27 మంది తో YSRCP Second List విడుదల
27 మంది తో YSRCP Second List విడుదల.. YSRCP Second List released
రెండవ సారి ఎలాగైనా అధికారం లోనికి రావాలని వ్యూహాలు రచిస్తున్న వైసీపీ కాంగ్రెస్ పార్టీ నియోజక ఇంచార్జ్ ల రెండవ జాబితా విడుదల చేసింది.
ysrcp second list released
ఈ జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేసారు. చాలా చోట్ల అభ్యర్ధులను మార్చారు. అలాగే కొన్ని క్రొత్త ముఖాలను కూడా తెర మీదకు తీసుకు వచ్చారు.. మొదటి విడత గా 11 మంది లిస్టు విడుదల చేసిన వై ఎస్ జగన్ తాజాగా 27 మంది తో రెండవ జాబితా కూడా విడుదల చేసారు.
ఈ జాబితా లో కొందరు ఆశావహులకు చోటు దక్కలేదు.. అనూహ్యం గా కొందరికి అవకాశం దొరికింది. ప్రస్తుతం ఎం పీ లు గా ఉన్న కొంత మందిని ప్రస్తుతం అసెంబ్లీ నియోజక వర్గాలకు ఇంచార్జ్ లు గా నియమించారు. వై నాట్ 175 అంటూ ప్రస్తుత ఎన్నికల నగారా మ్రోగించిన వైసీపీ మరిన్ని మార్పులు తధ్యం అని చెప్తూనే ఉంది. పరిస్థితి సరిగ్గాలేని నియోజక వర్గాలలో ఆయా ఎమ్మెల్యే లకు ముందుగానే సమాచారం ఇచ్చారు.. మార్పుకు సహకరించాలని, ఇప్పుడు సీట్లు పొందలేని వారికి పార్టీ లో తగిన ప్రాధాన్యత ఇస్తామని , తొందర పడవద్దని భరోసా ఇస్తున్నారు జగన్.
ఈ జాబితా లో మొత్తం ఐదుగురు వారసులకు సీట్లు దక్కాయి:
పేర్ని నాని కుమారుడు పేర్ని కృష్ణమూర్తి కి మచిలీపట్నం
భూమన కరుణాకర రెడ్డి కుమారుడు అభినయ్ రెడ్డి కి తిరుపతి
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మొహిత్ రెడ్డి కి చంద్రగిరి
పిల్లి సుభాష్ చంద్ర బోస్ కుమారుడు సూర్య ప్రకాష్ కు రామచంద్రాపురం
షేక్ ముస్తఫా కుమార్తె నూరి ఫాతిమా కు గుంటూరు ఈస్ట్ నియోజక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తారు
నలుగురు ఎంపీ లకు ఎమ్మెల్యే అభ్యర్ధులు గా అవకాశం లభించింది :
మార్గాని భరత్ కు రాజమండ్రి సిటీ, వంగా గీత కు పిఠాపురం , గొడ్డేటి మాధవి కి అరకు , తలారి రంగయ్యకు కళ్యాణ దుర్గం అసెంబ్లీ నియోజక వర్గాలకు ఇంచార్జ్ లు గా నియమించారు. దీనితో ఇప్పటివరకు ఎంపీ లుగా ఉన్న వీరు ఎమ్మెల్యే లు గా పోటీ పడబోతున్నారు.
ఈ రెండవ లిస్టు లో మొత్తం 16 మంది కొత్తవారికి అవకాశం లభించింది.
హిందూ పురం నుండి జె.శాంత, రాజాం నుండి డా. రాజేష్, అనకాపల్లి నుండి మలసాల భరత్, రామచంద్రాపురం నుండి పిల్లి సూర్య ప్రకాష్, పి.గన్నవరం నుండి విప్పర్తి వేణుగోపాల్, జగ్గంపేట నుండి తోట నరసింహం, పోలవరం నుండి తెల్లం రాజ్యలక్ష్మి, కదిరి నుండి మక్బూల్ అహ్మద్, యర్రగొండ పాలెం నుండి తాటిపర్తి చంద్ర శేఖర్, ఎమ్మిగనూరు నుండి మాచాని వెంకటేష్, మచిలీపట్నం నుండి పేర్ని కిట్టు, తిరుపతి నుండి అభినయ్ రెడ్డి, చంద్రగిరి నుండి మోహిత్ రెడ్డి , గుంటూరు ఈస్ట్ నుండి ఫాతిమా మొదలైన వారు క్రొత్త అభ్యర్ధులు గా రంగం లోనికి దిగబోతున్నారు .
జాబితా లోని అభ్యర్ధుల వివరాలు ఈ విధం గా ఉన్నాయి.
- అనంతపురం ఎంపీ -శ్రీ మాలగుండ్ల శంకర నారాయణ
- హిందూపురం ఎంపీ – శ్రీమతి జోలదరాశి శాంత
- అరకు ఎంపీ (ఎస్టీ) – శ్రీమతి కొట్టగుళ్ళి భాగ్యలక్షి
- రాజాం (ఎస్సీ) – డాక్టర్ తాలె రాజేష్
- అనకాపల్లి – శ్రీ మలసాల భరత్ కుమార్
- పాయకరావు పేట (ఎస్సీ) – శ్రీ కంబాల జోగులు
- రామచంద్రాపురం – శ్రీ పిల్లి సూర్య ప్రకాష్
- పి. గన్నవరం (ఎస్సీ)- శ్రీ విప్పర్తి వేణుగోపాల్
- పిఠాపురం- శ్రీమతి వంగా గీత
- జగ్గంపేట- శ్రీ తోట నరసింహం
- ప్రత్తిపాడు – శ్రీ వరుపుల సుబ్బారావు
- రాజమండ్రి సిటీ – శ్రీ మార్గాని భరత్
- రాజమండ్రి రూరల్ – శ్రీ చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ
- పోలవరం (ఎస్టీ) – శ్రీమతి తెల్లం రాజ్యలక్ష్మి
- కదిరి – శ్రీ బి.ఎస్. మక్బూల్ అహ్మద్
- ఎర్రగొండ పాలెం (ఎస్సీ) – శ్రీ తాటిపర్తి చంద్రశేఖర్
- ఎమ్మిగనూర్ – శ్రీ మాచాని వెంకటేష్
- తిరుపతి – శ్రీ భూమన అభినయ్ రెడ్డి
- గుంటూరు ఈస్ట్ – శ్రీమతి షేక్ నూరి ఫాతిమా
- మచిలీపట్నం – శ్రీ పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)
- చంద్రగిరి – శ్రీ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
- పెనుగొండ – శ్రీమతి కే.వి. ఉషా శ్రీ చరణ్
- కళ్యాణ దుర్గం – శ్రీ తలారి రంగయ్య
- అరకు (ఎస్టీ) – శ్రీమతి గొడ్డేటి మాధవి
- పాడేరు (ఎస్టీ) – శ్రీ మత్స్యరాస విశ్వేశ్వర రావు
- విజయవాడ సెంట్రల్ – శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు
- విజయవాడ వెస్ట్ – శ్రీ షేక్ ఆసిఫ్