Bajaj Freedom 125 World’s First CNG Bike Price|బైక్ న్యూస్ తెలుగు
మోటార్ సైకిల్ వినియోగదారులు ఇంధనం పై పెట్టే ఖర్చు లో 50 % ఆదా చేకూరుతుంది అని బజాజ్ కంపెనీ చెబుతోంది. ప్రధానం గా ఇది CNG ని ఉపయోగించుకొని నడిచే వాహనం కావడం వలన పెట్రోల్ కంటే తక్కువ ఖర్చు తో అధిక మైలేజ్ పొందడానికి వీలు కుదురుతుంది.
Bajaj Freedom 125 |World’s First CNG Bike Price Sales Started in Telugu states
ప్రపంచం లోనే మొట్టమొదటి CNG బైక్ గా విడుదలైన బజాజ్ ఫ్రీడం 125 బైక్ ల అమ్మకాలు తెలుగు రాష్ట్రాలలో ప్రారంభం అయ్యాయి. ఇంతవరకు దేశం లోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన ఈ బైక్ ల అమ్మకాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల బైక్ ల అభిమానులను అలరించ బోతున్నాయి.(Bajaj Freedom 125 World’s First CNG Bike)
ఈ మోటార్ సైకిల్ ధర ఎంత అంటే..
ప్రస్తుతం ఈ మోటార్ సైకిల్ మూడు వేరియంట్లు గా విడుదల చేసారు. బేసిక్ మోడల్ NG04 Drum కాగా Drum LED, Disc LED అనే మూడు వేరియంట్స్ మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. ధరలు ఇలా ఉన్నాయి
NG04 Drum – 94,995/- (Ex Showroom)
NG04 Drum LED – 1,04,998/- (Ex Showroom)
NG04 Disc LED – 1,09,997/- (Ex Showroom)
ఇదొక హైబ్రిడ్ మోటార్ సైకిల్
CNG మరియు పెట్రోల్ తో నడిచే హైబ్రిడ్ వాహనం గా దీనిని చెప్పవచ్చు. రెండు కిలోల CNG నింపడానికి వీలుగా ఇవ్వబడిన ట్యాంక్ సీట్ క్రింది భాగం లో అమర్చబడింది. అలాగే దీనికి ముందు భాగం లో అమర్చబడిన పెట్రోల్ ట్యాంక్ లో 2 లీటర్ల పెట్రోల్ నింపుకోవడానికి అవకాశం ఉంది. అవసరాన్ని బట్టి, లభ్యత ను బట్టి పెట్రోల్ గాని, CNG గ్యాస్ ను గాని ఉపయోగించుకొని ఈ బైక్ ను నడుపుకోవచ్చు.
మోటార్ సైకిల్ వినియోగదారులు ఇంధనం పై పెట్టే ఖర్చు లో 50 % ఆదా చేకూరుతుంది అని బజాజ్ కంపెనీ చెబుతోంది. ప్రధానం గా ఇది CNG ని ఉపయోగించుకొని నడిచే వాహనం కావడం వలన పెట్రోల్ కంటే తక్కువ ఖర్చు తో అధిక మైలేజ్ పొందడానికి వీలు కుదురుతుంది. ఈ మోటార్ సైకిల్ శ్రేణి లో చూస్తే అతి పొడవైన సీటు ఇవ్వడం ద్వారా నడిపే వారికి, వెనుక కూర్చునే వారికి అధిక కంఫర్ట్ లభిస్తుంది. (Bajaj Freedom 125 World’s First CNG Bike)
ఎన్ని కిలోల CNG ట్యాంక్ ఉంది?
గతుకుల రోడ్ల పై కూడా సులువు గా వెళ్ళడానికి వీలుగా మోనో లింక్డ్ సస్పెన్షన్ ను ఇవ్వడం ద్వారా మంచి ప్రయాణపు అనుభూతి కలుగుతుంది. దీనిలో ఉండే CNG ట్యాంక్ ను అతి భద్రం గా ఉండేలా ఫ్యాక్టరీ లో అమర్చారు. 2 కిలోల CNG దాదాపు 200 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఒక కిలోకు 100 కిలోమీటర్లు అంటే పెట్రోల్ తో పోల్చుకున్నపుడు చాలా తక్కువ ఖర్చు తో ఎక్కువ దూరం వెళ్తున్నట్టే..
