YES Bank Share Price -52 week high-52 వారాల గరిష్ట ధర ను చేరుకున్న YES Bank షేర్
52 వారాల గరిష్ట ధర 30.45 రూపాయలు కి చేరింది యెస్ బ్యాంక్ షేర్ ధర. గత రెండు రోజులలో ఈ బ్యాంక్ షేర్ ధరలు దాదాపు 17 శాతం కంటే ఎక్కువకు పెరిగాయి. దాదాపు మూడేళ్ళ తరవాత ఈ షేర్ల ధరల్లో కదలిక కనిపించింది. గత నవంబర్ నెలలో ఈ బ్యాంక్ షేర్ ధర 16 రూపాయలు ఉండగా ప్రస్తుతం 30 రూపాయలు కు చేరుకుంది.
52 వారాల గరిష్ట ధరను తాకిన యెస్ బ్యాంక్ షేర్-Yes bank share price
52 వారాల గరిష్ట ధర 30.45 రూపాయలు కి చేరింది యెస్ బ్యాంక్ షేర్ ధర. గత రెండు రోజులలో ఈ బ్యాంక్ షేర్ ధరలు దాదాపు 17 శాతం కంటే ఎక్కువకు పెరిగాయి. దాదాపు మూడేళ్ళ తరవాత ఈ షేర్ల ధరల్లో కదలిక కనిపించింది. గత నవంబర్ నెలలో ఈ బ్యాంక్ షేర్ ధర 16 రూపాయలు ఉండగా ప్రస్తుతం 30 రూపాయలు కు చేరుకుంది. అంటే కేవలం 4 నెలల వ్యవధి లో తొంభై శాతానికి పైగా పెరుగుదల కనిపించింది.Yes bank share price
ఒక్క సారిగా షేర్ ధరలు పెరగడానికి కారణాలు ఏంటి ..?
యెస్ బ్యాంక్ షేర్ ల ధరలు ఒక్కసారిగా ఈ మధ్య కాలం లో ఊపందుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. యెస్ బ్యాంకు లో తన వాటా మొత్తాన్ని పెంచు కోవడానికి హెచ్.డి ఎఫ్ సి బ్యాంకు కు రిజర్వు బ్యాంకు అనుమతి ఇవ్వడం ప్రధాన కారణం. దాదాపు 9.5 శాతానికి తన వాటాలను పెంచుకోవడానికి హెచ్.డి.ఎఫ్.సి బ్యాంకుకు అనుమతి లభించడం తో ఒక్కసారిగా ఇన్వెస్టర్లు యెస్ బ్యాంకు షేర్ ల కోసం ఎగబడ్డారు. దానితో యెస్ బ్యాంకు షేర్ ధర 52 వారాల గరిష్టాన్ని తాకింది.
ఈ ధర మరింత పెరగ వచ్చా….(Yes bank share price)
ఈ ధర మరింత ముందుకు పోవచ్చు అనేది పరిశీలకుల అంచనా. ప్రస్తుతం ౩౦ రూపాయలు ఉన్న ఈ బ్యాంకు షేరు ధర 35 రూపాయలకు చేరుకోవడం కూడా పెద్ద కష్టం కాకపోవచ్చు అనేది నిపుణుల అంచనా. ఈ ర్యాలీ ఇంకా కొన్ని రోజుల పాటు కొనసాగవచ్చు అని షేర్ ధర 45 రూపాయల వరకూ చేరుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. అయితే రిటైల్ ఇన్వెస్టర్ల నుండి బాగా మద్దతు లభించడం తో షేర్ల కొనుగోలు మరింత గా పెరగడం కూడా ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది.
గత సంవత్సరం మార్చి లో పరిస్థతి ఏంటంటే…
గత సంవత్సరం మార్చి నెలలో లాకిన్ పిరియడ్ ముగియడం తో యెస్ బ్యాంకు షేర్లు భారీగా నష్ట పోయాయి. దీర్ఘ కాలం కోసం వేచి చూసే ఉద్దేశ్యం ఉన్న ఇన్వెస్టర్లు మాత్రం 15 రూపాయల వద్ద షేర్లను కొనుగోలు చేసారు. ఒకవేళ మరింత ధర క్షీణించే టట్లు అయితే 12 రూపాయల వద్ద స్టాప్ లాస్ అనుకొని కొనుగోళ్ళు చేసారు. గత మార్చి లో 15.95 రూపాయల వద్ద యెస్ బ్యాంకు షేర్లు ట్రేడ్ అయ్యాయి.
క్యూ – 3 ఫలితాలతో ఇన్వెస్టర్ల లో నమ్మకం
సంవత్సరం తిరిగే సరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది . అంతే కాకుండా యెస్ బ్యాంక్ గత డిసెంబర్ లో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్ తో ముగిసే కాలానికి బ్యాంకు యొక్క నికర లాభం మొత్తం 231.6 కోట్ల రూపాయలు గా ప్రకటించింది. ఇది గత ఏడాది ఇదే త్రైమాసికం లో అనగా క్యూ-3 కంటే దాదాపు 350 శాతం అధికం కావడంతో ఇన్వెస్టర్ల కు మరింత ఆసక్తి పెరిగింది.(Yes bank share price)
హెచ్.డీ.ఎఫ్.సి కి ఆర్.బి.ఐ అనుమతి
350 శాతం వరకూ లాభాలు రావడం తో పాటు ప్రస్తుతం యెస్ బ్యాంకు లో హెచ్.డి.ఎఫ్.సి తన వాటా 9.5 శాతానికి పెంచుకోవడానికి ఆర్.బి.ఐ అనుమతి ఇవ్వడం తో ఇన్వెస్టర్లు షేర్లను ఎగబడి కొంటున్నారు. దీనితో షేరు ధర 52 వారాల గరిష్ట ధరను చేరుకొంది. యెస్ బ్యాంకు తో పాటు ఇండస్ ఇండ్ బ్యాంకు లో కూడా 9.5 శాతం వాటాలను పెంచు కొనేందుకు రిజర్వు బ్యాంకు అనుమతి ఇచ్చింది. ఈ అనుమతి ఒక ఏడాది పాటు చెల్లుబాటు లో ఉంటుంది.
యెస్ బ్యాంకు షేర్ ధర మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అనేది నిపుణులు చెప్తున్న మాట