April 19, 2025

Vijay News Telugu| అచ్చమైన తెలుగు లో సరిక్రొత్త న్యూస్ బ్లాగ్ ప్రారంభం

Launching of new Telugu news Blog – Vijay News Telugu

Happy New Year 2024 - Vijay News Telugu - Telugu News Website

Vijay News Telugu - Telugu News Website

Vijay News Telugu| అచ్చమైన తెలుగు లో సరిక్రొత్త న్యూస్ బ్లాగ్ ప్రారంభం

హలో ఫ్రెండ్స్…. ఈ రోజు అనగా 01-01-2024 తేదీన అనగా నూతన సంవత్సరం రోజున  మన సరిక్రొత్త న్యూస్ బ్లాగ్ ‘Vijay News Telugu – Victorious News to Telugu People’ ప్రారంభించడం జరిగింది..Vijay News Telugu

ఇప్పటికే చాలా ఉన్నాయ్ కదా… ఇప్పుడెందుకు ఇవన్నీ…. అని అనుకోవచ్చు … దేని గొప్పదనం దానిదే… తెలుగు వార్తా ప్రపంచం లో అచ్చ తెలుగు ఆనవాళ్ళు కనుమరుగు అవుతున్న ప్రస్తుత సందర్భం లో మన పల్లెటూళ్ళ మనసు తడిని కొంత రంగరించుకొని ……పట్టణాల పెంకి తనాన్ని మరికొంత అద్దుకొని చలి చీకట్లను సుతి మెత్తగా అదలిస్తూ విచ్చుకున్న లేలేత ఉషోదయపు రంగవల్లి లా …. దూసుకు పోవాలన్నకాంక్ష తో చిన్ని చిన్ని అడుగులు వేస్తూ మీ ముందుకు వచ్చిన తొలి కిరణ పతాక …. మన న్యూస్ బ్లాగ్ …… మనస్పూర్తి గా దీనిని ఆశీర్వదించండి…..

అనేక అంశాలపై సమగ్ర సమాచారం అందించాలి… గాసిప్ వార్తలకు తావు లేకుండా…. నిజాలకు మాత్రమే పెద్ద పీట వేసి నమ్మకానికి ప్రతిరూపం లా ఉండాలి అనేది మన బ్లాగ్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

ఈ వెబ్ సైట్ లో వివిధ కేటగిరీల లో సమాచారాన్ని అందించడం జరుగుతోంది. అనుదిన వార్తల తో పాటు విద్యార్దులకు ఉపయోగపడే అనేక ముఖ్యమన అంశాలను, కరెంట్ అఫైర్స్ ను అందించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఉపయోగం లేని కంటెంట్ కంటే పదేపదే మళ్ళీ చదువుకొనే ముఖ్యమైన కంటెంట్ ను అందిస్తే మంచిదని మా అభిప్రాయం. కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, వివిధ రంగాలలో అవార్డులు, విద్యా సంబంధమైన అంశాలు, సైన్స్ సంబంధమైన అంశాలు మొదలైన వాటికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోంది.