January 10, 2025

బజ్ బాల్ కి వైట్ వాష్ | Ind vs Eng|White Wash to Buzz Ball| భారత్ ఘన విజయం

బజ్ బాల్ గేమ్ తో ఏ జట్టునైనా మట్టి కరిపిస్తాం అంటూ సీరీస్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు భారత యువ ఆటగాళ్ళ దెబ్బకు విలవిల లాడింది. ఉప్పల్ టెస్టు లో మాత్రమే విజయం సాధించిన ఇంగ్లాండ్ మిగిలిన నాలుగు టెస్టులలో దారుణం గా ఓడిపోయింది. వరుసగా నాలుగు టెస్టులలో ఘన విజయం సాధించి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో మొదటి స్థానానికి ఎగ బ్రాకింది భారత్. (White Wash to Buzz Ball)

IND vs NZ 3rd test highlights

IND vs NZ 3rd test highlights credits: X @ BCCI

బజ్ బాల్ కి వైట్ వాష్ | White Wash to Buzz Ball| భారత్ ఘన విజయం

ధర్మశాల టెస్ట్ లో ఇంగ్లాండ్ పై భారత్ ఘన విజయం సాధించింది. మూడు రోజులకే ముగిసిన ఈ 5 వ టెస్టు లో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడా తో ఇంగ్లాండ్ జట్టు ను ఓడించి సీరీస్ ను 4-1 తేడా తో కైవసం చేసుకుంది. బజ్ బాల్ గేమ్ తో ఏ జట్టునైనా మట్టి కరిపిస్తాం అంటూ సీరీస్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు భారత యువ ఆటగాళ్ళ దెబ్బకు విలవిల లాడింది. ఉప్పల్ టెస్టు లో మాత్రమే విజయం సాధించిన ఇంగ్లాండ్ మిగిలిన నాలుగు టెస్టులలో దారుణం గా ఓడిపోయింది. వరుసగా నాలుగు టెస్టులలో ఘన విజయం సాధించి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ లో మొదటి స్థానానికి ఎగ బ్రాకింది భారత్. (White Wash to Buzz Ball)

అదరగొట్టిన ఆరంగేట్రం ప్లేయర్లు 

కోహ్లీ లాంటి సీనియర్ ప్లేయర్లు అందుబాటులో లేనప్పటికీ ఆరంగేట్రం చేసిన ప్లేయర్ల తో పాటు మిగిలిన సీనియర్ ప్లేయర్ల సమిష్టి కృషి తో భారత్ ఈ ఘనత సాధించింది. ఈ సీరీస్ లో ఐదుగురు కొత్త ప్లేయర్లు ఆరంగేట్రం చేసారు. వీరిలో రజిత్ పాటిదార్ తప్ప మిగిలిన వారంతా తమ ఆగమనాన్ని గొప్పగా చాటుకున్నారు. తమకు వచ్చిన గొప్ప అవకాశాన్ని ఘనం గా వినియోగించుకొని జట్టు విజయానికి తోడ్పడ్డారు.

ఆకట్టుకున్న జ్యురెల్, సర్ఫరాజ్ ..(White Wash to Buzz Ball)

వీరిలో అందరికంటే ఎక్కువ మార్కులు కొట్టేసింది మాత్రం వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ధృవ్ జ్యురెల్. జట్టుకు చాలా కీలకమైన స్థితి లో 90 పరుగులు చేసి ఇంగ్లాండ్ విజయానికి అడ్డు పడటం తో జ్యురెల్ పేరు మారు మ్రోగి పోయింది. అలాగే సర్ఫరాజ్ కూడా చాలా చక్కగా బ్యాటింగ్ చేసాడు. తను ఆడిన మొదటి టెస్టు లోనే రెండు అర్ద సెంచరీలు చేయడం తో సర్ఫరాజ్ రూపం లో మరొక చక్కటి మిడిల్ ఆర్డర్ బాట్స్ మన్ కనిపించాడు. తర్వాతి టెస్టు లో విఫలమైనా ధర్మశాల లో మళ్ళీ అర్ద సెంచరీ చేసి తన శక్తిని నిరూపించు కున్నాడు.

పర్వాలేదనిపించిన ఆకాష్ దీప్, పడిక్కల్..

