January 10, 2025

What is Liquor Scam in Telugu| Kavitha Arrested – లిక్కర్ స్కాం లో కవిత అరెస్టు

లిక్కర్ స్కాం లో ఎట్టకేలకు బీ ఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టయ్యారు. మార్చి 15 వ తేదీన కవిత ఇంట్లో మధ్యాహ్నం 1.45 నుండి సాయంత్రం 6.45 గంటల వరకు  సోదాలు నిర్వహించారు. సాయంత్రం 5.20 గంటలకు  కవితను అరెస్టు చేసారు. మనీ లాండరింగ్ చట్టం 2022 (15 of 2003) ప్రకారం ఆమెను అరెస్టు చేసినట్లు అరెస్టు వారెంటు లో పేర్కొన్నారు.

What is Liquor Scam? kavitha

లిక్కర్ స్కాం లో కవిత అరెస్టయ్యారు. pic credits: X @kavitha

What is Liquor Scam in Telugu- Kavitha Arrested – లిక్కర్ స్కాం లో కవిత అరెస్టు

లిక్కర్ స్కాం లో ఎట్టకేలకు బీ ఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టయ్యారు. మార్చి 15 వ తేదీన కవిత ఇంట్లో మధ్యాహ్నం 1.45 నుండి సాయంత్రం 6.45 గంటల వరకు  సోదాలు నిర్వహించారు. సాయంత్రం 5.20 గంటలకు  కవితను అరెస్టు చేసారు. మనీ లాండరింగ్ చట్టం 2022 (15 of 2003) ప్రకారం ఆమెను అరెస్టు చేసినట్లు అరెస్టు వారెంటు లో పేర్కొన్నారు. అరెస్టు చేసిన అనంతరం ఆమెను డిల్లీ తరలించారు. ఆమె తో పాటు కేటీఆర్ కూడా డిల్లీ చేరుకున్నారు. న్యాయ పరమైన అంశాలలో ఆమెకు తోడుగా ఉండేందుకు కేటీఆర్ కూడా వెళ్ళారు.(What is Liquor Scam in Telugu)

అరెస్టు ఎలా జరిగింది అంటే…

చాలా నాటకీయ పరిణామాల అనంతరం కవిత ను ఈడీ అరెస్టు చేసింది. డిల్లీ నుండి సెర్చ్ వారెంట్ తో వచ్చిన అధికారులు దాదాపు నాలుగు గంటల సేపు ఆమె ఇంటిని సోదా చేసారు. అనేక ముఖ్యమైన పత్రాలను, కవితకు చెందిన ఫోన్లను కూడా సీజ్ చేసారు. ఈ సందర్బం గా బంజారాహిల్స్ లోని ఆమె నివాసం వద్దకు బిఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకొని ఈడీ కి వ్యతిరేకం గా నినాదాలు చేసారు. కవిత అరెస్టు వార్త తెలిసిన వెంటనే కేటీఆర్, హరీష్ రావు కవిత ఇంటికి చేరుకున్నారు. అయితే అధికారులు వారిని లోనికి రానివ్వకుండా తలుపులు మూసి వేసారు. కొద్ది సేపటి తర్వాత వారిని లోనికి అనుమతించారు.

ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగిన కేటీఆర్ 

ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదానికి దిగారు. ట్రాన్సిట్ వారంట్ లేకుండా ఎలా అరెస్టు చేస్తారని వారితో వాదించారు. సాయంత్రం 5 గంటల 20 నిమిషాలకు ఆమెను అరెస్టు చేసారు. ఆమెను శంషాబాద్ ఎయిర్ పోర్టు కు తరలిస్తున్న సమయం లో బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేస్తూ కార్లను అడ్డుకున్నారు. దానితో పోలీసులు స్వల్ప లాఠీ చార్జ్ చేయవలసి వచ్చింది. హైదరాబాద్ నుండి నేరుగా డిల్లీ ఈడీ ఆఫీసుకు తీసుకు వెళ్ళారు. తన అరెస్టును సవాలు చేస్తూ కవిత సుప్రీం కోర్టులో చాలెంజ్ పిటీషన్ వేయనున్నారు.

