Yashasvi Jaiswal India England 2nd Test- వైజాగ్ టెస్టు లో జైస్వాల్ భారీ స్కోరు
జైస్వాల్ 179 పరుగులతో భారీ స్కోరు దిశ గా భారత్ … ఆట ముగిసే సమయానికి భారత్ స్కోరు 336/6
వైజాగ్ లో భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రారంభమైన రెండవ టెస్టు లో మొదటి రోజు భారత్ నిలకడగా రాణించింది. యశస్వీ జైస్వాల్ అద్భుతం గా ఆడి సెంచరీ చేయడమే కాకుండా 179 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. భారీ స్కోరు దిశ గా వెళ్తున్న భారత్ ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. భారత జట్టు రెండు మార్పుల తో బరిలోకి దిగింది. రాహుల్, జడేజా స్థానం లో రజిత్ పాటి దార్, ముఖేష్ కుమార్ ఆడుతున్నారు.(Yashasvi Jaiswal India England)
చెలరేగి ఆడిన యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal India England)
మొదటి రోజు మొత్తం ఆటలో హైలెట్ మాత్రం జైస్వాల్ అనే చెప్పవచ్చు. మిగతా బ్యాట్స్ మన్ నుండి అంతగా మద్దతు లభించ నప్పటికీ అద్భుతం గా ఆడాడు. తను వేరే పిచ్ లో అడుతున్నాడా అన్నట్టు ఆడాడు. తరచూ ఫోర్లూ, సిక్సర్ల తో విరుచుకు పడ్డాడు. ఎంతగా చెలరేగి పోయాడంటే… ఒక సిక్సర్ కొట్టి తన సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ దశ లో సెహ్వాగ్ ను గుర్తుకు తెచ్చాడు.
ఇంగ్లాండ్ బౌలర్లు ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా జైస్వాల్ దూకుడు కు కళ్ళెం వెయ్యలేక పోయారు. ఇతర బ్యాట్స్ మన్ నుండి మంచి భాగస్వామ్యం గనక దొరికి ఉంటే ఇంకా పరుగుల వరద పారించే వాడు. ఆట ముగిసే సమయానికి జైస్వాల్ 179 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఈ స్కోరు లో 17 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. టీ 20 మ్యాచ్ ను తలపించే ఇన్నింగ్స్ ఆడాడు జైస్వాల్.
టెస్టు మొదటి రోజే 179 పరుగులు చేయడం తో సచిన్ టెండూల్కర్ జైస్వాల్ ని అభినందిస్తూ “యశస్వీ భవ” అంటూ ‘X’ లో తన అభినందనలు తెలియజేసారు. క్రికెట్ ప్రముఖులందరూ జైస్వాల్ కు అభినందనలు తెలియజేస్తున్నారు. డబుల్ సెంచరీ చేయాలని యావత్ క్రికెట్ అభిమానులు కోరుతున్నారు.
భారత్ బ్యాటింగ్ కొనసాగింది ఇలా….
మొదట బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు ఇన్నింగ్స్ ను రోహిత్, జైస్వాల్ ప్రారంభించారు. రోహిత్ నిదానం గా ఆడాడు. జట్టు స్కోరు 40 పరుగుల వద్ద 14 పరుగులు చేసిన రోహిత్ షోయబ్ బషీర్ బౌలింగ్ లో పోప్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో అరంగేట్రం చేసిన షోయబ్ బషీర్ కి టెస్ట్ క్రికెట్ లో ఇదే మొదటి వికెట్ కావడం విశేషం. తర్వాత గిల్ కూడా జైస్వాల్ కి జతకలిసి స్కోరును ముందుకు తీసుకు వెళ్ళారు. జట్టు స్కోరు 89 పరుగుల వద్ద గిల్ 34 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ అయ్యాడు. వీరి మధ్య 49 పరుగుల భాగస్వామ్యం నెలకొంది.
ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ క్రీజు లోనికి వచ్చాడు. జైస్వాల్, అయ్యర్ మధ్య 90 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. అయ్యర్ 27 పరుగులు చేసిన తర్వాత జట్టు స్కోరు 179 పరుగుల వద్ద 3 వ వికెట్ రూపం లో పెవిలియన్ కి చేరుకున్నాడు.
బ్యాడ్ లక్ రజిత్ పాటి దార్…..
ఈ రోజు టెస్టు ఆరంగేట్రం చేసిన రజిత్ పాటిదార్ బ్యాటింగ్ కి వచ్చాడు. మొదటి టెస్టు అయినప్పటికీ చాలా బాగా ఆడాడు.. దురదృష్టవ శాత్తూ రెహాన్ బౌలింగ్ లో డిఫెన్స్ ఆడబోయి బౌల్డ్ అయ్యాడు. బ్యాట్ కి తగిలి నప్పటికీ బాగా స్పిన్ అయిన బంతి బెయిల్స్ పడగొట్టడం తో అవుట్ అయ్యాడు.
నిరాశ పరచిన శ్రీకర్ భరత్
దీనితో అక్షర్ పటేల్ క్రీజు లోనికి వచ్చ్కాడు. అప్పటికి భారత జట్టు స్కోరు 4 వికెట్ల నష్టానికి 249 పరుగులు. అక్షర్ పటేల్ కూడా త్వరగానే అవుట్ అయ్యాడు. 51 బంతుల్లో 27 పరుగులు చేసిన అక్షర్ పటేల్ జట్టు స్కోరు 301 పరుగుల వద్ద 5 వ వికెట్ గా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత తన స్వంత మైదానం లో బ్యాటింగ్ చెయ్యడానికి వచ్చాడు శ్రీకర్ భరత్. నిదానం గా ఆడిన భరత్ జైస్వాల్ కి మద్దతు గా నిలిచాడు. రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టిన భరత్ రెహాన్ బౌలింగ్ లో బషీర్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. పెద్ద స్కోరు చేస్తాడనుకొన్న భరత్ త్వరగా నే అవుట్ కావడం తో విశాఖ క్రికెట్ అభిమానులు నిరాశ చెందారు. ఆ తర్వాత క్రీజు లోనికి వచ్చిన అశ్విన్ 5 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు.
ఇంగ్లాండ్ బౌలింగ్ ఇలా సాగింది…
ఇంగ్లాండ్ బౌలింగ్ లో జేమ్స్ అండర్సన్ పరుగులు నియంత్రిస్తూ బౌలింగ్ చేసాడు. 41 ఏళ్ల వెటరన్ బౌలర్ అద్భుతమైన ప్రదర్శన తో 3 మేడిన్ ఓవర్లు కూడా బౌల్ చేసి ఒక వికెట్ తీసుకున్నారు. మొదటి టెస్టు ఆడుతున్న 20 ఏళ్ల షోయబ్ బషీర్ మాత్రం చక్కగా బౌలింగ్ చేసి 2 వికెట్లు తీసుకున్నాడు. టెస్ట్ కెరీర్ లో మొదటి వికెట్ గా రోహిత్ శర్మ వికెట్ తీసుకోవడం అతనికి జీవిత కాలం గుర్తు ఉండి పోతుంది. రెహాన్ అహ్మద్ 2 వికెట్లు, టాం హార్ట్లీ ఒక వికెట్ తీసుకున్నారు. ఈ రోజు మొత్తం 93 ఓవర్లు బౌల్ చేయడం విశేషం.(Yashasvi Jaiswal India England)
Vijay Sports News