ఆకాష్ దీప్ ఆడింది ఒక టెస్టు అయినా వరుసగా మూడు వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. చివరి టెస్టు లో ఆరంగేట్రం చేసిన పడిక్కల్ కూడా అర్ద సెంచరీ చేసాడు. మూడు టెస్టులు ఆడిన రజిత్ పాటిదార్ మాత్రం ఒక్క ఇన్నింగ్స్ లో కూడా సరైన ప్రదర్శన చేయలేక పోయాడు. మొత్తం మీద ఈ టెస్టు సీరీస్ లో ఆరంగేట్రం చేసిన ఐదుగురు ఆటగాళ్ళ లో నలుగురు ఆటగాళ్ళు  తమ ప్రతిభ ను నిరూపించు కున్నారు.

బుమ్రా, అశ్విన్, కుల్దీప్ విశ్వ రూప ప్రదర్శన 

భారత బౌలింగ్ త్రయం బుమ్రా, అశ్విన్, కుల్డీప్ దాదాపు ప్రతి టెస్టు లోనూ తమ ప్రాధాన్యత ను చాటి చెప్పారు. మొదటి టెస్టు లో ఆడని కుల్దీప్ మిగిలిన నాలుగు టెస్టులలో చక్కగా రాణించాడు. బాల్ తోనే కాకుండా బ్యాట్ తో కూడా రాణించాడు. జ్యురెల్ తో కలిసి కుల్దీప్ చేసిన బ్యాటింగ్ సీరీస్ కే హైలెట్ అని చెప్పవచ్చు. బాల్ తో కూడా విశేషం గా రాణించాడు.(White Wash to Buzz Ball)

100 టెస్టులు, 500 వికెట్ల తో అశ్విన్ జయభేరి 

ఈ సీరీస్ లోనే 100 టెస్టులు ఆడిన ఘనత పూర్తి చేసుకున్న అశ్విన్ 500 వికెట్లు కూడా సాధించి చరిత్ర సృష్టించాడు. వైజాగ్ టెస్టు లో బ్యాటింగ్ కి అనుకూలం గా ఉన్న పిచ్ పై అద్భుతం గా బౌల్ చేసి ఈ సీరీస్ లో భారత్ మొదటి విజయానికి కారణం అయ్యాడు బుమ్రా.  ఇలా ఎవరి పాత్రను వారు సక్రమం గా పోషించడం తో భారత్ ఇంగ్లాండ్ ను వైట్ వాష్ చేయగలిగింది. మొదటి టెస్టు లో ఓడిపోయినప్పటికీ తిరిగి పుంజుకొని వరుసగా 4 టెస్టులలో విజయం సాధించడం సాధారణ విషయం కాదు.

జైస్వాల్ బ్యాటింగ్ విశ్వరూపం 

రెండు డబుల్ సెంచరీలతో చెలరేగిపోయిన జైస్వాల్ ఇంగ్లాండ్ బాజ్ బాల్ కు బై బై చెప్పాడు. సీరీస్ లోనే అత్యుత్తమ ప్రదర్శన గా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాడు జైస్వాల్. డబుల్ సెంచరీలు సాధించిన రెండు సందర్భాలలోనూ జైస్వాల్ ప్రతిభ తోనే భారత్ ఘన విజయాలు సాధించింది. సిరీస్ లో అత్యధిక పరుగులు సాధించిన ఘనత కూడా సొంతం చేసుకున్నాడు జైస్వాల్. అంతే కాకుండా ఒక సీరీస్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఘనత కూడా సాధించాడు. అనేక రికార్డులు సాధించిన ఘనత పొంది అనేక మంది క్రికెట్ మహామహుల సరసన స్థానం సంపాదించుకున్నాడు జైస్వాల్. జైస్వాల్ ఆట ఎలా ఉందంటే ‘నభూతో నభవిష్యత్ ‘ అన్నట్టు…

చెలరేగి ఆడిన గిల్..(White Wash to Buzz Ball)

మొదటి టెస్టులలో విఫలం అయినా వేగం గా పుంజుకొని మంచి ఇన్నింగ్స్ ఆడాడు గిల్. మొదటి రెండు టెస్టులలో సరిగా పరుగులు చేయలేకపోయిన గిల్ ఆ తర్వాత చెలరేగి ఆడాడు. త్రుటి లో సెంచరీలు మిస్ అయినా ధృఢ సంకల్పం తో ఆడి పరుగులు సాధించాడు. నాలుగు టెస్టులలో భారత్ విజయం లో కీలక పాత్ర పోషించాడు గిల్.