అసలు ఈ లిక్కర్ స్కాం ఏమిటి ?(What is Liquor Scam in Telugu)

కేజ్రీవాల్ ఆధ్వర్యం లోని డిల్లీ ప్రభుత్వం 2021 లో ఒక నూతన లిక్కర్ పాలసీ ని తీసుకు వచ్చింది. అప్పటివరకూ మద్యం విక్రయాలు అన్నీ ప్రభుత్వమే చేపట్టేది. కానీ 9500 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందన్న లెక్కలతో కేజ్రీవాల్ ప్రభుత్వం మద్యం అమ్మకాలను ప్రైవేటు పరం చేయడానికి కొత్త పాలసీ ని రూపొందించింది.

దీని కోసం ఒక ఎక్స్ పర్ట్ కమిటీ ని వేసింది డిల్లీ ప్రభుత్వం. ఈ కమిటీ ఇచ్చిన సిఫార్సుల ను అధ్యయనం చేయడానికి ముగ్గురు మంత్రులతో కూడా ఒక కమిటీని వేసింది. ఈ కమిటీ ని ఫిబ్రవరి 2021 లో వేసారు.

ఈ మంత్రులు ఇచ్చిన సిఫార్సులను డిల్లీ ప్రభుత్వ కేబినెట్ ఆమోదించి ఆ పాలసీ ని డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు పంపించింది ప్రభుత్వం. చాలా కాలం పాటు ఈ పాలసీని అధ్యయనం చేసిన లెఫ్టినెంట్ గవర్నర్ నవంబర్ 2021 లో దీనికి ఆమోదం తెలిపారు.

నూతన మద్యం పాలసీ కి అనుగుణం గా ప్రైవేటు రంగం లో 849 మద్యం దుకాణాలు తెరచుకొన్నాయి. నూతన మద్యం పాలసీ ప్రకారం మద్యం డోర్ డెలివరీ చేయవచ్చు. మద్యం షాపులను తెల్లవారుజాము న 3 గంటల వరకూ తెరచి ఉంచవచ్చు.

కొత్త చీఫ్ సెక్రటరీ రాక తో పాలసీ పై నివేదిక 

2022 వ సంవత్సరం లో డిల్లీ ప్రభుత్వ కొత్త చీఫ్ సెక్రెటరీ గా నరేష్ కుమార్ నియమితులై ఈ మద్యం పాలసీ పై పూర్తి అధ్యయనం చేసారు. నూతన లిక్కర్ పోలసీ లో అనేక అవకతవకలు జరిగినట్లు గుర్తించి ఒక నివేదిక ను రూపొందించారు. ఈ నివేదికను డిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు అందజేయడం తో ఆయన సీబీఐ విచారణ కు ఆదేశించారు.

నివేదిక రూపొందిస్తున్నపుడే పాలసీ రద్దు చేసిన ప్రభుత్వం..

ఈలోపు ఈ లిక్కర్ పాలసీ ని రద్దు చేసింది కేజ్రీవాల్ ప్రభుత్వం. అనుకున్నంత ఆదాయం రాకపోవడం తో పాలసీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం.

మద్యం దుకాణాల కేటాయింపు లో నిబంధనలకు విరుద్ధం గా అనేక లైసెన్సులు జారీ చేసారని, దీనితో కోట్ల రూపాయలు చేతులు మారాయని  గుర్తించింది సీబీఐ.

డిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మరియు ఆయన అనుచరులు దినేష్ అరోరా, అమిత్ అరోరా, అర్జున్ పాండే లు ఈ కుంభకోణం లో ప్రధాన పాత్ర పోషించినట్లు సీబీఐ తెలియజేసింది. ఈ కేసులో ముందుగా అమిత్ అరోరా ను అరెస్టు చేసారు.