అలాగే ఈ మోటార్ సైకిల్ లో 2 లీటర్ల పెట్రోల్ ట్యాంకు కూడా ఉంది. ఒక లీటరు పెట్రోల్ కు 65 కిలోమీటర్ల మైలేజ్ చొప్పున రెండు లీటర్ల కు 130 కిలోమీటర్లు దూరం వెళ్ళవచ్చు. ఎడమ వైపు హ్యాండిల్ బార్ పై ఉన్న బటన్ ప్రెస్ చేయడం ద్వారా పెట్రోల్ మరియు CNG ల మధ్య మార్పిడి చేసుకోవచ్చు. (Bajaj Freedom 125 World’s First CNG Bike)
ఈ మోటార్ సైకిల్ లో పూర్తి స్థాయి డిజిటల్ స్పీడో మీటర్ ఇవ్వడం జరిగింది. దీనితో పాటు బ్లూ టూత్ కనెక్టివిటీ కూడా ఉంది. దీనితో కాల్ అలర్ట్స్, కాలర్ ఐడి, మిస్ కాల్ నోటిఫికేషన్ తో పాటు బ్యాటరీ లైఫ్ ఇండికేటర్ కూడా ఉండటం ఒక ప్రధాన ఆకర్షణ.
CNG ట్యాంక్ ఎంత వరకు సురక్షితం ?
అత్యంత సురక్షితం గా ఉండేలా CNG ట్యాంక్ ను అమర్చారు. ప్రత్యేకం గా రూపొందించిన ట్రెల్లిస్ ఫ్రేం తో పూర్తిగా కప్పి ఉంచడం ద్వారా పూర్తి సురక్షితం గా ఉంటుంది. అంతే కాకుండా దీనిపై మరొక రక్షణ కవచాన్ని కూడా ప్రత్యేకం గా ఏర్పాటు చేసారు. ఈ మోటార్ సైకిల్ లో ఉన్న CNG కిట్ ఎంతవరకూ సురక్షితం గా తెలుసుకోవడానికి అనేక కఠినమైన పరీక్షలకు గురిచేసారు.
బైక్ ముందు నుండి, వెనుక నుండి ప్రక్క నుండి తీవ్రమైన ఒత్తిడి (impact) పరీక్షలకు గురి చేసారు. వాటిని అన్నిటినీ విజయవంతం గా తట్టుకోవడం జరిగింది. భారీ ట్రక్కు క్రింద మోటార్ సైకిల్ నలిగి పోయినప్పటికీ CNG kit అత్యంత భద్రం గా ఉండటమే ఈ మోటార్ సైకిల్ యొక్క హైలెట్ గా చెప్పు కోవచ్చు. గ్యాస్ తో నడిచే బండి అనగానే అది సురక్షితం కాదేమో అనే భావన లో ఉంటాం. కానీ అనేక కఠినమైన పరీక్షలను ఈ మోటార్ సైకిల్ తట్టుకొని నిలబడటం విశేషం. ఈ మోటార్ సైకిల్ లో పొందుపరచబడిన CNG ట్యాంకు PESO (Petroleum and Explosive Safety Organization) చేత ధృవీకరణ పొందింది.
సౌకర్యం గా ఉండే పొడవైన సీటు :(Bajaj Freedom 125 World’s First CNG Bike)
గతుకులు, ఎత్తు పల్లాల రోడ్లకు అనువుగా దీనిని రూపొందించారు. మోనో షాక్ సస్పెన్షన్ ఉండటం తో బైక్ నడిపేటప్పుడు స్టిరమైన కదలికలతో అలసట లేకుండా చేస్తుంది. 120/70 ప్రొఫైల్ తో 16 అంగుళాల సైజు కలిగిన వెనుక చక్రం ఇవ్వబడింది. పొడవైన హాండిల్ బార్ ఇవ్వడం వలన నిటారుగా కూర్చొని నడపడానికి వీలుగా ఉంటుంది. పొడవుగా ఉండే సీటు వలన కూడా సౌకర్యవంతం గా ఉంటుంది.
ఇంజన్ వేడెక్కకుండా ఉండటానికి పెద్దవైన కూలర్ జెట్ లు అమర్చారు. 125 cc శ్రేణి లో మిగిలిన అన్ని మోటార్ సైకిళ్ళ కంటే ఇవి చాలా పెద్దవి. ఉష్ణోగ్రత ను మరింత తగ్గించడానికి వెడల్పైన రెక్కలను (fins) అమర్చడం వలన ఇంజన్ అంత త్వరగా వేడి ఎక్కదు. ఉష్ణోగ్రత సమర్దవంతం గా నియంత్రణ చేయడం వలన మోటార్ సైకిల్ సామర్ధ్యం మరింత పెరుగుతుంది. (Bajaj Freedom 125 World’s First CNG Bike)
అన్ని అధీకృత సర్వీస్ సెంటర్ల లో స్పేర్ పార్ట్ లు లభ్యమౌతాయి. మిగిలిన అన్ని రకాల పెట్రోల్ ఇంజిన్ తో కూడిన వాహనాల మాదిరి గానే ప్రతి 5 వేల కిలో మీటర్లకు ఒక సారి సర్వీసింగ్ చేయించాలి.