అనుభవాన్ని రంగరించి ఆడిన రోహిత్, జడేజా  …

అనుభవజ్ఞుడైన భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా చక్కటి బ్యాటింగ్ చేసాడు. జట్టుకు అవసరమైన సందర్భాలలో పరుగులు చేసి యువ ఆటగాళ్లకు ప్రోత్సాహాన్ని ఇచ్చాడు. భారత్ జట్టు లోని ఆటగాళ్ళు  అందరినీ ఒక త్రాటి పై నిలిపి వారిలోని ప్రతిభా నైపుణ్యాలను బయటకు తీసి జట్టును గెలుపు బాట లో నడిపింది మాత్రం రోహిత్ అనే చెప్పవచ్చు.

రాజ్ కోట్ టెస్టు విజయం లో కీలక పాత్ర పోషించాడు జడేజా. తన హోం గ్రౌండ్ లో చెలరేగి ఆడి జట్టుకు విజయాన్ని అందించాడు జడేజా. బ్యాటింగ్ తో బౌలింగ్ తో చక్కటి ప్రదర్శన చేసి జట్టు విజయం లో ప్రధాన పాత్ర పోషించాడు జడేజా

ఇలా జట్టు లోని ఆటగాళ్ళు అందరూ సమిష్టి గా రాణించడం వలన టెస్టు సీరీస్ లో ఘన విజయం సాధించింది భారత్. బ్రెండన్ మెక్ కల్లం యొక్క టెక్నిక్ బాజ్ బాల్ భారత గడ్డ పై పనిచేయలేదు. యువ ఆటగాళ్ళతో కూడా సరిక్రొత్త విజయాలు సాధించవచ్చు అని చాటి చెప్పింది భారత జట్టు.

ఇంగ్లాండ్ ను క్రుంగ దీసిన బాటింగ్ వైఫల్యం

ఇంగ్లాండ్ జట్టు విషయానికి వస్తే సీనియర్ ఆటగాళ్ళు అందరూ దాదాపు విఫలం అయ్యారు. అందరి కంటే ఎక్కువ వైఫల్యం బెన్ స్టోక్స్ ది. జో రూట్ పర్వాలేదు అనిపించినా జానీ బెయిర్ స్టో విఫలం కావడం తో ఇంగ్లాండ్ జట్టు ఏ దశ లోనూ కోలుకోలేక పోయింది. మొదటి టెస్టులో డబుల్ సెంచరీ చేసిన ఒలీ పోప్ మిగిలిన టెస్టులలో అంతగా ప్రభావం చూపలేక పోయాడు.(White Wash to Buzz Ball)

బౌలింగ్ లో భేష్ అనిపించిన బషీర్, హార్ట్లీ

బౌలింగ్ లో మాత్రం ఇంగ్లాండ్ కి బషీర్, హార్ట్లీ రూపం లో కొంత ఊరట లభించింది. 20 ఏళ్ళ బషీర్ ఇంగ్లాండ్ బౌలింగ్ కి తురుపు ముక్క అయ్యాడు. హార్ట్లీ కూడా సమయానుకూలం గా బౌలింగ్ వేస్తూ ఆకట్టు కున్నాడు.

700 వికెట్ల క్లబ్ లో అండర్సన్ 

22 ఏళ్ళు గా సుదీర్ఘం గా  క్రికెట్ ఆడుతున్న41 ఏళ్ళ  అండర్సన్ 700 వికెట్లు సాధించి ఈ ఘనత సాధించిన మొదటి ఇంగ్లాండ్ ఆటగాడు అయ్యాడు. ఓవరాల్ గా ఈ ఘనత సాధించిన మూడవ ఆటగాడు గా చరిత్ర సృష్టించాడు.

ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా కుల్దీప్, ప్లేయర్ ఆఫ్ ది సీరీస్ గా జైస్వాల్ ఎంపిక అయ్యారు.

-Vijay Cricket News Telugu