ఈ స్కాం లో కవిత పాత్ర గురించి సీబీఐ ఏమని చెప్పింది అంటే… 

అమిత్ ఆరోరాకు సంబంధించిన రిమాండ్ రిపోర్టు లో మొదటి సారిగా కవిత పేరు ప్రస్తావించ బడింది.  వ్యాపార వేత్త అరబిందో  శరత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, మాగుంట రాఘవరెడ్డి సౌత్ గ్రూప్ (south group) అనే ఒక గ్రూపు ను ఏర్పాటు చేసి మద్యం అమ్మకాలలో దాదాపు 65 % వాటా ను దక్కించుకున్నారు అనే ఆరోపణ చేసింది సీబీఐ. అంతే కాకుండా ఈ వాటా దక్కించు కోవడం కోసం ఈ సౌత్ గ్రూప్ వంద కోట్ల రూపాయల ముడుపులను చెల్లించింది అని సీబీఐ ఆరోపించింది. ఈ 100 కోట్ల రూపాయలు అమిత్ అరోరా ద్వారా విజయ్ నాయర్ కు తద్వారా ఆప్ నేతలకు సొమ్ము చేరినట్లు అప్రూవర్ గా మారిన అమిత్ అరోరా చెప్పినట్లు ఈడీ తన రిపోర్టు లో పేర్కొంది.

సౌత్ గ్రూపు నుండి ముడుపులు చేరవేసిన వారిలో అరబిందో శరత్ రెడ్డి, కవిత పేర్లను అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టు లో ఈడీ పేర్కొంది.  సౌత్ గ్రూపు కు చెందిన వ్యాపారవేత్త అరుణ్ పిళ్ళై, చార్టర్డ్ అకౌంటెంట్ బుచ్చిబాబు, అభిషేక్ బోయిన పల్లి అనే వారిని కూడా అదుపు లోనికి తీసుకొని విచారించారు. వీరి నుండి కూడా ముఖ్యమైన సమాచారాన్ని రాబట్టారు. ఈ డీల్ కుదరడం లో ప్రత్యేక ఫోన్స్ వాడారని వాటిని అన్నిటినీ తర్వాత ద్వంసం చేసారని ఈడీ పేర్కొంది. (What is Liquor Scam in Telugu)

ఇప్పటికే ఒకసారి కవిత ను విచారించిన ఈడీ(What is Liquor Scam in Telugu)

డిసెంబర్ 2022 లో హైదరాబాద్ లోని కవిత నివాసం లో దాదాపు 7 గంటల పాటు సీబీఐ అధికారులు ఆమెను విచారించారు. సౌత్ గ్రూపు తో ఆమెకు ఉన్న సంబంధాల గురించి ప్రశ్నించారు. ఆ తర్వాత ఈడీ కూడా నోటీసులు ఇచ్చింది. ఈడీ ఆఫీసులో విచారణ కు కూడా కవిత హాజరు కావడం జరిగింది.

సీఆర్పీసీ విచారణ సరిగా లేదంటూ సుప్రీం లో పిటీషన్ వేసిన కవిత  

ఈ కేసుకు సంబంధించి కీలక సమాచారాన్ని సేకరించిన సీబీఐ ముందు కవిత ను సాక్షిగా మాత్రమే పేర్కొన్నప్పటికీ ఆ తర్వాత ఆమెను నిందితురాలిగా పేర్కొన్నది. సీ ఆర్ పీ సీ క్రింద నోటీసులు కూడా జారీ చేసింది సీబీఐ. దానితో కవిత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సీఆర్పీసీ నిబంధనలు మహిళల విషయం లో సరిగ్గా పాటించడం లేదంటూ సుప్రీం కోర్టు లో పిటీషన్ దాఖలు చేసారు. దీనిపై విచారించిన కోర్టు తుది ఆదేశాలు వచ్చే వరకూ ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ విచారణలు జరుగుతుండగా కవిత పిటీషన్ పై మార్చి 19 వ తేదీ కి వాయిదా పడింది. ఈ లోపు మార్చి 15 వ తేదీన ఆమెను అరెస్టు చేసారు. మార్చి 16 వ తేదీన డిల్లీ లోని కోర్టులో కవితను ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తోంది. (What is Liquor Scam in Telugu)