరు 28 . మొదటి ఇన్నింగ్స్ లో ఆధిక్యత 143 పరుగులతో కలిపి 171 పరుగుల ఆధిక్యం లో ఉంది భారత జట్టు. 300 నుండి 350 పరుగుల ఆధిక్యత ఇవ్వగలిగితే ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉంది కాబట్టి విజయావకాశాలు పుష్కలం గా ఉంటాయి. భారత బ్యాట్స్ మన్ రెండవ ఇన్నింగ్స్ లో చతికిల పడితే మాత్రం ఉప్పల్ టెస్టు ఫలితమే ఇక్కడా పునరావృతం కావచ్చు. అలా కాకూడదు అని ఆశిద్దాం.
రెండవ రోజు స్టార్ ప్లేయర్లు : యశస్వి జైస్వాల్, జస్ప్రీత్ బుమ్రా
Vijay Sports News