YSRCP manifesto 2024 – దాదాపు ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకటించేసిన జగన్
దాదాపు ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకటించేసిన జగన్-YSRCP manifesto 2024
ఏలూరు దగ్గర దెందులూరు లో వైసీపీ ఏర్పాటు చేసిన ‘సిద్ధమే’ సభ లో నవ్వులు పూయించారు జగన్. ఆద్యంతం ఉత్సాహం గా ఎప్పుడూ లేనివిధం గా బాహాటం గా నవ్వుతూ ఆయన చేసిన ప్రసంగం వైసీపీ అభిమానులను ఉర్రూత లూగించింది.YSRCP manifesto 2024
ఈ సభలో ప్రధానమైన హైలెట్ ఏమిటంటే… వచ్చే ఎన్నికలకు తమ పార్టీ మ్యానిఫెస్టో ను దాదాపు ప్రకటించేసి నట్టే గా చెప్పు కోవచ్చు. నెలనెలా వస్తున్న పెన్షన్ పెరగాలంటే…. జగనన్నకు ఓటు వేయాలి అంటూ పిలుపు నిచ్చారు.. అంతే కాకుండా ప్రస్తుతం అమలు చేస్తున్న అన్ని పథకాలు మళ్ళీ కొనసాగాలంటే మీ జగనన్న ను గెలిపించు కోండి.. అంటూ నర్మ గర్భం గా మానిఫెస్టో గురించి చెప్పకనే చెప్పారు.
పెన్షన్ పెంచబోతున్నట్టు హింట్ ఇచ్చిన జగన్-(YSRCP manifesto 2024)
ఈ రోజు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ప్రసంగాన్ని బట్టి ప్రస్తుత ఎన్నికలకు మ్యానిఫెస్టో ఏ విధం గా ఉండ బోతోందో దాదాపు అంచనా వేయవచ్చు… ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పథకాలు ఎలా ఉన్నవి అలానే కొనసాగుతాయి. ప్రస్తుతం మూడు వేల రూపాయలు గా ఇస్తున్న పెన్షన్ మాత్రం పెంచే యోచన లో ఉన్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ పెరగాలంటే జగనన్నకు ఓటు వేయండి అన్నారు … దీనిని బట్టి పెన్షన్ పెంపు పై కసరత్తు చేస్తున్నట్టు అర్ధం అవుతోంది. సంవత్సరానికి 500 రూపాయల చొప్పున పెంచు కొంటూ పోయే అవకాశం ఉంది. అంటే.. వచ్చే ఐదేళ్ళ లో మరొక 2500 రూపాయలు పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంటే ప్రస్తుతం ఇస్తున్న మూడు వేల రూపాయలతో పాటు ప్రతి ఏటా 500 చొప్పున పెంచు కుంటూ పోతే ఐదేళ్లకు 5500 రూపాయలుకు పెన్షన్ చేరే అవకాశం ఉంది.
ప్రస్తుత పధకాలు అన్నీ కొనసాగుతున్నట్టే….(YSRCP manifesto 2024)
మిగిలిన పథకాలు అన్నీ యధావిధి గా కొనసాగుతాయి అని అవన్నీ మీకు అందాలంటే నాకు ఓటు వేయండి అని అన్నారు జగన్. అందుచేత ఈ పధకాలలో పెద్దగా మార్పు లేదు.
రైతు ఋణ మాఫీ గురించి ..?
అయితే రైతులకు ఋణాలు మాఫీ చేస్తారని దానిపై పూర్తి స్థాయి లో సమాచారాన్ని సేకరించి రైతు ఋణ మాఫీ ని ఈసారి అస్త్రం గా వాడబోతున్నారు అనే అంశం చాలా రోజులు గా చర్చ కు వస్తున్నది. ఇప్పటికైతే ఈ విషయం గురించి ఏమీ ప్రస్తావించ లేదు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంటుందా..?
తెలంగాణా లో ప్రస్తుతం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం పథకం ఆంధ్ర లో కూడా ప్రవేశ పెట్టబోతున్నారు అనే పుకార్లు వ్యాపించాయి. కాని అటువంటి నిర్ణయం ఏదీ తీసుకొనే పరిస్థితి లేదు అని తెలుస్తోంది. మరొక ప్రక్క రాష్ట్రం లోని ఆటో డ్రైవర్లు ఇప్పటికే ఈ విషయమై తమ ఆందోళనలు తెలియజేస్తున్నారు.. అంతే కాకుండా ఆటో డ్రైవర్లకు ప్రతి సంవత్సరం పది వేల రూపాయలు రెన్యువల్ ఇతర ఖర్చుల కోసం ఇస్తున్నది.. ఇటువంటి పరిస్థితి లో ఆటో లకు బిజినెస్ లేకుండా చేసే ఈ మహిళా ఉచిత బస్సు ప్రయాణ పథకం ఆంధ్రప్రదేశ్ లో ప్రకటించక పోవచ్చు. అయితే ప్రతిపక్ష నాయకుడు ఇప్పటికే ఈ పథకాన్ని ప్రకటించి ఉన్నారు. తాము అధికారం లోనికి వచ్చిన వెంటనే తెలంగాణా లో మాదిరి ఈ పధకాన్ని అమలు చేస్తామని చెప్తున్నారు. అయితే జగన్ సర్కార్ మాత్రం ఈ విషయం లో ఆచి తూచి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.
తా నొప్పింపక అన్నట్టు బస్సులలో ప్రయాణం చేసే విద్యార్దినులకు, అరవయ్యేళ్ళు పై బడిన వృద్ధులకు ఉచిత బస్సు ప్రయాణం పై సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
అమ్మ ఒడి పరిస్థితి ఏంటి?
అమ్మ ఒడి ఇంట్లో పిల్లలు అందరికీ వర్తింపు వంటి పథకాలు టీడీపీ ఇప్పటికే ప్రకటించింది కాబట్టి జగన్ వాటి వైపు వెళ్ళే అవకాశం ఉండక పోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత ఎన్నికలకు విడుదల చేయబోయే మ్యానిఫెస్టో మాత్రం సూటిగా, సుత్తి లేకుండా కేవలం రెండు లేదా మూడు పేజీలలో మాత్రమే ఉండే అవకాశం ఉంది. రైతుల కోసం ఏదైనా అనూహ్య పథకం కూడా ప్రకటించే అవకాశం లేకపోలేదు.
ఉర్రూత లూగించిన జగన్ ప్రసంగం ..
ఎప్పుడూ చెప్పే విషయాలే చెప్పినప్పటికీ .. జనానికి బాగా అర్ధమయ్యే విధం గా చిన్న చిన్న ఉపమానాలతో వివరించిన తీరు నచ్చడం తో వైసీపీ అభిమానుల కేరింతలతో సభా ప్రాంగణం మారుమ్రోగి పోయింది.
జగన్ ప్రసంగం లో హైలెట్స్ ..
నా కోసం ఒకసారి నొక్కండి బటన్…!
తాను ఇప్పటికి వివిధ సంక్షేమ పధకాల కోసం 124 సార్లు బటన్లు నొక్కానని… ఓటర్లు ఒక్కసారి బటన్ నొక్కి తనను గెలిపించాలని కోరారు.
రా… కదలి రా….అంటూ టీడీపీ ని ఊచకోత…
రా.. కదలిరా అంటున్న చంద్రబాబు అటు పవన్ కళ్యాణ్ ను, ఇటు పురందేశ్వరి (పేరు ప్రస్తావించలేదు)ని, రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీ వారిని కదలి రమ్మంటున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గురించి ప్రస్తావిస్తూ దానిని రాష్ట్ర ద్రోహుల పార్టీ గా అభివర్ణించారు. షర్మిల పేరు ప్రస్తావించకుండా కాంగ్రెస్ పార్టీ ని మాత్రం ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీ అన్నారు
చంద్రముఖి పీడ శాశ్వతం గా వదిలించండి…(YSRCP manifesto 2024)
చంద్రబాబు చంద్ర ముఖి లా మారి టీ గ్లాసు పట్టుకొని సైకిల్ ఎక్కాలను కొంటున్నారని, ఆ సైకిల్ తొక్కడానికి ఇద్దరు, తుడవటానికి ఇద్దరు అంటూ ఎద్దేవా చేసారు. గత ఎన్నికలలో బాక్సు లో బంధించిన చంద్రముఖి పీడ ఇంక ఉండదు… చంద్రముఖి సినిమా చూసారా .. చూసారా …లక లక లక అంటూ రెట్టించి మరీ అడిగి సభలో నవ్వులు పూయించారు.
కంచె దాటి, పహారా దాటి అభిమాని జగన్ తో సెల్ఫీ…….
మనం చేసిన మంచిని ప్రతి గడప దగ్గరకూ వెళ్లి తెలియజేయండి మీరే నాకు స్టార్ క్యాంపెయినర్లు .. అంటూ పిలుపు నిచ్చారు. ప్రసంగం తర్వాత ర్యాంప్ పై నడుచుకుంటూ వచ్చి ప్రజలకు అభివాదం చేసారు… ఒక అభిమాని క్రింద ఉన్న కంచెను, పోలీసు పహారా ను దాటుకొని రాంప్ పైకి వెళ్లి జగన్ తో సెల్ఫీ తీసుకున్నాడు.. రాంప్ మీదకు దూసుకు వస్తున్న అభిమానులను అదుపు చెయ్యడం ఒక పట్టాన సెక్యూరిటీ సిబ్బంది కి తలనొప్పి గా పరిణమించింది…
జనం మధ్యలో జండా ఊపుతూ పేర్ని నాని…
అయితే జగన్ రాంప్ పై ప్రజలకు అభివాదం చేస్తున్నపుడు క్రింద ఉన్న జనం లో ఒకడిగా జండా ఊపుతూ పేర్ని నాని కనిపించారు. పేర్ని నాని ని రాంప్ పైకి రావలసింది గా జగన్ పలుమార్లు పిలిచినప్పటికీ .. పర్వాలేదు పర్వాలేదు అంటూ…. జండా ఊపుతూ నిలబడ్డారు.. అంతకు ముందు అభిమానులను తీసుకొని స్వయం గా తానే బస్ నడుపుకొంటూ సభా ప్రాంగణానికి చేరుకున్నారు పేర్ని నాని.