January 10, 2025

YS Sharmila – ఏపీ లో ప్రస్తుత రాజకీయ సంచలనం

YS Sharmila AP politics

YS Sharmila PCC chief pic credits: Facebook

షర్మిల రాకతో కొత్త పుంతలు తొక్కుతున్న ఏపీ రాజకీయం(YS Sharmila)

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత రాజకీయ సంచలనం షర్మిల అని చెప్పవచ్చు. ఆమె ఏ పార్టీ కి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, ఆమె చేరిన పార్టీ ఎన్నికల్లో గెలుస్తుందో లేదో తెలియనప్పటికీ…. ఆమె మాత్రం ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాలను ఒక ఊపు ఊపుతున్నారని చెప్పవచ్చు.(YS Sharmila)

సిఎం జగన్ పై ప్రతి పక్ష పార్టీలు ఎన్నో ఆరోపణలు చేస్తున్నాయి. కొన్ని మీడియా ఛానళ్ళు కూడా అదే పనిగా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చెయ్యడానికి ప్రయత్నం చేస్తున్నాయి. దాదాపు ఈ ప్రభుత్వం అధికారం లోనికి వచ్చిన దగ్గర నుండి ప్రభుత్వాన్ని అభాసుపాలు చెయ్యడానికి  ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు అయితే ఒక అడుగు ముందుకు వేసి వైసీపీ ని గెలిపించి ప్రజలే తప్పు చేసారని ప్రజల్ని నిందించారు కూడా.. ఇది ప్రజా స్వామ్య స్ఫూర్తి కి విరుద్ధం. ప్రజలకు తమకు నచ్చిన వారికి ఓటు వేసుకొనే హక్కు ఉంటుంది. నచ్చిన ప్రభుత్వాన్ని గెలిపించుకొనే అధికారం వారికి ఉంటుంది.

వైసీపీ పార్టీని, మంత్రులను, ముఖ్య మంత్రి ని  వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాయి ప్రతి పక్షాలూ .. మీడియా ఛానళ్ళు…  అయితే వీళ్ళందరూ ఇంతకాలమూ విషాన్ని చిమ్ముతున్నా ప్రజలు చాలా వరకూ  సీరియస్ గా తీసుకోలేదు…

ఉక్కిరి బిక్కిరి అవుతున్న వైసీపీ(YS Sharmila) 

షర్మిల   ఏపీ కాంగ్రెస్ అద్యక్ష భాద్యతలు చేపట్టిన దగ్గర నుండి  తన అన్న సిఎం జగన్ పై విరుచుకు పడుతున్నారు… గత ఎన్నికల్లో జగనన్న ను గెలిపించండి అంటూ పాదయాత్ర చేసి, ప్రచారం చేసిన షర్మిల ఈ ఎన్నికల్లో అన్న కు పూర్తి వ్యతిరేకం గా ముందుకు పోతున్నారు. ఆమె సుడిగాలి పర్యటనలు చేస్తూ సభల్లో  చేస్తున్న ఆరోపణలు వైసీపీ పార్టీ ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.(YS Sharmila)

చంద్రబాబు, పవన్, ఇతర వామ పక్షాలు, కొన్ని మీడియా ఛానళ్ళు వైసీపీ కి వ్యతిరేకం గా మాట్లాడినప్పుడు రాని భయం ఇప్పుడు వైసీపీ లో కనిపిస్తోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కంటే ఘాటు గా షర్మిల తన అన్న  జగన్ ను విమర్శించడాన్ని తట్టు కోలేక పోతోంది వైసీపీ…

తన అన్నకు వ్యతిరేకం గా మాట్లాడటం వలన కాంగ్రెస్ పార్టీ ఓట్ల శాతాన్ని కొంత వరకూ పెంచు కోవచ్చు అనే ఆశ కొంత కారణం కావచ్చు. అయితే ఆమె మాట్లాడే విధానం చూస్తే  జగన్ పై తీవ్రమైన కక్ష తో రగిలి పోతున్నారేమో అనిపిస్తుంది. ఆస్థి తగాదాలు కావచ్చు.. ఇతర ఏవైనా కుటుంబ పరమైన కారణాలు కావచ్చు.. ఆమె నేరుగానే తన అన్న తో తలపడుతున్నారు అని అనుకోవచ్చు…

జల్సా  సమయం 

ఇటువంటి సందర్భం చంద్రబాబు ఇతర వైసీపీ వ్యతిరేక శిబిరం లో గొప్ప ఆనందాన్ని నింపి ఉండవచ్చు.. తన బద్ద శత్రువు జగన్ ను తన స్వంత చెల్లి  దూషించే విధానం చూసి చంద్రబాబు, పవన్ నిజం గానే అత్యానంద భరితులు అయి ఉంటారు. షర్మిల తెలంగాణా కాంగ్రెస్ లో ఉండటానికి ఎంత మాత్రమూ ఒప్పుకోని రేవంత్ రెడ్డి ఆమెను ఆంధ్ర కు పంపడం లో సఫలీకృతులు అయ్యారు. తన పూర్వ గురువు చంద్రబాబు కళ్ళలో ఆనందం చూడటానికి రేవంత్ రెడ్డి పంపిన బహుమానమే షర్మిల ఆంధ్ర ఎంట్రీ అనే వార్తలు రాష్ట్రమంతా గుప్పు మంటున్నాయి.

