World’s First AI Software Engineer Devin| మొట్టమొదటి కృత్రిమ మేధ ఇంజనీర్
కృత్రిమ మేధ తో పనిచేసే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ప్రపంచం లోనే మొట్టమొదటి ఆవిష్కరణ ఇది. ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఏ విధం గా అయితే పనిచేయగలరో అంతకంటే ప్రతిభావంతం గా పని చేసే ‘సూపర్ స్మార్ట్ రోబో’ ఇది
World’s First AI Software Engineer Devin| మొట్టమొదటి కృత్రిమ మేధ ఇంజనీర్
కంప్యూటర్ లో అభివృద్ధి ని బట్టి వాటిని తరాలు గా విభజించారు. ప్రస్తుతం నడుస్తున్న తరం కృత్రిమ మేధ తరం. మొదటి తరం వ్యాక్యూమ్ ట్యూబ్ తో, రెండవ తరం సెమీ కండక్టర్ లతో, మూడవ తరం ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ తో, నాల్గవ తరం మైక్రో ప్రాసెసర్ లతో అభివృద్ధి జరిగింది. ఐదవ తరాన్ని మాత్రం AI (కృత్రిమ మేధ ) తరం అంటున్నారు. అంటే ప్రస్తుతం నడుస్తున్న తరం .(AI Software Engineer Devin)
గూగుల్ నే ప్రశ్నార్ధకం చేసిన చాట్ జిపిటి
ప్రస్తుతం కంప్యూటర్ ల రంగం చాలా వేగం గా అభివృద్ధి చెందుతోంది. ప్రతి రోజూ ఒక కొత్త ఆవిష్కరణ చేస్తున్నారు మన శాస్త్రజ్ఞులు. మొన్నటి వరకు చాట్ జిపిటి ఒక గొప్ప సంచలనాన్నే కలిగించింది. చాట్ జిపిటి దెబ్బకి గూగుల్ సెర్చ్ ఇంజన్లు కూడా చిన్నబోయాయి. అవసరమైన నిర్దిష్టమైన సమాచారం స్క్రీన్ లపై ప్రత్యక్షం అవుతుంటే ఎవరు మాత్రం ఉపయోగించు కోరు. అంతవరకు అయితే పర్వాలేదు.. మరిన్ని ఆవిష్కరణ లు వెలుగు చూస్తున్నాయి. డీప్ ఫేక్ తో లాభాల కంటే నష్టాలనే ఎక్కువగా చూస్తున్నాం.
మొట్ట మొదటి కృత్రిమ మేధ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ డెవిన్
మనకు కావలసిన రీతి గా ఫోటోలు, వీడియోలను ఎడిటింగ్ చేసుకోవడానికి అనేక AI సాఫ్ట్ వేర్ లు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఈ కోవలోనికి మరొక అద్భుతం వచ్చి చేరింది. అదే కృత్రిమ మేధ తో పనిచేసే సాఫ్ట్ వేర్ ఇంజనీర్. ప్రపంచం లోనే మొట్టమొదటి ఆవిష్కరణ ఇది. ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఏ విధం గా అయితే పనిచేయగలరో అంతకంటే ప్రతిభావంతం గా పని చేస్తుంది ఇది. అమెరికా కు చెందిన కాగ్నిషన్ అనే స్టార్టప్ కంపెనీ దీనిని ను తయారు చేసింది. దీనికి ‘డెవిన్’ అనే పేరు పెట్టారు.(AI Software Engineer Devin)
పైథాన్, జావా కూడా వచ్చు దీనికి (AI Software Engineer Devin)
ఈ ‘డెవిన్’ అనేక సాఫ్ట్ వేర్ ప్రోగ్రాములను తయారు చేయగలుగుతుంది. అలాగే వెబ్ సైట్ లను కూడా సృష్టించ గలదు. వెబ్ సైట్ రూపొందించడానికి అవసరమైన అన్ని ప్రోగ్రాము లను రాయగలదు. కోడింగ్, టెస్టింగ్ వంటి ప్రక్రియలు చాలా ప్రతిభావంతం గా చేయగలదు. అందుకే దీనిని ఒక ‘సూపర్ స్మార్ట్ రోబో’ అంటున్నారు. పైథాన్, జావా స్క్రిప్ట్ వంటి అనేక కంప్యూటర్ భాషలను రాయగలదు.
లేటెస్ట్ టెక్నాలజీ కి కూడా అప్ డేట్ అవ్వగలదు
‘డెవిన్’ ను ప్రపంచ నలుమూలలున్న అనేక సాఫ్ట్ వేర్ కంపెనీలు అనేక పరీక్షలు పెట్టి పరీక్షించాయి. ఈ పరీక్షలు అన్నిటిలో విజయం సాధించింది ఈ AI సాఫ్ట్ వేర్ ఇంజనీర్. దీనితో డెవిన్ కి ప్రపంచ వ్యాప్తం గా క్రేజ్ ఏర్పడింది. ఒక చిన్న కమాండ్ ఇవ్వడం తోనే అతి క్లిష్టమైన సాఫ్ట్ వేర్ లను రూపొందించ గలదు. అలాగే వెబ్ సైట్ లను, ఆప్స్ (అప్లికేషన్స్) కూడా రూపొందించ గలదు. కోడింగ్, టెస్టింగ్, డిప్లాయ్ మెంట్, అడాప్టింగ్, లెర్నింగ్ వంటి క్లిష్ట ప్రక్రియలు అతి సులువు గా చేయగలదని, నూతన టెక్నాలజీ ని కూడా ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోగలదని ‘కాగ్నిషన్’ కంపెనీ ప్రకటించింది.