March 7, 2026
Home » నాన్ వెజ్ మిల్క్ అంటే ఏమిటి? అమెరికా ఎందుకు కాలు దువ్వుతోంది? Non Veg Milk

నాన్ వెజ్ మిల్క్ అంటే ఏమిటి? అమెరికా ఎందుకు కాలు దువ్వుతోంది? Non Veg Milk

non veg milk

non veg milk

నాన్ వెజ్ మిల్క్ అంటే ఏమిటి? అమెరికా ఎందుకు కాలు దువ్వుతోంది? Non Veg Milk

సాధారణం గా శాఖాహారం తినే వారిని vegetarians అని, మాంసాహారం తినే వారిని non vegetarians అని పిలుస్తాం. కాని non veg milk గురించి మీకు తెలుసా?. పాలలో కూడా veg milk అని నాన్ వెజ్ మిల్క్ అని ఉంటాయని మీకు తెలుసా?. ఈ వ్యాసం లో నాన్ వెజ్ మిల్క్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం.

మన దేశం లో పాలిచ్చే ఆవులు, గేదెలు సాధారణం గా గడ్డి, తవుడు వంటి శాఖాహార ఆహారం తీసుకొని పాలని ఇస్తూ ఉంటాయి. భారతదేశ ఆచార వ్యవహారాల్లో ఇటువంటి పాలను, పాల పదార్ధాలను ఉపయోగించడం సాంప్రదాయం గా కొనసాగుతూ వస్తోంది. అయితే ఈ మధ్య అమెరికా తమ పశువులు ఉత్పత్తి చేసే non veg milk ని మన దేశం లో ప్రవేశ పెట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది.

మన దేశంలో వలె కాకుండా అమెరికా లోని పశువులకు మాంసం, మాంస ఉత్పత్తులు, blood meal వంటివి ఆహారం గా పెడతారు. ఇటువంటి పశువులు ఉత్పత్తి చేసే పాలను non veg milk అంటున్నారు. మాంసాహారం తినడం ద్వారా పశువులు బలం గా పెరగడమే కాకుండా, అత్యధిక పాల ఉత్పత్తి చేస్తాయని, అందుకే తాము మాంసాహారాన్ని పశువులకు అందజేస్తామని వారు చెప్తున్నారు.

మాంసాహారం తినే పశువులు ఉత్పత్తి చేసే పాలను భారతీయులు ఎట్టి పరిస్థితులలోనూ ఉపయోగించరని, అది వారి ఆచార వ్యవహారాలకు విరుద్ధమని భారత్ వాదిస్తోంది. అందుకే నాన్ వెజ్ మిల్క్ ని అమెరికా నుండి దిగుమతి చేసుకోవడం లేదని, అమెరికా మన దేశానికి పంపించే ప్రతి లీటరు పాలూ శాఖాహార పాలు మాత్రమే పంపాలని భారత్ పట్టు పడుతోంది. ఈ అంశం పై అమెరికా ఇప్పటికే ప్రపంచ వాణిజ్య సంస్థ కు ఫిర్యాదు కూడా చేసింది.

తిరుపతి లడ్డూ కి ఉపయోగించే నెయ్యి లోనే కల్తీ జరిగిందని వార్తలు రావడం తో అశేష భక్త సమూహం ఏ విధం గా స్పందించారో చూసాం. ప్రస్తుతం మాంసాహారం తిని అమెరికా పశువులు ఇచ్చే ఈ మాంసాహార పాలు, పాల పదార్ధాలు భారతీయులు తమ పూజా కార్యక్రమాలలో ఎంత వరకూ వినియోగిస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మాంసాహార పాలు అనే భావన మనసులో ఉన్నంత కాలం పూజా కార్యక్రమాలు సైతం సక్రమం గా వ్యవహరించలేరు. 

ప్రపంచం లోనే అత్యధిక పాలను ఉత్పత్తి చేసే భారత్ లో కూడా తమ మార్కెట్ లను విస్తరించాలని పట్టుపడుతున్న ట్రంప్, ఉక్రోషం తో భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపానంటూ అంతర్జాతీయ వేదికలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం చూస్తూనే ఉన్నాం. అంతర్జాతీయ వర్తక సూత్రాలను అనుసరించి ఒకవేళ భారత్ అమెరికా తో ఈ ఒప్పందానికి అనుమతించినా సగటు భారతీయులు మాత్రం దీనిని సహించరు. దేశ వ్యాప్తం గా ఈ విషయమై తీవ్ర వ్యతిరేకత వచ్చినా ఆశ్చర్య పోవలసిన అవసరం లేదు.