అన్నా చెల్లెళ్ళ మధ్య తగాదాలకు నేను ఎలా కారణం అవుతాను అని చంద్ర బాబు అంటున్నారు. “….శత్రువుల ఆర్తనాదములు బహు శ్రవణా నంద కరము గా ఉన్నవి ” అన్నట్టు షర్మిల చేస్తున్న ఆరోపణ లకు వైసీపీ శ్రేణుల ఆర్త నాదాలు టీడీపీ, జనసేన శిబిరం లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి.. ఆమె వెనుక చంద్రబాబు ఉండి ఇవన్నీ చేయిస్తున్నారు అని చాలా మంది నమ్ముతున్నారు…(YS Sharmila)

కూల్ గా పనులు చక్క బెడుతున్న జగన్ ..

YS Sharmila - YS Jagan Mohan Reddy
Sri YS Jagan Mohan Reddy

ఇదంతా ఒక ఎత్తు అయితే జగన్ మాత్రం చాలా కూల్ గా ముందుకు పోతున్నారు.. . కాకినాడ సభలో  కుటుంబాన్ని చీల్చ బోతున్నారు అంటూ ఒక హింట్ ఇచ్చారు .. ఆ తర్వాత జరిగిన సభలో షర్మిల ను ఉద్దేశించి ‘స్టార్ క్యాంపెయినర్’అంటూ మాట్లాడారు. అయితే భీమిలి లో జరిగిన సభలో మాత్రం పూర్తిగా చంద్రబాబు పైనే అస్త్రాలు సంధించారు గాని పవన్ కళ్యాణ్ ని గాని, షర్మిల ని గాని ప్రస్తావించ లేదు. ఈ కురుక్షేత్ర యుద్ధం లో తాను అభిమన్యుడిని కాదని, అర్జునుడి ని అని గర్జించారు… నేను సిద్ధం మీరంతా సిద్ధమేనా అంటూ సవాల్ విసిరారు…. తనపై తీవ్రం గా విరుచుకు పడుతున్న షర్మిల ను వీసమెత్తు మాటైనా అనలేదు.. ఉద్దేశ పూర్వకం గానే ఆమెను పట్టించు కోవడం లేదు అన్నట్టు వ్యవహరించారు.

పీసీసీ చీఫ్ హోదాలో షర్మిల తన అన్నపై తీవ్ర ఆరోపణలు చేయడం టీడీపీ , జనసేన శిబిరం లో ఆనందం నింపుతున్నప్పటికీ … ఒక భయం వారిని వెంటాడు తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును షర్మిల కూడా కొంత వరకూ చీల్చుకు పోతారేమో నని మదన పడుతున్నారు. క్రైస్తవ ఓటర్ల లో చీలిక తెచ్చి కాంగ్రెస్ పార్టీ కి ఆ ఓట్లన్నీ గంప గుత్త గా పడేలా చేసుకోవాలనేది  ఆమె ఆలోచన కావచ్చు. ఈ విషయం లో తన భర్త సహాయం ఆమె తీసుకోవచ్చు…

అన్నా చెల్లెళ్ళ మధ్య రహస్య ఒప్పందం..?

ఇటువంటి ఓట్ల చీలిక టీడీపీ-జనసేన కూటమికి ఎంత మాత్రమూ మేలు చెయ్యదు సరికదా నష్టపోయే పరిస్థితి ఉంటుంది…  చివరికి ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల చీలిక వైసీపీ కే లాభదాయకం గా ఉండొచ్చు.. అందుకే దీనిని అన్నా చెల్లీ కలిసి ఆడుతున్న నాటకం గా కూడా అనేక మంది భావిస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలినప్పుడు కచ్చితం గా అది జగన్ కు ప్లస్ పాయింట్ అవుతుంది..

అన్నా చెల్లెళ్ళ మధ్య రహస్య ఒప్పందం ఏదీ లేకపోతే మాత్రం జగన్ దగ్గర ఉన్న ఒక  వజ్రాయుధం తన తల్లి విజయమ్మ. ఈ ఎన్నికల ప్రచారానికి మళ్ళీ ఆమెను తీసుకు వస్తారని అంటున్నారు. షర్మిల వైసీపీ కి, ప్రధానం గా తన అన్నకు కలిగించిన నష్టాన్ని పూడ్చ గలిగే పని విజయమ్మ  ద్వారా కొంతవరకూ జరగవచ్చు.. కనీసం క్రైస్తవులలో చీలిక రాకుండా ఆమె కొంత వరకూ కాపాడగలరు.

అంతిమ నిర్ణయం ఓటరు దే…

ఇటువంటి గందర గోళ పరిస్థితుల మధ్య ఆంధ్రప్రదేశ్ ఓటరు ఎన్నికలకు వెళ్తున్నారు.. తాను అందించిన సంక్షేమ ఫలాలు మీకు అందితేనే నాకు ఓటు వెయ్యండి అంటూ జగన్ అంటున్నారు. వైసీపీ కి ఓటేస్తే  రాష్ట్రం మరొక  ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది అని చంద్ర బాబు అంటున్నారు. జనసేన టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడం పక్కా అంటున్నారు పవన్ కళ్యాణ్. జగనన్న ను కుర్చీ లో నుండి దింపి వేస్తేనే రాష్ట్రానికి మంచి జరుగుతుంది అని షర్మిల అంటున్నారు.

ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం ఉంది కాబట్టి … ఎవరు ఎన్ని ఆరోపణలు చేసుకుంటున్నప్పటికీ…. అంతిమ నిర్ణయం ఓటరు దే… ఓటరు మనసులో ఏముందో చెప్పడం అంత సులువు కాదు… కాలమే సమాధానం చెప్పాలి…

విజయ్ న్యూస్ డెస్క్